అనుకున్న కాలానికి పుంజులను గోదాలోకి దింపారు. మాచెర్ల పందెగాడు “గోపన్న” బ్రహ్మనాయుడి చేతిలోంచి పుంజును తీసుకున్నాడు. బ్రహ్మనాయుడు పుంజు రెక్కలను నిమిరి నెమ్మదిగా “మా భవిష్యత్తు నీ మీద ఆధారపడి వున్నది” అన్నాడు. మాచెర్ల పుంజు “కొక్కొరొక్కో” అని విజయగీతం…
Category: పల్నాటి వీరభారతం
పల్నాటి వీరభారతం – కండ కలిగిన తెలుగు వీరగాధ – Download eBooks
అధ్యాయం 9 – పల్నాటి వీరభారతం
ఆత్మ గౌరవం కోసం ఈ పందానికి ఒప్పుకున్నాడన్న మాటేగానీ, బ్రహ్మన్నకు ఎందుకనో బెరుగ్గానే వున్నది. ఈ పందాలవల్ల సంభవించే విపరీత పరిణామాలు ఊహించలేని అమాయకుడు కాడు బ్రహ్మన్న. పాచికలాటతో కురు-పాండవ యుద్ధం సంభవించింది. మరి ఈ కోడిపోరు ఏం తెచ్చిపెట్టనున్నదో?…
అధ్యాయం8 – పల్నాటి వీరభారతం
బ్రహ్మనాయుడికి మాల కన్నమదాసు ఎలా ముఖ్యుడో, నాయకురాలు నాగమ్మకు “వీరభద్రుడు” అంతే ముఖ్యుడు. వీరకన్నమదాసు-వీరభద్రుడూ ఒకేరకపు గొప్ప యోధులు. వీరత్వానికి పల్నాటి ప్రతీకలు. మనిషి కన్నా భయంకరమైన జంతువుగానీ, అవిశ్వాసకరమైన ప్రాణిగానీ మరొకటి లేదు. మనిషి పాలు తాగి పెరిగిన…
అధ్యాయం 7-పల్నాటి వీరభారతం
గురజాలకు పశ్చిమంగా ప్రవహించే నది “చంద్రవంక” – నదుల్లో అందమైన పేరున్న చంద్రవంక పరమ పావనమైనదని పల్నాటి ప్రజలు అభిప్రాయపడతారు. ఈ చంద్రవంక నదీ తటానే, బ్రహ్మనాయుడు వూరును వెలయింపజేసి “మాచెర్ల” అని పేరు పెట్టాడు. కొంతకాలం తర్వాత అది…
అధ్యాయం 6 – పల్నాటి వీర భారతం
గండు కన్నమకూ – రేఖాంబకు వున్న ఒకే ఒక కూతురు “మాంచాల” – అపురూపంగా పెరిగింది. ఇటు పేరిందేవి ఎంత గారాల కూచో, అటు మాంచాలా అంతే గారాల కూచి. పేరిందేవి అందం జాతిపూవు చందమైతే – మాంచాల అందం…
అధ్యాయం 6 – పల్నాటి వీరభారతం
గండు కన్నమకూ – రేఖాంబకు వున్న ఒకే ఒక కూతురు “మాంచాల” – అపురూపంగా పెరిగింది. ఇటు పేరిందేవి ఎంత గారాల కూచో, అటు మాంచాలా అంతే గారాల కూచి. పేరిందేవి అందం జాతిపూవు చందమైతే – మాంచాల అందం…
అధ్యాయం 5-పల్నాటి వీరభారతం
పల్నాటి ప్రభువులు రాజమందిరాల్లో పుచ్చుకునే ఖరీదైన పానీయంలాగా, “దుర్బోధ” అనే విషం నెమ్మది నెమ్మదిగా నలగాముని తలకెక్కటం మొదలుబెట్టింది. కాసేపటికి నలగాముడు తల పైకెత్తి “ఇప్పుడు నన్నేం చేయమంటావు?” “తమరు ఆనతిస్తే – సైనికబలంతో చోరాగ్రగణ్యులన్నవాళ్ళను వారం రోజుల్లో అణచివేయిస్తాను.…
అధ్యాయం 4-పల్నాటి వీరభారతం
అనుగురాజు తర్వాత పల్నాటి ప్రభువైన నలగామరాజు కూతురు పేరిందేవి. నలగామరాజుకు పేరిందేవి ఏకైక సంతానం. పల్నాటికంతా అందమైన పిల్ల. నాయనమ్మ మైలమాదేవి దగ్గర ఆ పిల్లకు గారాబమైతే, చిన్నాన్న నరసింగరాజు పేరిందేవిని కంటికి రెప్పల్లే చూసుకుంటాడు. (నలగామరాజూ భార్య మరణించి…
అధ్యాయం 3- పల్నాటి వీరభారతం
బ్రహ్మనాయుని భార్య ఐతాంబ. మహాసాధ్వి. ఐతాంబలాంటి స్త్రీలు బాలచంద్రుడిలాంటి మహావీరుల్ని కనకపోతే, తెలుగుల చరిత్రలో విలువైన, వెలలేని వీరసాహిత్యం లభించకపోయివుండేదేమో? ఎంతకాలానికీ పిల్లల్లేని బ్రహ్మనాయుడి భార్య, చెన్నకేశవుణ్ణి మొక్కుకుని, గజనిమ్మపళ్ళ వ్రతం చేస్తే – లేకలేక కల్గిన బిడ్డడు బాలచంద్రుడు.…
అధ్యాయం 2- పల్నాటి వీరభారతం
పల్నాటి చరిత్ర కాలచక్రంలో పదిహేనేళ్ళు తిరిగిపోయాయి. రాజవిలాసాల్లో ముఖ్యమైనది – వేట. ఒకసారి అనుగురాజు తన పరివారాన్ని వెంటబెట్టుకుని కారాటవికి వేటకెళ్ళాడు. పగలల్లా వేటాడి అలిసిపోయిన శరీరం పులిసిపోయింది. జవనాశ్వాలు సాలితో రొప్పుతూ జిట్టగామాలపడు, నాగులేటి ఒడ్డుకొచ్చాయి. ఇప్పుడు “అనుగురాజు”కు…