Like-o-Meter
[Total: 0 Average: 0]
భారతదేశములో ప్రజలు ఎంతో భక్తితో ఆచరించే వ్రతము “శ్రీ సత్య నారాయణ వ్రతము”. పురాణములను శోధించి ఈ నోమును కథగా వ్రాసి లోకానికి అందించిన రచయిత శ్రీ కాశీపత్యావధానులు.
రాయచూరు వద్ద ఉన్న ఆత్మకూరులో ముత్యాలయ్యాచారి అనే వ్యక్తి ఉండేవాడు. సంతానార్ధి ఐన ఆయన శ్రీ కాశీపత్యావధానులు చేత “శ్రీ సత్య నారాయణ వ్రత మాహాత్మ్యము”ను రచియింప చేసాడు.
అతని చిన్న భార్యకు సంతానము కలిగి,అతని కోరిక ఈడేరింది.
వారి సంకల్పబలము చేత ఆ విధంగా లోకానికి “శ్రీ సత్య నారాయణ వ్రత కల్పము”లభించినది.