Like-o-Meter
[Total: 0 Average: 0]
సారనాథ్ లో లోపల గోడలు, పై కప్పులపైన అనేక అద్భుత చిత్రలేఖనములు ఉన్నవి. వాటిని వేసినవారెవరో తెలుసా?
1885 లో కొసెత్సు నోసు(Kousetsu Nosu) అనే జపాన్ చిత్రకారుడు.బౌద్ధ గాథలు, జాతక కథలు, ఈతని కుంచెలోజీవకళతో ఉట్టిపడుతూన్నవి.
సారనాథ్ లోని మూలగంధకుటీర్ విహార్ లో తైల కుడ్య భిత్తికా చిత్రాలు కనువిందులు చేస్తూన్న అపురూప వర్ణమాలికలు. వీనిని “Fresco paintings” అనే విభాగములోనికి చేర్చవచ్చును
పెయింటింగులలో ఫ్రెస్కోస్ పెయింటింగు విలక్షణతతో, గుర్తింపు పొందినది. ఇండియాలో దాదాపు 20 చోట్ల ఇవి ప్రాచీనతలో ముందుండి, చిత్రలేఖనా పరిశోధనలకు ఊతం ఇస్తున్నాయి. కేరళలో వీనిని “మురల్స్” అని పిలుస్తారు. క్రమంగా మన దేశంలో అన్ని ప్రాతాలలోనూ ఈ ఆదరణను చూరగొంటూన్నది.
ఇంతకీ “ Frescoes paintings” అంటే?
అవి wall paintings అనగా “కుడ్య శిల్పాలు” అని నిర్వచించవచ్చును.. సాధికారంగా చెప్పగల ఉదాహరణ:- “అజంతా, ఎల్లోరా గుహలు”
ఇది అత్యంత క్లిష్టత ఓ కూడిన కళా రూపము. ప్రాచీన కాలంలో గానీ, ఇప్పుడు గానీ- పై కప్పులపైన రంగులను అద్దాలంటే, ఊహించగలరా, అప్పుడు ఏమి చేస్తారో? మంచెలను ఎత్తుగా కట్టి, వాటిపైన పండుకొని, ఎంతో ఓపికతో వేయాలి. సరే! అర్ధమైంది కదా! దీనికన్నా కష్టతరమైనది, అంతకు ముందరి ప్రిపరేషన్సు. చిత్రమును వేయదలచిన గోడలు, పై కప్పులకు, దళసరి పూతగా మెత్తాలి. ఆ లేపనం మీద చిత్రాలను వేయాలి. ఐతే ఇక్కడ ఉన్న మెలిక- ఆ పూతలు తేమగా ఉన్నప్పుడే బొమ్మను గీయాలి. తడిపొడిగా, చెమ్మ ఆరీ ఆరకుండా ఉండగానే- బొమ్మలను వేసేయాలి. అంటే, ఈ కుడ్య చిత్రకళాకారులకు అత్యంత వేగంగా బొమ్మలను గీయగల నైపుణ్యం ఖచ్చితంగా అవసరం.ఎంతో ఓర్పు, సంయమనము అవసరము.
సరిపోయేటన్ని నీళ్ళను, కొంచెం కొంచెంగా కలుపుకుంటూ , ఆ ప్లాస్టర్ గుజ్జును అంటిస్తూండాలి. మెత్తగా ఉన్న ప్లాస్టర్ ను అవసరమైనంత మేరా ఒత్తుతూ, గోడ మున్నగు ప్రాంతాలలో ఆ ప్లాస్టర్ ఊడి, పడిపోకుండా మందంగా అంటించగలగాలి. అంతేకాదు, ఆ పొరలు, త్వరగా ఆరిపోకుండా, తగిన జాగ్రత్తలను తీసుకోవాలి. ఏమాత్రం ఎండిపోయినా, ఆ ప్లాస్టరు లేపనాలు పొడి బారి, పెచ్చులు ఊడిపోతాయి.
అందువలన చేసిన పని అంతా “వృధా ప్రయాస”పొడిగా ఔతుంది. కనుకనే కుడ్య చిత్రాలను, కుడ్య శిల్పాలను చేసే కళాకారుల పనులు- ఎంతో క్లిష్టమైనవీ, ఎంతో శ్రమ, ప్రయాసలను కలిగినవి.
(మన దేశ కరెన్సీపైన మూడు సింహాల బొమ్మ (threelions)- సారనాథ్ స్థూపము మీద ఉన్నది.
ఇలాంటి క్లిష్టమైన కళలతో కొన్ని తరాల పాటు కనువిందు కలిగుస్తున్న ఆ గుప్త కళాకారులకు ఘనమైన నివాళులను అర్పించడం మన కర్తవ్యం.
ఏదీ ఒక్కసారి “జేజేలు” పలకండి!