మరో అమరశిల్పి – రువారి మల్లిటమ్మ

Spread the love
Like-o-Meter
[Total: 1 Average: 5]

అమరశిల్పి జక్కన్న మన అందరికీ తెలుసు. తెలుగులో “అమరశిల్పి జక్కన” (నాగేశ్వరరావు, బి.సరోజ)ఈస్ట్ మన్ కలర్ లో నిర్మించిన సినిమా కూడా వచ్చింది.

అమరశిల్పి జక్కన్న ఆచార్య వలెనే శిల్పకళా విద్యలో వాసికెక్కిన శిల్పి “రువారి మల్లిటమ్మ”.

పశ్చిమ చాళుక్యుల సామ్రాజ్యములో నివాసి, ప్రముఖ శిల్పాచార్యుడు. శిల్ప, దేవాలయ నిర్మాణ కళలలో చేయి తిరిగిన వాడు రువారి మల్లిటమ్మ.

ఈతని కళా నైపుణ్యము 12 శతాబ్దములలో కర్ణాటక, దక్షినబారత రాష్ట్రాలలో విరాజమానమైనది. అమృతేశ్వర దేవాలయము మున్నగు దేవళములలో విరాజిల్లినది.

గోవిందపల్లి వద్ద 13వ శతాబ్దములో పంచలింగేశ్వరస్వామి కోవెల శిల్పాచార్యుడైన రువారి మల్లిటమ్మ ప్రజ్ఞకు తార్కాణము.

ఈ గుడి హొయసల శిల్ప శైలిలో కనువిందు చేస్తూన్నది. హొయసలలో- అద్భుత శిల్పాలను 40 పైనే అనుయాయులు,శిష్యులు చెక్కి నిలిపినారు.

నేటికీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య వంటి ఇంజనీరులకు మార్గదర్శకునిగా వృత్తినైపుణ్యములో- మహామహుల నమోవాకములను అందుకున్న శిల్పకారుడు.

ఆధునిక చిత్రలేఖన, శిల్ప, వాస్తు, సివిల్/ భవన నిర్మాణ రంగములు రువారి మల్లిటమ్మ అడుగుజాడలను భక్తిభావముతో మననము చేసుకొంటున్నాయి అంటే అతిశయోక్తి కాదు.

Your views are valuable to us!