శంకర నందన, సిద్ధి గణేశ!

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

 

 

పల్లవి:

ఓంకార రూపముతో, విశ్వమున నిండిన,

శంకర నందన, సిద్ధి గణేశ!                 || ఓంకార ||

     

అనుపల్లవి:

పాకరి వినుత, పరమ దయాళ,              

సాకార రూపా! సుముఖ గణేశ!           ||ఓంకార ||

 

1.భవాని పుత్ర, బహుదివ్య వదన,

నవ దివ్య విద్యోత,  నటన గణేశ!

కవి జన స్తోత్ర, కరుణా భావ,

కోవిద కీర్తిత,  కనక గణేశ!                       ||ఓంకార || 

 

Click the image to get this beautiful Ganesha vigraham
  

2.విజయ, విద్యా దాత, విఙ్ఞాన దీప్త,

నిజ భక్త మందార, నిఖిల గణేశ!

ఉజ్వల తేజ,  ఉత్తమ పురుషా!

అజత్రయ రక్షిత,  అతుల గణేశ!                 ||ఓంకార || 

 

3.శ్రీవాణి, శర్వాణి కారుణ్య దాయక,

అవిరళానంద, అనఘ గణేశ!                   

అవ్యక్త , అమర నుత, ఆశ్రిత వరద,       

సవినయ వందనము గొమ్ము గణేశ!                    ||ఓంకార || 

 

 

పాకారి = ఇంద్రుడు

సుముఖ = విద్వాంసుడు

(అజత్రయ = బ్రహ్మవిష్ణుమహేశ)

అనఘ = మనోఙ్ఞమైన

అవ్యక్త = పరమాత్మ


Your views are valuable to us!