Like-o-Meter
[Total: 0 Average: 0]
కదంబ సుమ వనమ్ములందున
పరీమళమ్ముల వాహినీ!
రత్న మణి హార ధారిణీ! –
మా – జనని దుర్గమ్మ!
అందుకోవమ్మా మా నమస్సులు! ||
శుక శౌనకాది వర్ణిత!
సకల లోక వందిత!
జలధి వర్ణపు సుగాత్రీ!
విలసత్ రజిత వాస విలాసినీ!
మా – జనని దుర్గమ్మ!
అందుకోవమ్మా మా నమస్సులు! ||
ముకుళ సుమ దళ పల్లవాంగుళి
సకల లోకము రాగ వీణ్ల
అనురాగ ధారా వర్షిణీ!
అభీష్ట వర ప్రదాయినీ!
మా కనక దుర్గా!
అందుకోవమ్మా మా నమస్సులు! ||