గురు రవిదాసు -బేగమ్ పురా

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

 

 

“మరో ప్రపంచం ” అంటే అందరికీ ఆపేక్ష. ఆశాజీవులు ఇట్లాంటి ఊహాజగత్తులను సృష్టిస్తూ ఉంటారు. కొన్ని శతాబ్దాలకు, ఇట్లాంటి నిన్నటి స్వప్నాలను, సమర్ధులైన జనులు, దేశాలు, నేటి ఆచరణలతో వాస్తవ స్వరూపములనుగా తీర్చి దిద్దుకొనగలుగుతున్నారు.

మన తెలుగున “మరోప్రపంచం” అనే మాట శ్రీశ్రీ రచన “మహాప్రస్థానం”  ద్వారా బహుళ ప్రచారం లోనికి వచ్చింది.  ఆధునిక కవితా పదబంధం ఇది, సరే! అంతకు మునుపు ఈ స్వాప్నిక పదం ఉన్నదా? ఔను, వున్నది- అనేకపర్యాయాలు అంటే “ఆధ్యాత్మిక వాదనలనుండి, లౌకిక కావ్య, కవితల వఱకూ”.వానిలో కొన్నింటిని స్పర్శిద్దాము.

“భూతల స్వర్గము”, “మరో ప్రపంచము”, “ఉటోపియా”, కల్పనాచమత్కారములైనవి. ఇవి కల్పనలే ఐనప్పటికీ ఎల్లరూ తరచూ మననం చేసుకుంటూ నిఘంటువులలో ఈ అమూల్య పదముల ఉనికిని భద్రపరస్తూ వస్తున్నారు.

రవీంద్రనాథ టాగూర్ మొదలైన మహనీయుల మనోఫలకాలపై ఆదర్శ ప్రపంచాన్ని ఎలా సృష్టించాలి? వంటి అనేక ఆలోచనలకు మంచి పునాదులను వేసినవి.   Where the mind is without fear” ఈ కోవలోనికి వచ్చినవి కొన్ని ఉన్నవి.   “ఉటోపియ”, “భూతల స్వర్గము”, “మరో ప్రపంచము” కల్పనా చమత్కారములైనవి. ఇవి కల్పనలే ఐనప్పటికీ ఎల్లరూ తరచూ మననం చేసుకుంటూ నిఘంటువులలో ఈ అమూల్య పదముల ఉనికిని భద్రపరస్తూ వస్తున్నారు.

ఈ కోవలోనికి వచ్చినవి కొన్ని ఉన్నవి.

ఉటోపియా (utopia) :- పాశ్చాత్య దేశాలలో నిర్వచనంగా రూపొందిన పదము. పడమటిసీమలలో తత్వవేత్తలు ప్లేటో, అరిస్టోక్రాటీల్, సోక్రటీసు- మున్నగు వారు పేదల కష్టాలను పరిష్కరించే బాట కొఱకై అన్వేషణలు చేసారు. ప్రజలందరూ సర్వసమానులై ఆనందమయమైన జీవితాన్ని గడుపగలిగిన రాజ్యం ఏర్పడాలని ఆకాక్షలతో ఇటువంటి నిర్వచన పదములను పరికల్పించారు. వాళ్ళు తమ ఆశలను  చక్రవర్తులకు బోధిస్తూ, ఆ రాజులను ఆశయాలను ఆచరించే దిశగా పయనించేటందులకు ఎంతో కృషి చేసారు. ఈ ప్రయత్నాలలో ప్రాణాలను సైతం కోల్పోయినవారు సోక్రటీసు, ఏసుక్రీస్తు (జీసస్): మొదలైన వారెందరో!  

 

 

Click the image to buy “Meera Bai: Her Life & Devotion”
ప్రాచీన హిందూదేశము నందు అట్టివారు ఉన్నారా? వారిలో ప్రధమగణ్యత గాంచిన మహనీయుడు? ఆయనయే “గురు రవిదాసు”. ఆయన సృష్టించిన మహా జగత్తు “బేగమ్ పురా” సీమ. మరి ఈ “గురు రవిదాసు ఎవరు? ఎప్పటివ్యక్తి?

मीराबाई रैदास को अपना गुरु मानते हुए कहती हैं –

गुरु मिलिया रैदास दीन्ही ज्ञान की गुटकी।

హిందీ భక్తి గీతములలో అగ్రతాంబూలం అందుకున్నవి మీరాబాయి ఆశువుగా చెప్పి, ఆలపించిన గీతాలు. ఆమె నుడివిన పద్యము ఇది. ఈ పద్యం ‘చారిత్రక ప్రాధాన్యాన్ని ’ పొందినది. ఎందుకంటే ఇందులో ఆమె పేర్కొనిన పేరు గురించి, మీరా ‘తన గురువు రైదాసు ‘ అని చెప్పినది. సుప్రసిద్ధ శ్రీకృష్ణ భక్తితత్పరత కలిగి, అనేక హిందీ భజన్స్ తో ప్రసిద్ధి గాంచిన స్త్రీ భక్త మీరాబాయి. ఈమె గురువు రవిదాసు.

“మీరాబాయీ రైదాస్ కో అప్నా గురూ మాన్ తే హుఏ కహతీ హై|

గురు మిలియా రైదాస్ దీన్హీ జ్ఞాన్ కీ గుట్ కీ||” 

అను “దోహా” ఈ విశేషానికి ఆధారమైనది.

మొదట క్లుప్తంగా భక్త మీరాకథను జ్ఞాపకం చేసుకుందాము.

శ్రీకృష్ణ భక్తి పూర్ణ ఐన రాజపుత్ర స్త్రీ మీరాబాయి. క్షత్రియవంశము యొక్క ఆ నాటి కట్టుబాట్లకు విరుద్ధంగా మీరాబాయి  ప్రవర్తన ఉన్నదని, ఆమె భక్తిమార్గం గృహిణీమార్గానికి వ్యతిరిక్తంగా ఉన్నదనీ, భావించిన పురుషులు కొందరు ఆమెను శిక్షించేటందుకు ప్రయత్నించారు. మీరాబాయి విపరీతమైన కష్టాలకు గురి ఐనా, వెరువలేదు, శ్రీకృష్ణ సంకీర్తనలను ఆపలేదు. హిందీ సాహిత్య మహల్ లో మీరా భజనలు (మీరా భజన్స్) సుస్థిర స్థానాన్ని సంపాదించినవి. ఆ మీరాబాయి ‘తన గురువు ‘గా ప్రస్తావించిన వ్యక్తియే రవిదాసు.

క్రిష్ణ భక్తి పారవశ్యాన, భక్త మీరా గానం చేసిన హిందీ పాటలు “మీరా భజనలు” జనులకు ఎంతో ప్రీతిపాత్రమైనవి.  భక్త మీరాబాయి యొక్క గురువు “రవిదాసు”. అనే యోగి. “రై దాసు” అని ప్రసిద్ధనామం ఈయనది. రైదాసు తెలిపిన మహోజ్వల జగతి పేరే “బేగం పురా”.

@@@@@@@@

గురు రవిదాసు జీవితము ఒడిదుడుకులకు లోనైనది.  నిమ్న కులస్థుడైనా, వ్యుత్పత్తి, ప్రతిభ కలిగిన  మహోన్నత వ్యక్తియై , సకల జనుల  ప్రశంసాపాత్రుడైనాడు.  “మీరాబాయీ రైదాస్ కో అప్ నా గురు మాంతే జాన్ కీ గుట్ కీ||”రవిదాసు తరచుగా తలచిన నామ సంకీర్తన చేసేవాడు.

********

రైదాసు/ రవిదాసు హీనకులమునకు చెందినవ్యక్తి.  కానీ ఆతని జిహ్వ నుండి వెలువడినవి అమోఘ భక్తి సూక్తులు, అవి ఎల్లరి గౌరవములను పొందినవి. రవిదాస్ అక్షరములను పలకపై దిద్దకుండానే విజ్ఞానము గడించగలిగాడు. రవిదాసును సిక్కులు “సంత్ శిరోమణి” అనీ, “సంత్ శిరోమణి రవిదాస్” అనీ ప్రేమాస్పద బిరుదులను పొందాడు. “గోబింద్” – అనగా “గోవిందుడు”. రామ్ , రాజా రామ్ చంద (రామచంద్రులు), రఘునాధ్, హరి,  క్రిష్ణ, మధో (మాధవ స్వామి, మాధవుడు, భగవానుడు, భగవాన్) విష్ణు నామములలో పునః  పునః నుడివిన మాటలు ఈ నామావళి, ఈ పేర్లు దేవుని, భగవంతునికి సంబోధనలు. భక్తి కీర్తనాకారులు ఇట్లాగ కొన్ని పేర్లను ఇష్టముగా మనం చేస్తూంటారు.

అలౌకిక శక్తికి ప్రతీకలుగా ఈ రీతి పదావళి సాహిత్యశోభకు దోహదములు, అలౌకిక ఆనంద శాంతిప్రదాతలు. అతను చెప్పిన ఒక పద్యం మానవుల ఆశాసౌధాలకు పునాది. భావికాలమున ఆ పలుకులు వాస్తవ రూపాన్ని దాల్చుతాయని కవి విశ్వాసమునకు అందలి పలుకులు స్ఫూర్తి ఐనవి.

సిక్కుల ప్రబోధకులను “గురు” అని గౌరవిస్తున్నారు. “గురు రైదాస్”, “సంత్ కులభూషణ్, కవి రైదాస్” – అని – గౌరవమును పొందారు. గురు రైదాస్ కవితలందున పైన పేర్కొన్న రీతిగా పరమాత్మ సంబోధనలు ముచ్చటగొలుపుతూన్నవి.

“అంతర్ కైసా, కనక్ కథిక్ జల్ తరన్ జైసా| బేగం పురా సహార్ ఖొ నావ్|( अंतर कैसा, कनक …… बेगम पुरा सहार नाव) వంటి దోహాలు గురు రవిదాసుని కదళీఫల మాధుర్య రీతిని శ్రోతలు ఆస్వాదిస్తున్నారు. రవిదాస్ పలుకులు పామరులకు సైత అర్ధం ఔతున్నవి. కనుకనే “ఆది గ్రంధము” నందు రవిదాస్ పదములు ముత్యాలకోవలు ఐనవి. సిక్కుల పవిత్రగ్రంధం “ఆది గ్రంధ”. గురు అర్జున్ సింగ్ సంకలనం చేస్తూ “ఆదిగ్రంథ్” లో దాదాపు 40 రవిదాస్ పదములను పొందుపరిచారు.

“గురు మిలియా రాయ్ దాస్ జీ” అని అవి,రవిదాస్ పదములకు నామధేయాన్ని కలిగినవి. రవిదాస్ జయంతిని పంజాబు రాష్ట్రీయులు మార్చి నెలలో జరుపుకుంటారు.

******

గురు రవిదాసు స్వాప్నికజగత్తు “బేగం పురా” ఏ తీరుగ ఉండాలని ఆశించారు?

“నా కులమంటే అర్ధం ఏమిటి? ? పుట్టుక అంటే ఏమిటి? రామా! నేను నీ సంరక్షణలో ఉన్నాను!”  చెప్పులు కుట్టే వాడైన రవిదాస్ ఇప్పుడు చెబుతున్నాడు.  ఇట్లాగ బేగం పురా చల్లని నీడలో (Begumpura  “land without sorrow”)

గురు రవిదాసు ఊహాలోకం గొప్ప ఆశావాదమార్గమున కదలినది. సంత్ రవిదాసు బాధాపీడితజనులకని రూపొందించిన ప్రపంచమైన ‘బేగమ్  పురా’ యొక్క స్వరూపాన్ని తీర్చి తీరు అమోఘమైనది. శోకరహితమై ఉత్సాహపూరితమైన ఆ చోటును “బేగం పురా” అని పిలుస్తారు. అక్కడ బాధ  ఉండదు, పన్నులు, సుంకములు ఉండవు, ఎవరికీ ఆస్థి ఉండదు, చెడు చేసే వారు ఉండరు, దుఃఖము, భీతి, శోధనలూ, వేధింపులూ ఉండవు గాక ఉండవు.

“ఓ సోదరా! నేను అట్లాంటి అమూల్యప్రపంచమును స్వంతం చేసుకోవడానికి వచ్చాను. ఎంతో దూరాన ఉన్న నా ఇల్లు అది, అందులో అచ్చట నివసిస్తున్నవారు, ఎవరి కోరుకున్న విధంగా వారు మెలగగలుగుతారు.అవీ ఇవీ అన్ని పనులనూ చేసుకోవచ్చును, ఊహాప్రపంచాలలో ఇచ్చవచ్చిన రీతిగా విహరిస్తారు. ఓహ్! రవిదాసు అనే చర్మకారుడు( జంతు చర్మాల్ని, తోళ్ళను శుభ్రచే వాడు, చెప్పులు కుట్టే వాడు అని ఆ మహాత్ముడు నిర్దేశించిన ‘రేపటి ప్రపంచం’ ఆచరణలోనికి రావడానికై  ఎల్ల జనులు, సంఘీభావనతో పురోగమించడమే ముందున్న కర్తవ్యం. బేగం పురా” అనేది అందమైన ఊహాప్రపంచము.  ఇక్కడ బేగమ్ పురా:- బేగమ్  పుర షహర్ – కు నిర్వచనము- దుఃఖము లేని ప్రదేశము. ఇది ఆదర్శ ప్రాంతము.”

@@@@@@@@

రవిదాసు నుడువులు కొన్ని:- 

 “నేను నీ సంరక్షణలో ఉన్నాను, రామా!- అన్నాడు పాదరక్షా క్రియుడైన రవిదాస్.

“బేగం పురా – ఇది ఆదర్శ ప్రాంతము.”

“బేగమ్ పురానందు పన్నులు, సుంకములు ఉండవు. ఎవరికీ ఆస్థి స్వంతమై ఉండదు. “

“ఖేదరహితమైన ప్రదేశమే బేగమ్  పుర.  వేదనజాడలు ఉండని సీమ బేగమ్ పురా షహర్. “

“ఎవరూ తప్పులు, నేరపూరితమైన పొరపాట్లను చేయరు. “

బాధ, భీతి, వేధింపుల జాడలు ఉండని ప్రాంతము బేగమ్ పురా.”

“ఓ నా సోదరా! సుదూరంగా ఉన్న నా గృహం నుండి తీసుకొనుటకై వచ్చాను, ఈ బేగమ్ పుర లో ప్రతి అంశముపైన హక్కు ఉన్నది. “

“మనిషి ఇదీ అదీ అనే తేడా లేకుండా అన్ని పనులనూ చేసుకోగలరు. తమకు ఇష్టమైన చోట యధేచ్ఛగా వెళ్ళవచ్చును. గాధాహర్మ్యాలకు, సుందర భవనాలకు – తిరుగాడగలరు.”

“ఓహ్! చెబుతున్నాడు రైదాస్, “ఒక తోళ్ళు శుభ్రం చేసే వ్యక్తి ఇప్పుడు స్వేచ్ఛా జీవి ఐనాడు.“

*******

క్రీ.శ. పదిహేనవ శతాబ్దములో సంత్ కులభూషణ్ కవి రైదాస్సు భాషితములు, వీరు నిర్దేశించిన ఆశావహ ప్రపంచము, అక్కడి జనులు మెలగవలసిన తీరుతెన్నులు, ప్రజలు గడపదగిన ఆదర్శ జీవనపద్ధతులు, ఆకాశదీపములైనవి. దిక్సూచి, మార్గదర్శినులు ఇవి.

*******

Your views are valuable to us!