ఆ నై వా ఈ

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

ఆ నై వా ఈ – ఈ అక్షర బంధాలు విన్నారా? చూసారా? వాస్తు శాస్త్రములో, భూగోళ, నైసర్గిక శాస్త్రాలలో వీటికి విస్తృత పరిధిలో  ఉపయోగించబడుతూంటాయి. పాత తరమువాళ్ళు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. “పెద్దబాలశిక్ష”, “చిన్న బాలశిక్ష”, పాఠశాల తెలుగు వాచకములలో ఉండేవి. బాల బాలికలకు ఖచ్చితంగా తెలిసితీరాల్సిన ముఖ్య అంశాలుగా  పరిగణించేవారు.

నేను రాసిన “అజిబీధ- పపా – విశ్వేసకి”, పింగళి వ్యాసము తర్వాత ఇలాంటి ఆలోచన వచ్చింది. దేశ దేశాల్లో, అనేక భాషల్లో, చిట్టి అక్షర రత్న కాంతులలో, విస్తార వర్ణకాంతుల భావాలు పరిశీలనలకు అనువైనవి.

ఇంతకీ – ఆ నై వా ఈ – అంటే ఏమిటబ్బా?

*********         

చిట్టితమ్ముడు; అనే సినిమా – 1962 లో విడుదల ఐనది. కె.బి. తిలక్ దర్శకత్వము వహించిన ఈ మూవీలో (ఆలివర్ ట్విస్ట్ – అనే చార్లెస్ డికెన్స్ నవలా థీమ్ ఆధారము). ఈ తెలుగు చలనచిత్రము లో ఒక హిట్ సాంగ్ ఉన్నది.

“దిక్కు లేని వారికి దేవుడే దిక్కు
ఆ దేవుడెలా ఉంటాడో తెలీదు అదే కదా చిక్కు”


“నీవే దిక్కు భగవాన్!” ఇంటికి పెద్ద దిక్కు, దిక్కూ మొక్కూ లేని, దిక్కు తెలీక, దిక్కు తోచని; దిశా నిర్దేశము చేయుట; ….. మున్నగు పద, జాతీయ, సామెతలు మన తెలుగు భాషలో ఉన్నవి.

******** 

ఆ నాలుగక్షరముల కథా కమామిషూలను సింహావలోకనము చేద్దామా! ఇంతకీ – ఆ నై వా ఈ – అంటే ఏమిటబ్బా ?!?

NEWS అనగా “వార్తలు”. నెల నాలుగు చెరగులా జరిగే సంఘటనల సమాహారములే న్యూస్/ వార్తలు.

“NEWS”= north, East, West, South —–> “NEWS”

*********


“తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణము” అని మనము చెప్పుకుంటాము. వీనికి “దిక్కులు” – అని పేరు. (వీనిని సులభంగా గుర్తు ఉండడానికి  “తూ – ద – ప – ఉ ”  అనే “లిపి బంధము”ను కొండగుర్తుగా అట్టిపెట్టవచ్చును)

ఐతే “విదిక్కులు” అనే పదము కూడా ఉన్నది. “విదిక్కులు” అంటే ఏమిటి?


విదిక్కులు అనగా అష్ట దిక్కులలో పై నాలుగు వాటి మధ్యన ఉన్న తతిమ్మా నాలుగు దిక్కులు.

ఆసియా ఖండ దేశముల సంస్కృతిలలో  ప్రాగ్ దిశకు అత్యంత ప్రాధాన్యత ఉన్నది. అందుచేత మన దేశములో దిశల  పట్టిక సూర్యుడు ఉదయిస్తూ ఉండే “తూర్పు”తో ప్రారంభము ఔతుంది.

ప్రభాత ఉదయానికి సింహాసనం ఐనట్టి ప్రాచీ దిశను మొదట చెప్పి, మిగతా దిక్కులను ఆ వెనువెంట అనుసంధానిస్తారు. తూర్పు, పశ్చిమ దిక్కు/ పడమటి దిక్కు; ఉత్తరము, దక్షిణము అనే ఆ నాలుగు దిక్కుల నడుమ- “ఐ మూల” గా ఉన్న వాటికే
“విదిక్కులు” అనే చిహ్నములు. ఆగ్నేయ, నైఋతి, వాయువ్యము, ఈశాన్యము- ఇవన్న మాట “విదిక్కులు”.

మళ్ళీ ప్రథమ పంక్తిని, తొలి వాక్యాల దరికి వద్దాము.

ఆ నై వా ఈ   – ఈ సంజ్ఞల విసృతి చాలామందికి తెలిసినవే! కాస్తో కూస్తో పంచాంగ, ఖగోళ, వాస్తుశాస్త్రాల పరిచయ లబ్ధిని పొందిన వారికి తటాలున స్ఫురించేఉంటుంది.

ఆ నై వా ఈ – లను గుండ్రని చక్రాకృతిలో బొమ్మను గీసి చూడండి. ఆ నడిమి నాలుగు దిశలు అంటే దిశా చక్రమును వేయాలి. అందులో వాటి మధ్యన – విదిక్కులునుగా రచిస్తే వరుసగా ఈ కింద పేర్కొన్న విధానమును పొందుతున్నవి

కుడి నుండి ప్రదక్షిణ దిశగా తూర్పు- ఆగ్నేయ; దక్షిణము – నైఋతి; పడమర – వాయువ్యము; ఉత్తరము – ఈశాన్యము ఔతూన్నవి.

అనగా ఇందాకటి వలె ఒక్కొక్క దిక్కుకు ఒక్కొక్క గ్రహమును కేటాయించారు మన పెద్దవాళ్ళు. ఆ సమాచారము అనేక గ్రంధాలలో వివరణలు ఇవ్వబడి ఉన్నవి.

లోకాస్సమస్తాస్సుఖినో భవంతు! శుభం!

******


సముద్రయానము చేసే వారు, కొండలనూ పర్వతములనూ ఎక్కే వాళ్ళు ఉపయోగించే “దిక్సూచి” – లో దిక్కులనూ, విదిక్కులనూ గుర్తులను ఉంచుతారు. వీనికి అదనముగా, వీటితో పాటే మరి ఎనిమిది దిక్కులు కూడా గుర్తులుగా ఉంటాయి.

వానిని – విదిక్కులు- కు ఇరు వైపులా రాస్తారు.

North,                North East,
East,West,            South East;
North ;               North West,
South ;               South  West

అంటే  వరుసగా 16 డిగ్రీల నామావళి”కంపాస్” లో పరిగణనలో ఉంటున్నవి. 360 డిగ్రీల స్థానాలను వేటికి అవి విభజనలుగా వ్యవహారములో ఉన్నవి. నావికులు, పర్వతారోహకులు, దిక్సూచిలను ఉపయోగించే వాళ్ళు ఇతరులతో చెప్పేటప్పుడు “మనము 234 డిగ్రీలు NNE (= North- North East)దిశలో ఉన్నాము”. ఇలాగ అన్న మాట వారి విపులీకరణలు ఉంటూంటాయి. దిశాంతాల కొలతలను కొలిచే పరికరములను విజ్ఞాన ప్రపంచ నేతలు, శాస్త్రవేత్తలు కనిపెడుతూనే ఉన్నారు. అహరహమూ శ్రమిస్తూ, ఆధునిక జగత్తు పురోభివృద్ధికి వారు అందిస్తూన్న సౌలభ్యతలు, సౌకర్యాలు ఎంతో గొప్పవి.

Your views are valuable to us!