Akshay Tritiya – Meaning & Purport as per Shastras

Spread the love
Like-o-Meter
[Total: 2 Average: 4.5]

 

Hinduism

Everyone in this world is in pursuit of happiness, though they have little idea as to what is an absolute happiness or what action or entity can bring them happiness.

No one can decipher the word ‘happiness’ and neither they can offer single definition to it.

Happiness is a relative term that changes its meaning from person to person and from one experience to another. Many intellectuals have tried to address this prosody

Hindu culture is undoubtedly the most ancient culture in the world. It is very difficult to fix a particular time-frame as to when this culture has come into existence. But it has remained as force to reckon with for more than five millenniums.

What is Unique about Hinduism

Our experience says that everything in this world must be investigated by adopting the right ways and methods. Many efforts have been put in the past and are being continued in the contemporary times to understand every aspect that exists on our planet. This urge to know everything has made the modern science to grow by leaps and bounds through inventions, discoveries and breakthroughs. Unforgettable milestones were achieved in several fields. But there are many subjects that are like juggernauts and still remain as unresolved mysteries.

Religious believes start simmering around these unfathomable secrets and try to answer them in their own mystical ways most of which may not find the scientific support.

Hinduism is somewhat unique in its approach in deciphering the hidden secrets of human life. The seers and sages of ancient India have seen many things without telescopes or microscopes yet made vivid descriptions of celestial bodies and fetus!

Ancient Indian sages have compiled Garbha Upanishad (Sacred doctrine of fetus or womb). It discusses about how the conception happens and the various developmental stages of fetus. More surprisingly, it talks about what fetus ‘thinks’ while resting and developing in the womb! That is more fascinating, isn’t it? Similarly, the festivals of Hinduism too are peculiar in their original mean which may not reflect in their celebrations.

Akshay Trithiya

One of the prominent festivals in India, Akshay Trithiya has got many variations and stories attached with it. But what is the real meaning of celebrating Akshay Trithiya? Let us see it in the next few paragraphs of this article.

 

Buy Rearming Hinduismon Amazon

Meaning & Purport of Akshay Trithiya

In Samskrutam (Sanskrit language) Akshay means imperishable and Thritiya indicates the day three of either full moon or no moon fortnight of Hindu lunar calendar. Thus we can draw a very generic meaning of “The Imperishable Third Day”. But is that all we can know from this phrase?

Not at all but there is more to it. Sanskrit language is the most encrypted language amongst all the languages in the world. Every word and alphabet shall carry many meanings and need to be deciphered carefully.

The word Akshay also denotes the Supreme Godhead i.e. Vishnu who is the absolute imperishable one.  Thus we can derive another meaning that His presence can be felt in multitude on Akshay Trithiya (the third day of Bright half day of the Hindu month Vaishakha), because Akshay also means endless. It is the day on which one has to meditate, worship and praise the Lord Vishnu endlessly to gain His grace in abundance.

But today the meaning of Akshay Thritiya has been minimized to mere buying of gold. It has been considered as an auspicious day to start new business or to conduct house warming ceremony etc.  These are some of the ecstatic moments for anyone but the purport of the festival should not be lost in the lust for material comforts.

So, let us celebrate this Akshay Thritiya by digging little deeper into our souls!

*****

 

6 thoughts on “Akshay Tritiya – Meaning & Purport as per Shastras

  1. నమస్కారం రఘోత్తమరావు గారు!! దయచేసి ఈ వ్యాసాన్ని (వీలైతే మరికొన్ని విషయాలనూ కలిపి) తెలుగులో అందించమని మనవి. రాబోయే *అక్షయ తృతీయా* కి మాకు ఉపకరించగలదు!! ధన్యవాదములు

    భవదీయుడు
    – శశికుమార్

      1. ధన్యవాదములు రఘోత్తమ రావు గారు!! ఈ క్రింది వివరణ (మత్స్యపురాణాన్తర్గతంగా) నేను వ్రాసుకున్న నోట్స్ మీకేమైనా ఉపకరిస్తే అదే పదివేలు!!.

        అక్షయతృతీయా వ్రతము
        ఈశ్వర ఉవాచ:-
        అథాన్యామపి వక్ష్యామి తృతీయాం సర్వకామదామ్‌ | యస్యాం దత్తం హుతం జప్తం సర్వం భవతి చాక్షయమ్‌ || 1
        ఈశ్వరుడు పార్వతికి ఇట్లు చెప్పెను: సర్వకామప్రదమగు మరియొక తృతీయావ్రతమును చెప్పెదను. ఈ తృతీయా దినమున చేసిన దానము, హోమము, జపము ఏదియైనను అక్షయఫలప్రదమగును.

        వైశాఖశుక్లపక్షేతు తృతీయాయాముపోషితః | అక్షయం ఫలమాప్నోతి సర్వస్య సుకృతస్య చ || 2
        సా తథా బ్రమ్మణోపేతా విశేషేణతు పూజితా | తత్ర దత్తం హుతం జప్తం సర్వమక్షయముచ్యతే || 3
        వైశాఖ శుక్ల తృతీయా తిథి బ్రహ్మదేవునితో చేరియుండునది. అందుచే విశేషించి పూజ్యమయినది. కనుక ఈనాడు ఉపవసించి ఏ పుణ్యకర్మ మాచరించినను అక్షయఫలము లభించును.

        అక్షయానన్తతిస్తు స్యాత్తస్యాం సుకృతమక్షయమ్‌ | అక్షయైః పూజ్యతే విష్ణుస్తేన సాప్యక్షయా స్మృతా || 4
        ఈ తిథినాడు క్షయములేని శాశ్వతోపానరకులచే విష్ణువు పూజింపబడును. కావుననే దీనికి అక్షయతృతీయా అని పేరు.

        అక్షతైస్తు నరస్స్నాతో విష్ణోర్దత్వా తథాఽక్షతా | విప్రేషు దత్వా తానేవ తథాసక్తాంత్సుసంస్కృతా || 5
        తదన్నభుఙ్మహాభాగ ఫలమక్షయమశ్నుతే | ఏకామప్యుక్తవత్కృత్వా తృతీయాం విధివన్నరః || 6
        ఈనాడు అక్షతోదకముతో స్నానము చేసి వాటిని విష్ణునిపై ఉంచి అర్చించి వాటిని చక్కగా సంస్కరించి బ్రాహ్మణులకు దానము చేసి వాటి అన్నమునే తినినచో ఈ చెప్పిన ఫలము తప్పక లభించును.

        ఏతా మను తృతీయాయాం సర్వాసాంతు ఫలం లభేత్‌ | తృతీయాయాం సమభ్యర్చ్యసోపవాసో జనార్దనమ్‌ |
        రాజసూయఫలం ప్రావ్య గతిమగ్ర్యాం చ విన్దతి || 7
        ఇట్లు ఒక వైశాఖ శుక్ల తృతీయనాడైనను మానవుడు యథావిధిగా ఈ చెప్పినట్లు చేసి దాని తరువాత వచ్చు ప్రతీ శుక్ల తృతీయయందును 12 మాసముల శుక్ల తృతీయలందును ఉపవసించి విష్ణుని అర్చించినచో రాజసూయ యాగము చేసినంత ఫలమునంది ముక్తినందును. {అక్షతలు అనగా ఏ మాత్రమును విరుగక, శక్తి తరుగక నిలిచియున్న బియ్యము – అవి వరి ధాన్యము నుండి కాని యవ[బార్లీ]ల నుండి కాని గోధుమల నుండి కాని తీసినవి కావచ్చును. ఇట్టి వరిబియ్యముతో కాని యవల, గోధుమల పిండితో కాని సిద్ధపరచిన ఆహారము అక్షతాన్నము}

        ఇతి శ్రీమత్స్యమహాపురాణే మత్స్యమనుసంవాదే అక్షయతృతీయా వ్రతకథనం నామ పఞ్చషష్టితమోఽధ్యాయః.
        ఇది శ్రీమత్స్యమహాపురాణమున అక్షయతృతీయావ్రతకథనమను 65వ అధ్యాయము

        1. అక్షయ తృతీయ నాడు గంగాతీరమున యధావిధిగా ఘృతధేనుదానమును గావించిన వానికి కలుగు ఫలము
          కల్పకోటి సహస్రాణి కల్పకోటి శతాని చ | సహస్రాదిత్య సంకాశః సర్వకామ సమన్వితః || 46
          హేమరత్నమయే చిత్రే విమానే హంసభూషితే | స్వకీయ పితృభిః సార్థం బ్రహ్మలోకే మహీయత్‌ || 47
          సహస్రాదిత్య సంకాశుడై సర్వకామ సమన్వితుడై హెమరత్నమయము చిత్రము హంస భూషితమగు విమానమున పితరులతో కలిసి కల్పకోటి శతములు, కల్పకోటి సహస్రములు బ్రహ్మలోకమున విరాజిల్లును.

          తతస్తు జాయతే విప్రో గంగాతీరే ధనాన్వితః | అన్తే తు బ్రహ్మవిద్భూత్వా మోక్షమాప్నోత్య సంశయః || 48
          తరువాత గంగాతీరమున ధనవంతుడగు విప్రునిగా పుట్టును. అంతమున బ్రహ్మజ్ఞానియై మోక్షమును పొందును.

          తథైవ గో ప్రదానం చ విధినా కురుతే తు యః | గోలోమసంఖ్య వర్షాణి స్వర్గలొకే మహీయత్‌ || 49
          అట్లే యథావిధిగా గోదానమును చేసినవాడు గోలోమసంఖ్యావత్సరములు {గో పుచ్ఛము [ఆవు తోక]లో ఎన్ని కేశములుండునో అన్ని వత్సరాలు} స్వర్గలోకమున విరాజిల్లును.

          జాయతే చ కులే పశ్చాద్ధనధాన్య సమాకులే | రత్నకాంచన భూపూర్ణే శీలవిద్యాయశోన్వితే || 50
          స భుక్త్వా విపులాన్భోగాన్పుత్రపౌత్ర సమన్వితః | మోక్షభాగీ భవేన్నూనం నాత్ర కార్యా విచారణా || 51
          తరువాత ధనధాన్య సమాకులము, శీలవిద్యాయశోయుతము రత్నకాఞ్చన భూపుర్ణమగు కులమున పుట్టి పుత్రపౌత్ర సమన్వితుడై వివిధ భోగములననుభవించి మోక్షమునునుభవించును.

          కపిలా యది దత్తా స్యాత్‌ విధినా వేదపారగే | నరకస్థాన్పితౄన్సర్వాన్‌ స్వర్గం నయతి వై తదా || 52
          గంగా తీరమున యథావిధిగా వేదపారంగతుడగు విప్రునికి ‘కపిల’గోదానమును గావించినచో నరకములలోనున్న పితరులనందరు స్వర్గమును చేరెదరు.

          భూమిం నివర్తనమితాం గంగాతీరే దదాతి యః | భూవిరేణు ప్రమాణాబ్దం బ్రహ్మ విష్ణుశివాతిగః || 53
          జాయతే వా పునర్భూమౌ సప్తద్వీప పతిర్బవేత్‌ | భేరీ శంఖాది నిర్ఘోషైర్గీతవాదిత్రనిః స్వనైః || 54
          గంగాతీరము నివర్తనమితమగు {నివర్తనమనగా సప్తహన్తమితమగు ముప్పది దండముల పొడుగు.} భూమిని దానము చేసినవాడు భూమిరేణుప్రమాణాబ్దములు బ్రహ్మ, విష్ణు, శివ లోకములలో నివసించి మరల భూమి యందు పుట్టి సప్తద్వీపాధిపతియగును. ఇతను నిదురించినచో భేరీ[నగారా]శంఖాది ధ్వనులచే మేల్కాంచును.

          స్తుతిభిర్మాగధానాం సుప్తోసౌ ప్రతిబుధ్యతే | సర్వసౌఖ్యాన్యవాప్యేహ సర్వధర్మపరాయణః || 55
          నరకస్థాన్పితృన్సర్వాన్ప్రాపయిత్వా దివం తథా | స్వర్గస్థితాన్మోక్షయిత్వా స్వయం జ్ఞానీ చ మోహిని || 56
          అన్తే జ్ఞానాసినా ఛిత్వా అవిద్యాం పఞ్చపర్వికాం | పరం వైరాగ్యమాపన్నః పరం బ్రహ్మాధి గచ్ఛతి || 57
          సర్వధర్మపరారుణుడై సర్వసౌఖ్యములనునుభవించి, నరకములోనున్న పితరులనందరి స్వర్గమున చేర్చి, స్వర్గమున నున్న వారిని మోక్షమున చేర్చి స్వయముగా జ్ఞానియై పంచపర్వికయగు అవిద్యను జ్ఞాన ఖడ్గముచే ఛేదించి పరమవైరాగ్యమున పొంది పరబ్రహ్మను చేరును.

          సప్తహస్తేన దండేన త్రింశద్దండా నివర్తనమ్‌ | త్రిభాగ హీనం గోచర్మ మానమాహ విధిః స్వయమ్‌ || 58
          నివర్తనమనగా సప్తహన్తమితమగు ముప్పది దండముల పొడుగు. దీనిలో త్రిభాగహీనమగుచో గోచర్మ ప్రమణాముగా చెప్పబడినది.

          గ్రామం గఙ్గా తటే యో వై బ్రహ్మణేభ్యః ప్రయచ్ఛతి | బ్రహ్మ విష్ణు శివప్రీత్యై దుర్గాయా భాస్కరస్య చ || 59
          సర్వదానేషు యత్పుణ్యం సర్వయజ్ఞేషు యత్ఫలం | తపోవ్రతేషు పుణ్యేషు యత్ఫలం పరికీర్తితమ్‌ || 60
          సహస్ర గుణితం తత్తు విజ్ఞేయం గ్రామదాయినః | సూర్యకోటి ప్రతీకాశే విమానే వైష్ణవే పురే || 61
          క్రీడతే శాఙ్కరే వాపి స్తుతో దేవాదిభిర్ముదా | భూమిరేణ్వబ్ద సంఖ్యాకం కాలం స్థిత్వాచ తత్ర సః || 62
          బ్రహ, విష్ణు, శివ, దుర్గా మరియు సూర్యుని ప్రీతి కొరకు గంగాతీరమున గ్రామదానమును చేసినవాడు సర్వదానములందు, సర్వయజ్ఞములందు తపోవ్రతాది పుణ్యకార్యములందు కలుగు సమస్త ఫలమునకు వేయిరెట్లధికమగు ఫలమును పొందును. కోటి సూర్యసంకాశమగు విమానమున విష్ణుపురమున శివపురమున కాని దేవాదులచే స్తుతించబడుచు క్రీడించును.

          అణిమాది గుణౖర్యుక్తే యోగినాం జాయతే కులే | అక్షయాయాం తు యో దేవి స్వర్ణం షోడశమాసికం || 63
          ఆ లోకములలో భూరేణుమిత వత్సరములు నివసించి అణిమాది గుణయుక్తమగు యోగి కులమున పుట్టును. అక్షయ తిథియందు పదునారు మాస{తులములో 12వ భాగము [5 గురిగింజల యెత్తు]}మితమగు స్వర్ణమును…

          దదాత ద్విజముఖ్యాయ సోఽపి లోకేషు పూజ్యతే | అన్నదానాద్విష్ణులోకం శైవం వై తిలదానతః || 64
          విప్రునకు దానము చేసినవాడు లోకములందు విరాజిల్లును. అన్నదానముచే విష్ణులోకము, తిలదానముచే శివలోకము,…

          బ్రాహ్మం రత్న ప్రదానేన గోహిరణ్యేన వాసవం | గాంధర్వం స్వర్ణవాసోభిః కీర్తిం కన్యా ప్రదానతః || 65
          ‘రత్న’దానముచే బ్రహ్మలోకము, ‘గోహిరణ్య’దానముచే ఇంద్రలోకము, స్వర్ణవస్త్రాది దానముచే గంధర్వలోకము, ‘కన్యా’దానముచే కీర్తి…

          విద్యయా ముక్తిదం జ్ఞానం ప్రాప్య యాయాన్నిరంజనమ్‌ | గఙ్గాతీరే నరో యస్తు నానావృక్షైః సమన్వితమ్‌ || 66
          ‘విద్యా’దానముచే ముక్తిప్రదమగు జ్ఞానము లభించును. గంగాతీరమున భక్తిచే నానావృక్ష సమన్వితమగు

          ఆరామం కారయేద్భక్త్యా గృహం చోపవనాన్వితం | కదళీ నారికేరైశ్చ కపిత్థాశోక చంపకైః || 67
          ఆరామమును, ఉపవనముచే కూడియున్న గృహము నిర్మించి, కదళీ[అఱటి], నారికేల[కొబ్బరి], కపిత్థ[వెలగ], అశోక, చంపక[సంపంగి]…

          పనసైర్బిల్వ వృక్షైశ్చ కదంబాశ్వత్థ పాటలైః | ఆమ్రైస్తాలైర్నాగరంగైర్వృక్షైరన్యైశ్చ సంయుతమ్‌ || 68
          పనస, బిల్వ[మారేడు], కదంబ, అశ్వత్థ[రావి], పాటల[కలిగొట్టుచెట్టు], ఆమ్ర[మామిడి], తాల[తాడి], నాగరంగ[నారింజ] వృక్షములచే, ఇతర వృక్షములచే కూడిన

          జాతీవిజయసంయుక్తం తథా పాటల రాజితం | విచితం కారయిత్వైవ మావాసం పుష్పశోభితమ్‌ || 69
          జాతీ[జాజి], విజయ[జమ్మి], పాటల[కలిగొట్టుచెట్టు]యుక్తముగా పుష్ప శోభితముగా అవాసమును ఏర్పరిచి

          శివాయ విష్ణవే వాపి దుర్గాయై భాస్కరాయ చ | ప్రయచ్ఛతి తథా భక్త్యా సర్వార్థం పరికల్ప్య చ || 70
          శివునకు, విష్ణువునకు, దుర్గకు, భాస్కరునికి కాని సర్వార్థ పరికల్పనమునగా భక్తితో సమర్పించిన వానికి

          తస్య పుణ్య ఫలం వక్ష్యే సంక్షేపాన్నతు విస్తరాత్‌ | యావంతి తేషాం వృక్షాణాం పుష్పమూలఫలాని చ || 71
          బీజానిచ విచిత్రాని తేషాం మూలానివైతథా | తావత్కల్ప సహస్రాణి తేషాం లోకేషు సంస్థితిః || 72
          అచటనున్న వృక్షముల, పుష్పముల ఫల, భీజములు, వాటి మూలముల సంఖ్యా ప్రమాణ కల్ప సహస్రములు వారి వారి లోకములోనుండును. ఇది సంగ్రహముగా చెప్పిన ఫలితాంశము. విస్తరముగా కాదు.

          ఇతి శ్రీ బృహన్నారదీయ పురాణోత్తరభాగే మోహినీ వసు సంవాదే గంగా మాహాత్య్మే దానాదివిధివర్ణనం నామైక చత్వారింశత్తమోధ్యాయః
          ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున ఉత్తరభాగమున ‘మోహినీ – వసు’ సంవాదమున గంగా మాహాత్మ్యమున దానాది విధి వర్ణనమను 41వ అధ్యాయము.

  2. నమస్కారం రఘోత్తమరావు గారు!! మీ వ్యాసాలు చాలా బాగుంటాయండి. ఎప్పుడెప్పుడు మీరు మరో వ్యాసం వ్రాస్తారా.. అని ఎదురుచూస్తూంటానండి. ఒక చిన్న విన్నపము, ఈ పై వ్యాసం తెలుగులో లభించే అవకాశం ఉందాండి. దయచేసి తెలుపగలరు.

    1. ధన్యవాదాలు శశికుమార్ గారు. ఈ ఆంగ్ల వ్యాసాన్ని సుమారు తొమ్మిది సంవత్సరాల క్రితం ఒక ఆంగ్ల అంతర్జాల పత్రికకు వ్రాసానండి. దాన్నే యథాతథంగా ఆవకాయలో ప్రచురించడం జరిగింది. ఇక్కడ చెప్పిన విషయాలకు మరికొన్ని అంశాలను చేర్చి తెలుగులో వ్రాసే ప్రయత్నం చేస్తాను.

Your views are valuable to us!

%d bloggers like this: