Like-o-Meter
[Total: 0 Average: 0]
ఆ మూడు ఇంగ్లీషు పాటలు గిన్నీస్ రికార్డుల గద్దెను అధిరోహించినవి. అవి ఏమిటి? సింహావలోకనము చేద్దామా!?
అమితంగా పాప్యులర్ ఐన ఆ పాటలు ఇవి:
1) “Happy Birth Day to you! Happy Birth Day to you!”
2) Auld Lang Syne’;
3) ‘For He’s a Jolly Good Fellow.’
మ్యూజికాలజిస్ట్ ఐన మిల్ డ్రెడ్ కంపోజ్ చేసిన “హ్యాపీ బర్త్ డే టు యు” పాట, పుట్టినరోజు నాడు జేజేలు పలుకుతూ ప్రపంచవ్యాప్తంగా ఆత్మీయతల కలబోతల శుభాకాంక్షలను ఈనాటికీ పంచిపెడ్తూనే ఉన్నది.

“Good morning to all” అనే ఆ పాటను తర్వాత ప్యాటీ హిల్ పుస్తకమును ప్రింట్ చేసి అందులో చేర్చినది. “Childrean’s songs” లో చేర్చింది ప్యాటీ హిల్. ప్రతిరోజూ విద్యార్ధులు ఈ పాటను పాడుతూ ఉండేవాళ్ళు. తర్వాత అదే ట్యూనుతో “జన్మ దిన శుభాకాంక్షలు” చెప్పే పాటను తమ టీచరుసహకారముతో కూర్చారు! అదే “హ్యాపీ బర్త్ డే టూ యూ!”
ఆ క్షణాన తమ గళములను కలిపిన ఆ చిన్నారి చిట్టి పాట భావి కాలాన అనంత ప్రజాదరణను గడిస్తుందని ఆ రోజు అక్కడ ఉన్న వారు అనుకుని ఉండరు.
ఒక నెల ఆలస్యంగానైనా హ్యాపీ బర్త్ డే సృష్టికర్తకు బిలేటెడ్ బర్త్ డే విషెశ్ చెబుదామా….హ్యాపీ బర్త్ డే టు యూ మిల్డ్రెడ్! హ్యాపీ బర్త్ డే టు యూ”