చేవ్రాళ్ళు, వేలిముద్రలు – ఇవే లేకపోతే?

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

పత్రాల పైన, ధన సంబంధ కార్యాలు, పెళ్ళిళ్ళూ, పబ్బాలూ, వీలునామాలు; అంతెందుకు, ఓటు హక్కు వినియోగము చేసుకోవాలన్నా కూడా ఏది అవసరమౌతుంది? ప్రోనోటు వ్యవహారాదులకూ, గుర్తింపు & రేషన్ కార్డుల పైనా ఉంచాల్సినది ఏమిటి? ఉలిక్కిపడకుండా చెప్పేయగలరు కదా!  

జవాబు: “చేవ్రాలు”. అదేనండీ. సంతకము! దీనికి జతగా తటాలున మనకు స్ఫురించేది “వ్రేలి ముద్రలు”. 

ఫింగర్ ప్రింట్స్ ఎవరికైనా అసలే లేకపోతే?ఆ స్థితిని “అడర్మటోగ్లైఫియా” అని శాస్త్రజ్ఞులు ఓ నిర్వచనాన్ని అనుగ్రహించేసారు. (Adermatoglyphia = no finger prints due to a genetic defect. అడర్మటోగ్లైఫియా Link)


 2007 లో ఇమ్మిగ్రేషన్ అనుమతి జారీ చేసేటప్పుడు, అమెరికా వీసా అధికారులకు ఒక చిత్రమైన పరిస్థితి ఎదురైనది. చూడచక్కనైన ఒక స్విస్ వనితకు యు.ఎస్. లోనికి పర్మిషన్ ఇవ్వాలా? వద్దా? అని వారు కిందుమీదైనారు. ఎందుకంటే, ఆ స్విట్జర్లాండ్  స్త్రీ చేతి వేళ్ళకు అసలు “వ్రేలి ముద్రలు” లేనే లేవు. ఈ సంగతి- సైన్సు ప్రపంచము దృష్టిని అటు మళ్ళించింది. స్విట్జర్లాండ్ లేడీ వీసా పర్మిటు ఇవ్వడానికి, ఇతర అంశాలను పరిగణనలోకి  తీసుకొనవలసి వచ్చినది. 

ప్రపంచంలో ఈలాగున ఫింగర్ ప్రింట్సు లేని కుటుంబాలు నాలుగు మాత్రమే ఉన్నాయి. అదీ వింత. 

సరే! వేళ్ళతోనూ, చేతులతోనూ సంభాషించే సిస్టమ్ లు కూడా డెవలప్ ఐనవి. పది హాండ్ జెస్టర్సు  పేర్లు ప్రస్తుతము చెప్పుకుందాము.

 

TOP 10 Most Irritating Hand Gestures  (చేతి సందేశాలు): 

1) Inverted commas 

2) Talk to the HAND 

3) None of your business

4) Blah! Blah! Blah!

5) Pistol

6) Hand punching

7) I am watching you!

8) Call me

9) Fake Yawn

10) kut trot

పది రకాల చేతి సందేశాలు:- 

1) Using your fingers to make “Air Quotes”.

2) Talk to the Hand.

3) Tapping the side of your nose to say “none of your business.” (This might be a British thing.)

4) Blah Blah Blah. That’s when you open and close your hand like a mouth.

5) Finger Guns.

6) Hand Punch: You hit your palm like you’re getting ready to fight.

7) Pointing to your eyes and then another person to say “I’m watching you.”

8) Call Me: Making your hand into a fake phone.

9) Fake Yawn.

10) Throat Slash.

 

ఈ కర, అంగుళీ కౌశల ముద్రలు ఐఫోన్ ఆప్, గూగుల్ లలో కూడా లభిస్తూన్నవి. 

 

 

సాంప్రదాయక నృత్యాలలోనూ, యోగముద్రలలోనూ హస్త, అంగుళీ విన్యాసాల  సంఖ్య అపరిమితమే!  

యోగముద్రలు

గణేశ: కుబేర: గరుడ: లింగ: కాళేశ్వర్: అంజలి: బుద్ధి: జ్ఞాన: ధర్మ చక్ర: హాకిని: అపన: లింగ: ముకుళ: ఇత్యాదులు ఉన్నవి. 

నాట్యముముద్రలు

నర్తనములలోని కర, నేత్ర అభినయ ప్రాధాన్యతలు సాంప్రదాయ కళాభిరుచి, పరిచయాలు కలిగిన వాళ్ళకు తెలిసి ఉంటాయి. పతాక ముద్ర: త్రి పతాక: అర్ధ పతాక: చంద్ర: మయూర; ఉత్పల: త్రిశూల ముద్రాదుల వంటి అనేక రకములు ప్రేక్షక మనోరంజకములై ఉన్నాయి.

Your views are valuable to us!