కొన్ని హైకూలు

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

తలకట్టు, దీర్ఘమైతే 

పోయిన ప్రాణం 

తిరిగిరాదా? ఆ పూలజడలకి 

**************

ముందుకెళ్తూ 

వెనుకకు చేర్చేది ఫ్యాషన్ 

వెనుకబడుతూ 

ముందుకు నడిపేది కల్చర్ 

****************

మనసు చేసే 

మౌనపు సేద్యాన 

కలుపు తప్పదోయి ఊహలుగా  

**************

ప్రకృతి అందాల వెనుక 

పరుగులెత్తే మనసులకి 

పట్టే స్వేదమేనోయ్ అమృతమంటే 

**************

Your views are valuable to us!