ఈ యజమాని చాలా మంచివాడు!

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

 

రావూరి భరద్వాజ ధనికొండ వద్ద ఉద్యోగం చేసారు. తర్వాత ఆయన వద్ద పని మానేసారు. 1958 లో ఒక ఫౌంటెన్ పెన్ కంపెనీలో చేరారు. ఒకనాడు కలములను మిషనులలో తయారు చేస్తున్నారు. అప్పుడు ఒక పెన్నుకాస్తా పాడైంది. దాంతో ఆ కంపెనీ ఓనర్ కివిపరీతమైన కోపం వచ్చింది. రౌద్రంతో ఎదురుగా దొరికిన రావూరి భరద్వాజను చడామడా తిట్టేసాడు. 
 
నిజానికి ఆ యజమాని యొక్క అన్న కుమారుని వలన ‘తయారీలో ఉన్న ఆ పెన్ను‘ పాడైంది. రావూరి భరద్వాజ నెమ్మదిగా విషయాన్ని విడమర్చి చెప్పాలని ప్రయత్నించాడు. కానీ క్రోధావేశాలతో ఊగిపోతూన్న ఆ కంపెనీ స్వంతదారు- “నోర్ముయ్! మాట్లాడావంటే పళ్ళు రాలగొడ్తాను.” అని ఱంకెలు వేసాడు.
 
కొంతకాలం గడిచింది. ఒక రోజు  యజమాని కొడుకు రావూరి భరద్వాజ వద్దకు వచ్చి చిన్న సాయాన్ని అడిగాడు. 
అతని రిక్వెస్టును మన్నించి రావూరి భరద్వాజ తనకు చేతనైన హెల్ప్ చేసాడు. ఆ దొరగారి కుమారుడిని తనకు తెలిసిన చోట ఉద్యోగం ఇప్పించాడు రావూరి భరద్వాజ. ఆయన అలాగ ఉద్యోగం  ఇప్పించిన చోట చేరాడు ఆ అబ్బాయి. ఉద్యోగం పురుష లక్షణం- అని అప్పటి నానుడి. సంతోషంతో పనిలో చేరిన స్వామి తనయునితో ఇలా చెప్పాడు రావూరి భరద్వాజ
 
“అబ్బీ! జాగ్రత్తగా పని చేసుకో! ఈ యజమాని చాలా మంచివాడు. మీ నాన్నగారి మాదిరిగా నిష్కారణంగా కోపగించుకోడు. చేయని తప్పుకు పళ్ళు రాలగొడ్తానని మాత్రం అసలే అనడు.” 
 
{ఆధారము:- “నాకు దేవుని చూడాలని ఉంది”- “తెలుగు విద్యార్ధి} 

 

 

Your views are valuable to us!