శరణాగత వత్సల-అన్నమయ్య కీర్తన

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

శంకరాభరణం రాగం…..ఆదితాళం

శరణాగత వత్సల, సర్వసులభ శరణాగత వత్సల
పురుషోత్తమ నా పుజ గైకొనవయ్య (శరణాగత వత్సల)

ముమ్మరంపు బ్రహ్మాండంబు మోసేటి నీకు నే
చెంబులోన నీళ్ళను చిలికించెద
పమ్మిన ఇందిరాదేవి పన్నీటి వసంతముగా
సమ్మతించి మబ్బుతీర జలకమాడవయ్య (శరణాగతవత్సల)

పట్టరాని విశ్వరూపం చూపేటి నిన్ను నే
పెట్టెలోన సంచిలోన పెట్టి కట్టేద
పట్టపాలు కౌసల్య గర్భమందున్న మేటి
పెట్టే చోటు వైకుఠముగా పెట్టుకొనవయ్యా (శరణాగతవత్సల)

అలచరాచరములు ఆరగించే నీకు
వెలయు కుండలోన నైవేధ్యమిచ్చెద
అలమేలుమంగ శ్రీవేంకటేశ మీరది
వెలయు భరద్వాజుల విందుగా గైకొనవయ్యా (శరణాగతవత్సల)

Your views are valuable to us!