“అందమైన అనుభవం” అనే సినిమా చాలామందికి గుర్తుండే ఉంటుంది. కె. బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో కమల్ హసన్, జయప్రద, జయసుధ, రజనీకాంత్ మున్నగు హేమాహేమీలు నటించారు. తమిళ చిత్రముకు తెలుగు అనువాదం విమర్శకుల, విశ్లేషకుల మెప్పును పొందింది.
ఎం.ఎస్. విశ్వనాధన్ సంగీతం లో అన్ని పాటలు ప్రజాదరణను పొందినవి. హిట్ ఐన వానిలో ఆచార్య ఆత్రేయ రాసిన గీతం ఉన్నది –
“హల్లో నేస్తం! బాగున్నావా?
హల్లో నేస్తం, గుర్తున్నానా?
ఏ కళ్ళైనా కలిసాయంటే కలిగేదొకటే అనురాగం;
ఏ మనసైనా తెరిచావంటే: తెలిపేదొకటే ఆనందం;
స-రి-గ-మ- లైనా; డొ-ర-ని-ప- లైనా ;
స్వరములు ఏడే గానంలో
పడమటనైనా తూరుపునైనా; స్పందన ఒకటే హృదయంలో:
సాయా అనా సింగపూరా, సాయారుక మలేషియా: సాయారెమో ఇండియా; సాయావాడ చైనా”
అది సరే గానీ, ఈ రాగమాలికనందు, “డొరెగమ” అనేవి ఏమిటి?
“సోల్ఫా నోట్స్” – అనే ఇంగ్లీష్ వర్డ్ (English word) ఉన్నది. ఈ సోల్ఫా నోట్స్, ఎలాగ, ఎట్లాంటి సందర్భాలలో వాడబడుతున్నది? గమనిద్దామా?
టిప్పణి – అంటే “స్వరలిపి”. “స-రి-గ-మ- ప-ద-ని-+స” లకు ప్రత్యామ్నాయాలుగా, సంగీత పరిజ్ఞానము కొరకై పాశ్చాత్యదేశాల వాళ్ళు వేటినైనా క్రియేట్ చేసుకున్నారా?
ఔను, నిజమే! వారు “డొ-రె-గ-మ” అనే అక్షరములను మ్యూజిక్ సంజ్ఞలుగా ఎన్నుకున్నారు.
క్రైస్తవ సెయింట్ బెనెడిక్ట్ డి నోర్సియా (Saint Benedict of Nursia (Italian: San Benedetto da Norcia) (c.480-547) పద్య పంక్తులకు ఈ అక్షర సంగీత బాణీలు అన్వయించబడినవి. డొ- రె – మి ఫ – సోల్ – ల – టి (/ సి) {వీనినే డొరెగమలు అని చెబుతారు. ఈ వ్యావహారిక పదాన్ని పై పాటలో వేసారు. డో స్కేల్ , పాల్ డీకన్ పోయెట్రీ పంక్తులకు బాణీగా ప్రధమగణ్యతను పొంది, వెస్టర్న్ మ్యూజిక్ హిస్టరీ పేజీలలో స్థానం గడించినవి.
do, re, mi, fa, sol, la, ti (or si) = అనే letters ని ఎప్పుడు ఎక్కడ గుర్తించబడుతున్నవి?
A, B, C, or C flat అనేవి ఇట్టివే! :-
డో స్కేల్ , పాల్ డీకన్ పోయెట్రీ పంక్తులకు బాణీగా ప్రధమగణ్యతను పొంది, వెస్ట్రన్ మ్యూజిక్ హిస్టరీ పేజీలలో స్థానం గడించినవి.
*****
సాహిత్యం ఏదైనా, గీతములలోని పదములు ఏవైనా- చెవులకు సోకే ధ్వని శ్రుతిసుభగత్వమౌతూ, ఆస్వాదించబడుతుంది. అందువలననే ప్రపంచంలోని భాషల రాగమట్టులు అన్నీ భాషాభేదాల ఎల్లలను మరిచి, ఆస్వాదనాయోగ్యతను పొందుతున్నవి. గాయనీ గాయకులు, వాద్యకారులు “సంగీతసంజ్ఞలు” ను అనుసరిస్తారు. మ్యూజిక్ స్టూడెంట్సుకు టీచర్ల శిక్షణమార్గము- ఇది.
భారతీయ సంగీతమున “స-రి-గ-మ- ప-ద-ని-+స” అనేవి సప్తస్వరములు. పింగళుడు, భరతుడు మున్నగు అనేకులు సంస్కృతఛందస్సుకు వేసిన పునాదులు, సంగీత, నాట్యాది “చర కళలు” లో విస్తరించబడినవి. ఆ పద్ధతిలో ఈ సూత్రములు, లక్షణశాస్త్రకర్తల ఆమోదమును పొంది, ఆదరణ పొందినవి.
“కటపయాది సూత్రముల” అనుక్రమణిక, తద్వారా జన్య రాగాదులు, మేళకర్త, టిప్పణీ – ఇత్యాది విస్తరణలు అమోఘమైనవి. మన దేశంలో త్యాగరాజు, శ్యామశాస్త్రి, ముత్తుస్వామి వంటి సంగీత రత్నత్రయాలు శాస్త్రీయ సంగీతమునకు అద్భుత హర్మ్యాలను నిర్మించి పెట్టారు. ఐతే ప్రప్రధమ ఆధారముగా శిల్పప్రపంచమున, గణించగలిగినది ఏదైనా ఉన్నదా?
*****
రాగమట్టులు చెక్కిన శిల:-
హేరంబుని పండుగ పాలవెల్లి కట్టుదాము; గుంజిళ్ళు విద్యార్ధులు
ఆదిదంపతుల పుత్రుని; దర్సన సంరంభం అందరికీ
విఘ్నాలను రాకుండా వేడుకొనుట ఎవ్వరిని?
నిను వినా, వేరెవ్వరినో స్వామీ! గణనాయక!
కరివదనుడు ఉత్తరాదిన, నేపాల్, థాయిలాండ్ మొదలైన దేశాలలో “నృత్యగణపతి” గా అర్చనలను అందుకుంటూన్నాడు. దక్షిణ భారతావనిలో సంగీత పరంగా వార్తాశీర్షికలను అలంకరించినది తమిళనాడు రాష్ట్రములోని ఒక విఘ్నపతి ఆలయము.
*****
హెచ్. క్రిష్ణ శాస్త్రి గణితశాస్త్రజ్ఞుడు. అంతే కాదు, ఆయన సంస్కృతభాషాభినివేశము కలవాడు కూడా! 1904 లో, ఈ ఔత్సాహిక మాథమెటీషియన్ అన్వేషణద్వారా ఇంద్రపురి వినాయకకోవెల గూర్చి ఎల్లరికీ తెలిసింది. ఇంతకీ ఏమిటా కోవెల విశిష్టత?
కుడుమియన్ మలై లలో నెలకొన్నది ఇంద్రపురి వినాయక గుడి. కుడుమియన్ మలై కోవెల సంగీత అంశముల వలన వెలుగులోకి వచ్చింది. ప్రొఫెసర్ సాంబమూర్తి అభిప్రాయాన్ని అనుసరించి, ” సప్తస్వరముల యొక్క సోల్ఫా నోట్సు, బహుశా ఇదే మొట్టమొదటి శిలాచెక్కడము. ఆలాపన, అచ్చులను బట్టి, శ్రుతి / శృతులు విస్పష్టంగా వింగడించబడినవి.
ఖచ్చితమైన స్వరప్రస్తారములతో ఈ రాతిలో చెక్కబడినవి.రుద్రాచార్యుల శిష్యుడు మహేశ్వర చక్రవర్తి. ఆ మహారాజా వంశ నామావళిని ఇందులో పొందుపరిచే ప్రయత్నం జరిగింది. Archaeologist Dr. Kudavayil Balasubramaniam మున్నగువారు ఇతోధికకృషి , అమూల్య పరిశోధనలు చేసారు.
*****
ఇక్కడ శిలాఫలకములు ఏడవశతాబ్దం నాటివి. ఇంద్రపురి వినాయక గుడి ప్రవేశద్వారానికి కుడివైపు ఉబ్బెత్తుగా చెక్కబడి ఉన్నఅక్షరములు, చిహ్నాలు కలవు. ఇంద్రపురి వినాయక మూర్తికి కుడివైపు “సంగీత స్వర రచనలు” చెక్కిఉన్న శిల ఉన్నది. ఈ విషయాలు ప్రాముఖ్యమైనవి.ఇది గుహాలయం. “మేలక్కోయిల్”అని, “తిరుమెఱ్ఱాలి” అని పిలుస్తున్నారు. ఏకాండీ శిలను తొలిచి, గుళ్ళు గోపురములను నిర్మించే శైలి, పాండ్యరాజుల కాలమున ఊపందుకున్నది. శిలాఫలకములపై చెక్కి ఉన్న శాస్త్రీయ సంగీత బాణీలు, చరిత్రకు అందినట్టి – స్పష్టమైన శాస్త్రీయ ఆధారములు.
(Kudumiyanmalai పుదుక్కోట, మానప్పురం రూటులో ఉన్నది.)
*****