శరణు శరధి శయన

Spread the love
Like-o-Meter
[Total: 1 Average: 3]
  yasr-loader

శరణు శరధి శయన కరుణరసమయనయన
శరణు దశరథబాల జానకీ లోలా
శరణు వాలిహరణ శరధిబంధన నిపుణ
శరణు వ్రతనియమ నిజసదనగమనా

మహిలోన మనుజునిగా అహిశాయి జనియించ
మహిత జనహితము శ్రుతిగమారే
మహిమ జూపగ శిలయు మహిళహల్యగ మారె
గుహుని నావను గాచె శబరి గేహము బ్రోచె

మరుతసూనుని స్నేహామృత తప్త సుప్తుని
నిరత మునిమన మనన భావదీప్తుని
చరిత వ్రాసిన బోయను చరితాత్ము జేసిన
భరత క్షితి పతి స్మృతికి నశియించు నఘతతి

భావించనీ దేహమా అయోధ్యయెననుచు
భావించ నీ మనసు పీఠికేయనుచూ
భావించినా తండ్రి సేవించనీయడే
భావనారాయణన్న బిరుదున్న వరదుడు!

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments