జ్ఞాన ప్రతీక సొయొంబో

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

Soyombo Symbolఈ బొమ్మను గమనించారా?
 

 

ఇది బౌద్ధ – ధర్మ ప్రతీకాత్మక అక్షరము. దేవనాగరి, టిబెట్, సంస్కృత లిపుల నుండి తీర్చిదిద్దిన మహా అక్షరము, మంగోలుల సంస్కృతిలో పవిత్రమైన పూజ్యనీయ సొయంబోఅక్షరము .
 

 

హిందువులకు ఓమ్ కారము, శ్రీకారము వంటిదే ఈ  సొయొంబో అక్షరము. ఈ బొమ్మను మళ్ళీ పరిశీలించండి. ఇందులో మన దూరదర్శన్ వారు అనుసరిస్తూన్న ప్రతీకాత్మక చిత్రం ఉన్నది కదూ!
 
దీనిలో “ఓమ్”, కళ్యాణ తిలకము, సూర్యుడు, చంద్రవంక, విశ్వ ఆవిర్భావము, త్రికోణము, పీఠము,  ఛత్రము ఆదిగా గల అనేక అంశములు ఊహాత్మక స్వరూపములలో చిత్రితమై ఉన్నవి. ఈ సింబల్ కర్త మంగోలియా – పేరు జాన బజర్ (జ్ఞాన వజ్ర). 1686 సంవత్సరము కాలములో Zanabazar అనే బౌద్ధ ధర్మ- వజ్రయాన అనుయాయి సొయొంబో సింబల్ ను రూపకల్పన చేసిన సింబల్ సొయొంబో.
 

 

(The Soyombo alphabet was created in 1686 by the famous Mongolian monk and scholar Zanabazar; Lantsa-Dewanagari script,Tibetan and Sanskrit; prayer mills and temples).
 

 

సొయొంబో జ్ఞాన ప్రతీక, మంగోలియా భాషా లిపి నిర్మత Zanabazar. హిందూ లిపి నుండి, లాంజిష్ లిపి నుండీ జాంజబజార్ – కొత్త లిపిని ఆవిష్కరించాడు. సొయొంబో అక్షరము, వ్రాతలో చాలా క్లిష్టతరముగా ఉన్నది. అందుచేత ఆ ఆక్షరము ప్రజల నిత్య వ్యావహారిక వ్రాత లిపి(Hand writing) లో  వ్యాప్తి చెందలేదు (అంటే మన తెలుగులోని క్రమేణా చేతి రాతలో నుండి కనుమరుగు ఐనట్టిబండి ర= ఱ, అలుకారము= , విసర్గ= జఁ = (
ఈ మాదిరిగా అన్నమాట.
[ ~l ]
[ ~L ]
[ ~r ]

 

 

జఁ [~@M ]

 

 
నేడు ప్రార్ధనా మందిరములలోనూ, పగోడా దేవళములలోనూ ఈ ప్రతీక చైతన్య భాసురమై ఉన్నది.
 

Your views are valuable to us!