శ్రీపాద వల్లభులు

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

sri pada vallabhacharya

శ్రీపాద వల్లభుల మాతృ వర్గ తరఫు న నుండి 30 తరముల వెనుక నుండి బంధుత్వము కలిగిన భాగ్యశాలి మల్లాది గోవింద దీక్షితులు.

ఆయన కృషి చేసి, రేఖా మాత్రంగా ఉన్న శ్రీ పాద వల్లభుల చరిత్రను కూలంకషంగా పరిశీలన చేసి, శ్రీపాద వల్లభు విపుల చరిత్రను వ్రాసారు. మరాఠీ భాషలో శ్రీ సరస్వతీ గంగాధర్ 1450 A.D.లో రాసిన శ్రీ గురు చరిత్ర లో శ్రీ శ్రీ పాద వల్లభుల ప్రస్తావన ఉన్నది.

శ్రీ పాద వల్లభులు మన తెలుగు దేశం వాడు అగుట మనకు గర్వ కారణము. శ్రీపాద వల్లభులు గోదావరి జిల్లాలోని పిఠాపురం లో పుట్టారు. 

శ్రీ పాద వల్లభులు 1320 – 1350 కాలమునాటి ముని. శ్రీపాద వల్లభులు దర్శించిన ప్రదేశాలలో ఒకటి కర్ణాటక రాష్ట్రములోని కరువపూర్. శ్రీపాద వల్లభులు చరణ స్పర్శచే పునీతమైన ఊరు కరువారూర్, ఇచ్చట శ్రీపాద వల్లభుల ముద్రలు ఉన్నవి.

 

హిమాలయాలలో తపము ఆచరించిన తపస్విలు అగణితముగా ఈ సీమను దర్శించుకున్నారు. స్కంద పురాణములో 28 వేల మంది తాపసులు కరువరూర్ ను దర్శించారని చెప్పినది. ఇలాగ ఈ శ్రీ పాద వల్లభుల పవిత్ర పుణ్య క్షేత్రమైన కరువరుర్ భాసిల్లుతూన్నది

క్రిష్ణా నది వలయముగా ఏర్పడి, మధ్యలో ఉన్న కరువారూర్  “గురు ద్వీపము” గా పిలువబడుచున్నది. కరువారూర్ లో అనేక విశేషాల వలన ఇటు పుణ్య క్షేత్రముగా మాత్రమే గాక, అటు చారిత్రక స్థలముగానూ, ప్రకృతి దృశ్య ప్రేమికులకు విహార స్థలంగానూ విలసిల్లుతూన్నది.

 

అచ్చట ఒక గొప్ప వృక్షం ఉన్నది. ఆ ఔదుంబర వృక్షము కింద తెంబె స్వామి తపస్సు చేసారు. ఇక్కడ 1000 సంవత్సరాల వట వృక్షము ఉన్నది. ఈ ప్రాచీన వృక్షము, అటు వృక్ష శాస్త్రజ్ఞులకు, ఇటు  భక్తులకూ, ప్రకృతి ప్రేమికులకూ ఆహ్లాదాన్ని చేకూరుస్తూన్నది. ఈ చెట్టు ఉన్న గుహ (Kuravpur/ kuruvalaya/Kuravapura). అలాగే శ్రీ విఠల్ బాబా ఆశ్రమం, దత్త మందిరము చూడవలసిన  చోట్లు.

శ్రీ పాద వల్లభుని సమకాలీన వ్యక్తి శంకరభట్. ఈతను కన్నడ భాషలో చేసిన రచన – “శ్రీ శ్రీ పాద వల్లభర దివ్య చరితామృత”. ఇందులో శ్రీపాద వల్లభుల తపో సముపార్జిత అద్భుత మహిమలను వర్ణించారు.

నవంబర్, 2001 లో మల్లాది గోవింద దీక్షితులు – భక్తవరులకువారి  అమూల్య రచన  లభించినది. 53 అధ్యాయాలు ఇందులో ఉన్నవి. కర్నాటక రాష్ట్రంలో, చిత్ర దుర్గ జిల్లాలోని, చల్లకెరె తాలూకాలో ఉన్న దొడ్డెరి గ్రామములో శ్రీ గురు  కన్నేశ్వర స్వామి దత్తావధూత ఆశ్రమము వారు “శ్రీ శ్రీ పాద వల్లభర దివ్య చరితామృత “ను ముద్రణలు భక్తులకు ఇచ్చారు.

{jcomments on}

Your views are valuable to us!