Like-o-Meter
[Total: 1 Average: 5]
స్వరఝరుల సామ మంత్రం
స్వరధరుని సార మంత్రం
స్వరపూజకాది మంత్రం
ఓంకారనాద మంత్రం
కుసుమాస్త్రుని మసిచేసిన చిచ్చుకంటి మెచ్చురీతి
ప్రణతుల పార్వతి పలికిన ప్రణవనాద మంత్రం
ప్రమధ నాధు మురిపించిన ప్రణయనాద మంత్రం
కచ్చపి తీవెలపై విచ్చిన స్వరసుమమై
సరిగమ స్వరముగ ,,స్వరసుమ సరముగ
పరిణయ తరుణములో ,,గిరిసుత కరములలో
హరువుల విరిమాలై ,,హరునకు వరమాలై
ప్రణవము పరిమళించే పరిణయ శుభమంత్రం
నాదనిలుడు నాధుడై “ఆ” “ఉ” “మ” నాదార్ధమై
నాదనిలుడు నాధుడై ఆ “ఉమ” నాదార్ధమై
వాగర్ధపు సారమొసగే వాసియైన మంత్రం