Like-o-Meter
[Total: 1 Average: 4]
మన మహా ఇతిహాసమైన “మహా భారతము”లో “లాక్షా గృహము” ఘట్టము ఉన్నది. పంచపాండవులు ఏకఛత్రపురమునకు చేరుటకు మూలమైనది ఈ అధ్యాయం. హిడింబా భీమసేనుల పెళ్ళి, నగరములో మత్స్యయంత్రభేదనము చేసిన అర్జున-ద్రౌపదీ పరిణయములు జరిగినవి. ఆ వివాహమల వలన పాండవులకు బంధుబలగము సమకూరి, వారికి అండదండలు దొరికి, భవిష్యత్తులో దాయాదులతో ముఖాముఖీ పోరాడగలిగిన “సమ ఉజ్జీలు” ఐనారు. పాండవవనవాసము-నకు దారీ తీసిన ఆ పరిస్థితులలో పాండవులు ఉండాల్సిన స్థితి, వారి అవస్థలు, కథాగమనానికి చాలా స్పీడును కలిగించిన ఆ వైనములు మీకు గుర్తుకువచ్చినవా! ఇంతాచేసి ఈ వ్యాసానికి మూలమైనది లక్క (లాక్ష).
*******
ఉపఖండంగా ప్రసద్ధి చెందిన ఇండియాలో ఈ నేలపై పెరుగుతూన్నమూలికలు, మొక్కలు, లక్క(లాక్షారసము), లోధ్ర, ఇలాటి వాటన్నిటి గురించీ19వశతాబ్దములలో-పాశ్చాత్యప్రపంచానికి తెలిపిన వ్యక్తి ఒక ఆంగ్ల భాషీయుడు. అతని పేరు విల్లియం రోక్స్ బర్గ్. 1751జూన్ 29వతేదీన జన్మించిన స్కాటిష్ సర్జన్, బోటనిస్టు. విల్లియం రోక్స్ బర్గ్ 17 సంవత్సరముల వయసు వచ్చేసరికి ప్రపంచయాత్ర చేస్తూ, జీవనోపాధిని పొందేవాడు. హిందూదేశములో లక్క వినియోగము ఆతని దృష్టిని ఆకర్షించింది. ఇండియా బాటనీ విద్యా విభాగాలకూ, లాబరేటరీలలో వృక్ష సంబంధ పరిశోధనలకు మంచి పునాదిని వేసిన వ్యక్తి!
అప్పటికి హిందూదేశములో – ఈస్ట్ ఇండియా కంపెనీ పెత్తనము మొదలైనది. కుంఫిణీ (company) పాలనలోని భారతదేశానికి “ఇండియా” అనే పేరు వచ్చినది. ఈస్ట్ ఇండియా కంపెనీలో పాలనలోని ఇండియాకు చేరి, మద్రాసులోకి అడుగుపెట్టాడు. మద్రాసులోకి అడుగుపెట్టిన స్వతహాగా అతను ప్రకృతి పట్ల ఆసక్తి కలిగిన మనిషి.విల్లియం రోక్స్ బర్గ్ India కు చేరాడు. అప్పటినుండీ ప్రకృతి ప్రేమికునిగా నిరంతర కృషినిసాగించాడు.ఉపఖండము ఇండియాలో పెరుగుతూన్నమొక్కలు, చెట్లు గురించి గణిత సేకరణలను లిపిబద్ధము చేసాడు.
సంవత్సరాల పర్యంతమూ అంటే 1820 దాకా ఇలాటి వివరములను సైంటిఫిక్ గా చేసిన మొదటి వ్యక్తి ఈతడే!Ramsden barometers and Nairne thermometers మున్నగు పరికరములతో అవిరళకృషి చేసాడు.
లోధ్ర – గోరింట, ఇత్యాది వేలాది మొక్కలు, తరు సంపదలు వాని జాతులు, ప్రజాతులను గూర్చి సవివరముగా రాసాడు, తరువాతి తరాల వారికి పరిశోధనలకు అమూల్య సంపదగా అందించాడు. విల్లియం రోక్స్ బర్గ్ భారతీయ వృక్షశాస్త్ర జనకుడు (Father of Indian Botany) అనే బిరుదును పొందాడు. ’లక్క’ అనే అమూల్య పదార్ధము గురించి పాశ్చాత్యలోకానికి విలువైన సమాచారాన్ని అందించడం చేత “Asiatic Society” లో మెంబర్ ఐనాడు విలియం.
*******
లక్కను – ఉత్తరములు, కొరియర్ పార్శిలు వస్తువులు, కోర్టు వ్యవహారాదులలో- “సీలు చేయుటకు” వాడుతూంటారు కాబట్టి అందరికీ తెలిసినదే! మైనములాగా కాస్త సెగ తగిలితే-త్వరగా కరిగిపోయే స్వభావం దీనిది. ఇది మిలమిలా మెరుస్తూ మైనము, వార్నీషులను పోలివుంటుంది. అందుచేత ఇది చెట్ల బెరడు నుండి తయారయ్యే జిగురు లాంటి పదార్ధమని చాలామంది పొరబడుతారు. ఐతే “లక్క పురుగు” వలన ఉత్పత్తి ఔతూన్నది అంటే ఆశ్చర్యం కలగక తప్పదు.
భారతదేశములో కాళ్ళకు పారాణి మొదలైన ఆచార సంప్రదాయాలలలో లక్క ఎక్కువగా తటస్థపడ్తూంటుంది. ఇంతటి ప్రశస్తమైన లక్కను గూర్చి 1800 ల తర్వాత తెల్లవారికి యూరోపు ఖండముల ప్రజలకు తెలిసింది. ఇందుకు కారణము విల్లియం రోక్స్ బర్గ్. “లక్క” ఒక పురుగు నుండి చేయబడ్తుంది. రికార్డ్ లలో రాసి, ప్రపంచానికి భారతీయులు కుటీరపరిశ్రమలలో విరివిగా వాడే విశేషాలను చెప్పాడు. వీటిని కొత్త అంశాలుగా యూరోపు దేశీయులు ఆశ్చర్యంతో గమనించారు.
నేడు మన దేశములో లక్క ఉత్పత్తిలో జార్ఖండ్ రాష్ట్రము ప్రధమ స్థానములో ఉన్నది. చత్తీస్ ఘడ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర లు తదుపరి క్రమముల్లో ఉన్నవి.
\విల్లియం రోక్స్ బర్గ్ “Father of Indian
Botany“
అనే పురస్కారముతో సదా జ్ఞాపకములలో కొలువై ఉంటాడు.