Like-o-Meter
[Total: 0 Average: 0]
ఏథెన్స్ లోని మహా హర్మ్యము 19వశతాబ్దిలో నిర్మించబడినది. ఆ భవంతిపైన “స్వస్తిక” గుర్తు ఉన్నది. అదీ విశేషం. ఆ భవనమును రూపకల్పన చేసింది హైన్ రిచ్ అనే జర్మనీ భవన నిర్మాణవేత్త,వాస్తు నిపుణుడు దీనిని నిర్మించాడు.
మాగ్జిమియానీ పోర్టాస్ (Maximian Portas) అనే ఫ్రెంచ్ వనిత జీవితాన్ని మలుపు తిప్పిన సింబల్ ఈ స్వస్తిక్ .
ఆమె “ఆర్య జాతి గురించి గొప్పది”అనే అభిప్రాయాలను కలిగి ఉన్నది. పురాతన కాలము నాటి ను౦డీ చరిత్రలో ఆర్యులు ఉన్నత ఆశయాలు, ప్రకృతి ఆరాధకులు సున్నిత భావజాలములు కలవారు,
“ఆర్యులు ఎక్కడివారు? ఎచ్చటనుండీ వారి పుట్టుపూర్వోత్తరముల మూలము ఉన్నది?” అనే సందేహాలు పొడిమాయి.అప్పటినుండీ ఆ దిశగా పరిశీలనాత్మక పరిశోధనలు చేయ నారంభించినది.
“ఆర్యులు ఎవరు? నేటి ఆధునిక యుగంలో వారు ఎక్కడ సుప్రతిష్ఠులై కానవస్తునారు?” అనే అంశాన్ని ఆమె శోధనను కొనసాగించినది. ఈ అన్వేషణకు గమ్యము ఆమెకు తటస్థపడినది. ఆర్యజాతి భారతదేశములో పావన జీవన మార్గములలో కొనసాగుతూన్నది. ఆర్యులు ఆరాధించే దేవతలను, ప్రకృతినీ హిందువులు పూజిస్తూన్నారు. నడవడిక, ప్రవర్తనా సరళి- ఉదాత్తమైన ఆర్యుల ఆశయాల అనుసరణ,భారతీయులు ఆచరణలో నవ పల్లవముగా ఉన్నది.
“హిందువులే స్వచ్ఛమైన ఆర్యజాతికి ప్రతిబింబములు” అనే దృఢ సంకల్పము క్రమంగా ఆమెకు ఏర్పడినది. 1935 – 1936 ల ప్రాంతాలలో ఇండియాకు వచ్చిన ఆమె, హిందూ సాంప్రదాయాల ఆంతర్యము, సంస్కృతి పట్ల మంచి అవగాహన కలిగినది. 1935 లలో బెంగాల్ రాష్ట్రములోని బోల్ పూర్ లోని రవీంద్రనాథ టాగూరు ఆశ్రమములో చేరి, సంస్కృతీ అధ్యయనము , హిందీ భాష, బెంగాలీ భాషలను నేర్చుకున్నది.
*****
మాగ్జిమియానీ పోర్టాస్సహ విద్యార్ధుల ఆలోచనలను మనస్ఫూర్తిగా ఆమోదించి, తన పేరును మార్చుకున్నది. సూర్యుడు, ఆదిశక్తి ల నామమును ఎన్నుకున్నది. “సావిత్రీ దేవి” గా ఆమె కొత్త జీవితమును ప్రారంభించినది. మాగ్జిమియానీ పోర్టాస్ ప్రాణ శక్తినీ,జీవితమునూ, తేజస్సునూ ప్రతిబింబిస్తూన్న పేరు “సావిత్రీ దేవి”ని తన నూతన నామధేయముగా గైకొన్నది. “పాశ్చాత్య దేశాలలోని వారు ప్రాచీన ఆర్యులు ఒసగిన జీవిత విలువలను కోల్పోయారు. హిందువులు నివసిస్తూన్న ఇండియా, అద్భుతమైన ఆర్య సంస్కృతీ సంప్రదాయాలకు రక్షణ దుర్గముగా విలసిల్లుతూన్నది” అని నొక్కి వక్కాణించినది.
ఆమె రచించిన అనేక గ్రంధములు విలువైన భావసంపదతో ప్రజల ప్రశంసలను పొందినవి.