తంజావూరు బృహదీశ్వరాలయం – యూరోపియన్ విగ్రహం

Spread the love
Like-o-Meter
[Total: 2 Average: 4]

తంజావూరు బృహదీశ్వరాలయం టూరిస్టుల కళా  స్వర్గధామము. 1000 సంవత్సరముల చరిత్ర ఉన్న ఈ గుడి పర్యాటక రంగంలో ఉన్నత స్థానాన్ని ఆర్జించింది.  తంజావూరు కోవెలను  దర్శించే కొద్దీ అనేక  రహస్యాలతో అబ్బుర పరుస్తూంటుంది.  అక్కడ ఒక వింత శిల్పము ఉన్నది. 3 వ అంతస్థు తోరణ గవాక్షము పైన టోపీ ధరించిన ఇంగ్లీషు మనిషి బొమ్మ చెక్కబడినది. ఒక రకంగా ఇది మురల్, 3-డి చిత్ర శైలి అని చెప్పవచ్చును.  భారతీయ శిల్ప విధానంలో  మరెక్కడా ఇలాటి పాశ్చాత్య శిలా విగ్రహాన్ని ఆలయములలో  చెక్కి ఉంచే ఆస్కారం లేనేలేదు. అందుకనే రాయిలో చెక్కబడిన ఈ ఆంగ్లేయుని బొమ్మ చూపరుల దృష్టికి ఆలోచనలను రేకెత్తిస్తుంది.
ఇంతకీ ఈ శిల్పం ఎవరిది?
Buy this book on Amazon
@@@@@
18 వ శతాబ్దంలో శరభోజీ మహారాజు వంశస్థులు తంజావూర్ సంస్థానాన్ని పరిపాలించారు. యూరప్ వాణిజ్య సంస్థలు ఆ పాలకుల వద్ద నుండి తంజావూరులో లాంగ్ లీజు (long lease) కి తీసుకుని, తమ వ్యాపారాన్ని చేసుకోవడానికి అనుమతిని పొందారు. 1800 వ సంవత్సరంలో బ్రిటిష్ వారి వలన, వారి పాలన వలన ఆధునిక యుగ ప్రభావం వలన దేశ, ప్రపంచ సమాజాలలో పెనుమార్పులు ప్రభంజనంలా జొరబడినవి. హిందూ దేశ సామాజిక, చారిత్రక రంగములలో కొత్త ఆవిష్కరణలకు ఈ పరిణామములు మార్గం సుగమం చేసాయి.

ఈ సమయంలో బ్రిటీషు ప్రభుత్వానికి భారతదేశపు భౌగోళిక చిత్ర రచన అవసరమైనది. ఈ బృహత్కార్య భారాన్ని భుజస్కంధాలపై వేసుకున్నవాడు కర్నల్ విలియమ్ లాంబ్టన్. 1808 లో హిమాలయ పర్వత శిఖరముల నుండి – కన్యాకుమారి అగ్రం వరకు సర్వే చేయసాగాడు లాంబ్టన్. అప్పటి నుండి లాంబ్టన్ కృషి అవిరళంగా సాగింది. అతడు  a mathematical and geographical survey  చేసాడు. తంజావూరు జిల్లా యొక్క నైసర్గిక, జియోగ్రాఫిక్ కొలతలను కొలిచే బృహత్తర విధిని తలకు మించిన భారాన్ని తలకెత్తుకున్నాడనే చెప్పాలి. అక్షాంశరేఖలు,  the arc of the meridian near to Equator, కేంద్ర బిందువు ఇత్యాది అగణిత అంశాలను ఆధారం చేసుకుని, గణితశాస్త్ర పరిజ్ఞానముతో అమేయ కృషి చేసాడు లాంబ్టన్.

అట్లాసు పటముల తయారీకి కనీస మౌలిక సదుపాయాలూ కూడా లేని దశ అది. అలాగా, ఆ పరిస్థితులలో,  పరిసర  జ్ఞాన విజ్ఞానములకు పునాదులను ఏర్పరచవలసిన పరిస్థితి అది. ప్రాధమిక స్థితిలో ఉన్న భూగోళ, ఉపరితల శాస్త్ర అవగాహనతో భూమి, భూగోళం కొలతలను తీసుకోవడమంటే మాటలు కాదు.  భూమి ఉపరితలాన్ని కొలవడం ఒక  టైలర్ తను కుట్టాల్సిన వస్త్రానికి కొలతలు తీసుకునేటంత సులభం కాదు. ఆ తరుణంలో లాంబ్టన్ తనకు అనువు ఐన వింత పద్ధతిని అనుసరించాడు.
భారత దేశంలో దాదాపు ప్రతి మారుమూల గ్రామాలలో కూడా దేవాలయాలు ఉన్నవి. కుగ్రామాలలో సైతం ఉన్న ఆలయ సంపద అతడికి పరికరములుగా ఉపకరించినవి. కోవెల గోపురములు ఆధారం చేసుకున్నాడు లాంబ్టన్. దరిమిలా ఆతని పరిశోధనకు  ఇవి ఆధారాలుగా మారాయి. ఇట్లా ఆలయ శిఖరములు మౌలికమైన ఉపకరణములుగా చేసుకుని భూ ఉపరితల చిత్రాలను గీయడం లాండ్ సర్వే పద్ధతుల్లో బహుశా ఇదే మొదటిసారేమో!
ఇలాగ విభిన్నతను కలిగిన ఈ సంఘటన ప్రజలు అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకొనేలా ఉన్నది. అర్ధ టన్ను బరువు ఉన్న ఒక పరికరమును ఈ సర్వే కార్య నిమిత్తం వాడాడు లాంబ్ టన్. The Giant Theodolite  అనే ఆ ఇన్ స్ట్రుమెంట్ ను గోపురముల పైన, ఎత్తైన ప్రదేశాలలో అమర్చి కొలుస్తూండేవాడు.
అలాగ తంజావూర్ గుడిలో మెసర్ మెంట్సును తీస్తూండగా ఆ ప్రాంతంలోని ఒక శిల్పం కింద పడి, విరిగిపోయింది. అలాగ డామేజ్ ఐన బొమ్మ స్థానాన్ని భర్తీ చేయాల్సిన కర్తవ్యం అతనిదే ఐనది. కర్నల్ లాంబ్ టన్ (Colonel William Lambton) కొత్త విగ్రహాన్ని శిల్పి చేత, దగ్గర ఉండి చెక్కించాడు. లాంబ్టన్ ప్రత్యక్ష పర్యవేక్షణలో పని చేస్తున్న శిల్పకారుడు  తనకు తెలీకుండానే ఆ బొమ్మలో లాంబ్ టన్ పోలికలతో చేసాడు.
లాంబ్ టన్ ప్రభావం ఈ పాశ్చాత్యుని ప్రతిమా నిర్మాణం పై ప్రసరించింది. తంజావూరులోని ఆ యూరోపు దేశస్థుని  బొమ్మలో, లాంబ్ టన్ చెక్కిళ్ళ పోలికలు సుస్పష్టంగా అగుపిస్తున్నాయని అప్పటి తంజావూరు నగర వాసులు అనుకునేవారట!
@@@@@@

Your views are valuable to us!