గోవాలో ఒక బావి వద్ద మహిళ బొమ్మ కూర్చుని ఉన్న విచిత్ర దృశ్యం ఉన్నది. ఒక స్త్రీ మూర్తి నీలం చీర, ఎర్ర జాకెట్టు ధరించి ఒక ప్లాట ఫారం పైన ఆసీన ఐఉన్నది.
బావి యొక్క ప్రాచీనతకు విశదీకరించే పద్ధతిలో ఈ శిల్పాన్ని అక్కడ ఉంచి ఉంటారు. నా ఊహ నిజమైతే- ఇతర రాష్ట్రాలు కూడా ఈ విధానాన్ని అనుసరించాల్సిన ఆవశ్యకత ఉన్నది.
మన ఆంధ్ర రాష్ట్రంలో అనేక సత్రాలూ, మంచినీటి బావులూ- కనుమరుగై పోతున్నవి. (ఈనాడు హోటళ్ళు అనేక రెస్టారెంట్లు ఈ లోటుని భర్తీ చేస్తునాయి అనుకోండి!).
మనకి, సంఘానికి మేలు కలిగించే- త్రాగు నీటి వనరులు, భోజన సదుపాయాలను యాత్రికులకు సమకూర్చే ధర్మ సత్రాలు వంటి వాటికి, వాని ప్రాచీనతకు ప్రతీకలుగా- ఇలాగ శిల్పాలు వగైరాలను నిలిపి ఉంచడం మేలు కదా!
చెరువులు, నదులకూ సైతం ముప్పు వాటిల్లుతూన్న నేటి నేపథ్యంలో వాపీ, కూప, తటాకము భద్రతలకై మన ఘోష, గోల, గగ్గోలు అనవసరమని- అంటున్నారా? హ్హూ…..! అదీ నిజమేనేమో!
ఐతే గంగా నదీ పరిరక్షణా కార్యక్రమాలకు- కొంచెం కొంచెం కదలికలు-మన ప్రజా ప్రభుత్వం వారిలో ఏర్పడుతున్నవి కదా! ఈ మాత్రం ఆశావహ దృక్పథం పొరబాటు కాదు కదా!
* * * * * *
రావల్ నాథ్/ భూతనాథ్ (Vetoba | Ravalnath | Bhootnath) కోవెల సీమలో వద్ద ఉన్నది ఈ బావి.