ఉండ్రాళ్ళ గణపతీ! దండాలు స్వామీ!

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]


ఉండ్రాళ్ళ గణపతీ! దండాలు స్వామీ!
వేనోళ్ళ పొగడుదుము, మనసారా నిన్నే!  ||

      దంతమును ఘంటముగా చేసుకొన్నావు
      ఘడియలో “జయమ్ ” రాసి, విలాసముగ
      తొండమును ఊపుతూ నవ్వేవు ||

“మహా భారతము” గొప్ప ఇతిహాసము
లోకములకు అందుట నీ చేతి చలువయే!
ఆని మురిసెను వ్యాస ముని; ఔరా! నీ మహిమలు ||

అందరికీ వినాయక చతుర్ధి శుభాకాంక్షలు!


Your views are valuable to us!