ఓం నమః శివాయ——- ll 5 ll
పరమేశ్వరా పార్వతీ పరమేశ్వరా
ప్రణమిల్లి మ్రొక్కెద ప్రమధ గణనాధా
ప్రణామములివె నీకు భక్త సులభంకరా ll ప ll
భువనములోని అందములన్నీ
కాంచగ మాకీనయనములొసగిన
జ్యోతిర్లింగా ……. జ్యోతిర్లింగా నీకిదె
దీపంసమర్పయామి ll 3 ll
భువిలో విరిసిన సుగంధములన్నీ
ఆఘ్రాణించగ మాకునాసికనొసగిన
ఫణిభూషితలింగా …….. ఫణిభూషితలింగా నీకిదె
ధూపంసమర్పయామి ll 3 ll
పుణ్యక్షేత్ర జేగంటా నాదముల
శ్రవణము సేయగా మాకుకర్ణములొసగిన
కరుణాకరలింగా……. కరుణాకరలింగా నీకిదె
పుష్పంసమర్పయామి ll 3 ll
ప్రకృతిలోని భావములన్నీ
వ్యక్తము సేయగా మాకుస్పర్శను ఒసగిన
బిల్వార్చితలింగా………బిల్వార్చితలింగా నీకిదె
చందనంసమర్పయామి ll 3 ll
నలభీమాదుల షడ్రసోపేతముల
ఆస్వాదించగ మాకుజిహ్వను ఒసగిన
పరమాత్మకలింగా…….. పరమాత్మకలింగా నీకిదె
నైవేద్యంసమర్పయామి ll 3 ll
పంచాక్షరీ నామ మహిమాన్వితముచే
పంచక్రియాజ్ఞానేంద్రియములమాకొసగిన
మహాప్రాణలింగా…….మహాప్రాణలింగా….. నీకివె
మా ప్రణామములు
ఓం నమః శివాయ——- ll 5 ll