క్షేత్రయ్య పదము-పిలువనంపె నన్నీవేళ

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

పిలువనంపె నన్నీవేళ – ప్రేమమీరగా నిపుడు

చెలియ మువ్వగోపాలుడు – చిత్తము రంజిల్ల నేడు      ||పిలువ||

 

విరిబోణిరో రమ్మని – విరుల జడను జుట్టి

పరువ మైననాటికి – పైడి యిదే ననుచు

మరువకు మీ మాట – మనకిద్దరికీ పూట

చెరుకువిల్తుడే సాక్షి – చెలియన్న సామె      ||పిలువ||

 

ఎమ్మె కాడు నేను – నెనసి చిన్ననాడే

సమ్మతిగా నొకచోట – జదుపుచుండగ

పమ్మిన వేడుకతో – భామ నీవు ప్రౌఢైతే

కమ్మవిల్తుని కేళి – గలనే మన్నది నిజమై     ||పిలువ||

ఎలమావి తోటలో – నింపొంద నొకనాడు

యెలమి గౌరిపూజ – సలుపుచుండగా

అల మువ్వగోపాలుడగు వేంకటేశుడు

కలువల శయ్యపై – గలసే మన్నది నిజమై      ||పిలువ||

 

Your views are valuable to us!