కుమారీ పూజ – శ్రీ దేవీ నవరాత్రోత్సవములలో – జరిగే ఆచారము. ఉత్తరాదిన నేపాల్, మహారాష్ట్ర ఇత్యాది కొన్ని రాష్ట్రములలో అనుసరిస్తున్నారు ప్రజలు. దుర్గా మాతను నేపాల్ దేశములో “తలేజు” అని పిలుస్తారు.
కౌమారి- అనగా బాల్యాన్ని అనుసరించే దశ. కుమారీ దశను దాటగనే అంకురించేదే యవ్వనము. ఈ లేత ప్రాయము సౌకుమార్య సౌందర్యానికి ప్రతిబింబము. కనుకనే ఈ కుమారీ దశను ఎన్నుకుని అలాటి బాలికలను మందిరములో ఆసీనలు గావిస్తారు. ఇందువలన. గుడి ప్రాంగణము కళకళ లాడ్తూంటుంది.
******
కుమారీ గృహము:
నేపాల్ లో అలా పూజించవలసిన బాలికను ముందు ఎన్నిక చేస్తారు. శాక్య, బజరాచార్య (=వజరాచార్య) మున్నగు వంశ బాలికలను ఈ పీఠములో ఆసీనులను చేస్తారు.
రాయల్ కుమారీ/ రాజ కుమారి- అని ఈ అర్చిత బాలిక-ను పిలుస్తారు. “సజీవ దేవత” గా అర్చనలు చేస్తారు.ఆమె “కుమారీ గృహము” (Royal Kumari of Kathmandu- Kumari ghar) లో ఆమెను ఉంచి, షోడశోపచారములు చేస్తూంటారు. పవిత్రభావముతో కొలుస్తారు. కౌమారీ దశ వఱకు మాత్రమే ఆమెను- చూస్తారు. కౌమారదశ పూర్తి అయి, యవ్వనములోకి అడుగు పెట్టిన కన్యకను లౌకిక జీవితములోనికి ప్రవేశించినదని – భావము. అటు తర్వాత ఆ అమ్మాయి సంఘములో సాధారణ జీవితమునకు సంబంధించిన జవ్వని- గా గౌరవింపబడుతుంది.
2008 అక్టోబర్ లో మతీనా శాంఖ్య – అనే చిన్నారి రాజకుమారి “కుమారీ దేవత” ఐ, పూజలను అందుకొన్నది. (Royal Kumari of Kathmandu : Kumari Ghar)
******
కుమారీ పూజలు- ఉత్తరాదిలో- బెంగాల్ ఇత్యాది రాష్ట్రాలలో ఆచరణలో ఉన్నది. ఐతే ఆయా రాష్ట్రములలో వివిధ పద్ధతులు ఉన్నవి. కొన్ని సీమలలో అలంకృత బాలికను- ఒకరోజు మాత్రమే పూజిస్తారు.
కుమారి:- శిశువుల ఆరోగ్యానికి, కేరింతలు కోసమై:
త్రిమూర్తి:- దీర్ఘాయుస్సు, ఆరోగ్య భాగ్యాల కోసము:
కళ్యాణి:- విద్యాభివృద్ధి, మంచి స్నేహశీలి, మంచి మైత్రిని సంపాదించుట కోసము:
రోహిణి:- స్థిమిత బల సంపన్నత :
చండిక:- సిరి సంపదలు అనుగ్రహించుట|
శాంభవి:- ధైర్యశక్తి|
దుర్గ:- అసాధ్య పనులను సైతమూ చేసే కార్య సాధకులు అగుట|
సభద:- అభీష్టఫలదాయిని
ఈ రీతిగా వయసులవారీగా సకల ఈప్సితములు నెరవేర్చగలిగే 9 శక్తిస్వరూపిణులుగా కుమారీలకు అర్చనలు చేస్తూంటారు.