ఆంధ్రప్రదేశ్ విభజన – గ్రహాలు ఏం చెబుతున్నాయి?

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

రచయిత: జ్యోతిష్య పండిట్ S. నరేంద్ర కుమార్ శర్మ

[amazon_link asins=’8170822459,8193440072,8170822084,8170821541′ template=’ProductGrid’ store=’aavaakin-21′ marketplace=’IN’ link_id=’3ff4567d-0d21-11e9-8a0b-8fa762306f1a’] 

 

“ఆంధ్రప్రదేశ్ ఎన్నటికి విడిపోదు. రాష్ట్ర విభజన జరిగే ప్రసక్తే లేదు. “ అని గ్రహస్థితులు సూచిస్తున్నాయి.

గ్రహస్థితుల పరిశీలన

రాష్ట్రాన్ని రెండుగా చీల్చగల గ్రహాలు ఏమైనా ఉన్నాయా అన్న అంశాన్ని చూద్దాం.

మన భారత భూఖండంలో ఇండియా – పాకిస్తాన్ గా విడిపోయినప్పుడు ఎలాంటి గ్రహస్థితులున్నాయి? అఖండ జర్మనీ తూర్పు – పశ్చిమ జర్మనీలుగా చీలిపోయినప్పుడు ఎలాంటి గ్రహస్థితులున్నాయి? పంజాబ్ రాష్ట్రం విడిపోయినప్పుడున్న ఖగోళ పరిస్థితులేమిటి? ఇటీవలే ఎన్.డి.యె. ప్రభుత్వ హయాంలో చిన్న రాష్ట్రాలు (ఛత్తీస్ గఢ్, జార్ఖండ్, ఉత్తరాంచల్ మొ.) ఏర్పడినప్పటి గ్రహాల స్థితిగతులేమిటి? – ఇలా గత అరవై ఏళ్ళకు పైబడి ప్రపంచ వ్యాప్తంగా జరిగిన కొన్ని ప్రముఖమైన విభజనల్ని పరిగణలోకి తీసుకొని తులనాత్మకంగా, జ్యోతిష్య శాస్త్రాధారంగా అధ్యయనం చేస్తే ఈనాటి ఆంధ్రప్రదేశ్ విభజన పై అంతిమ ఫలితాల్ని ఊహించేందుకు అవకాశం కలుగుతుంది.

  1. భారత – పాకిస్తాన్ విభజన – గ్రహ స్థితులు
                         రాహు (లగ్న)

 

కు
 

స్వతంత్ర్య భారతదేశం ఏర్పడినప్పటి గ్రహ స్థితులు

15/08/1947

చంద్రుడు, బుధుడు, శుక్రుడు, శని, రవి
          కేతు            గురుడు  

 

 కాలసర్ప దోష ప్రభావం వలన (రాహు-కేతు) భారత – పాకిస్తాన్ ల విభజన జరిగిందని పై కుండలి వల్ల తెలుస్తోంది. స్వాతంత్ర్య పోరాట నాయకుడైన గాంధీ గారి హత్య కూడా కాలసర్ప దోషం వల్లనే జరిగింది. స్త్రీ లగ్నమైన వృషభలగ్నంలో రెండు దేశాలు ఏర్పడడం వలన ఈ దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులుగా ఉండిన శ్రీమతి ఇందిరా గాంధి, శ్రీ రాజీవ్ గాంధి, జుల్ఫికర్ ఆలీ భుట్టో, జనరల్ జియా ఉల్ హక్, బెనజీర్ భుట్టోలు హత్య చేయబడ్డారు. స్త్రీ లగ్నంలో ఏర్పడే ప్రభుత్వాలకు ఇటువంటి ప్రమాదాలు జరుగుతూవుంటాయి.

  1. పూర్వపు మద్రాసు ప్రెసిడెన్సీ నుండి ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు – గ్రహస్థితులు
         

               

చంద్ర, గురు
 

 

 

రాహు

కర్నూలు రాజధానిగా

ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు

01/10/1953

కేతు

 

 

శుక్ర, కుజ

                        బుధ, శని  

రవి

మిథునరాశి లగ్నం రాజ్య కేంద్రాధిపతి గురుడు రాజ్యాధిపతి ఐన ద్విస్వభావ రాశిలో ఉండటం వలన రాజధాని కర్నూలు నుండి హైదరాబాదుకు మార్చాలని అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు గారు “ఒకే భాష – ఒకే రాష్ట్రం” అన్న సిద్ధాంతం ఆధారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. అలా 01/10/1953 న ఏర్పడిన మన రాష్ట్రం పై ఆనాటి గ్రహస్థితుల ప్రభావం ఈనాటికీ ఉంది. 

 

  1. హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం – గ్రహస్థితులు
 

 

                       కేతు  
కుజ

 

 

 

 

01/11/1956

ఆంధ్రప్రదేస్ రాష్ట్ర ఏర్పాటు

 

 

 

 

   

శని                   రవి

రాహు              బుధ

చంద్ర, గురు, శుక్ర

ఆంధ్రప్రదేశ్ అవతరణ 01/11/1956 నాడు జరిగింది. నవంబర్, 2013 నాటికి 58 సంవత్సరాలు నిండి 59వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఇప్పటివరకు మన రాష్ట్రంలో ఎన్నో ఉద్యమాలతోను, తుపానుల వలన, వాయు గుండాల వలన, సునామీ వంటి ఎన్నో ఉపద్రవాల్ని ఎదుర్కొంది. ఇప్పటి రాష్ట్ర విభజన ప్రకటన ఎన్నో గందరగోళ పరిస్థితుల్ని నిర్మించింది.

30/07/2013న సి.డబ్ల్యు.సి వారు రాష్ట్రాన్ని రెండు భాగాలుగా అంటే సీమాంధ్ర-తెలంగాణాలుగా విభజించబోతున్నట్టు ప్రకటించారు. దాంతో సీమాంధ్ర ప్రాంతంలో ఉద్యమం ఉప్పెనలా విరుచుకుపడింది. ఈ పరిస్థితుల్లో “రాష్ట్రం సమైక్యంగా ఉంటుందా లేదా విడిపోతుందా?” అన్న ప్రశ్న సామాన్య ప్రజలందరినీ వేధిస్తోంది. గ్రహస్థితుల్ని విశ్లేషించడం ద్వారా ఏదైనా సమాధానాన్ని రాబట్టవచ్చునా అన్నదే నా ప్రయత్నం. ముందుగా గ్రహస్థితుల్ని పరిశీలిద్దాం!

గ్రహస్థితులు

  1. లగ్నంలో శుభగ్రహాలైన గురు-శుక్రుల సంయోగం.
  2. చాలా శుభకరమైన యోగాలు జాతకంలో ఉంటే ఎంతటి సమస్యలు, ప్రమాదాలు, ఘర్షణలు వచ్చి పడినా సునాయాసంగా పరిష్కారాలు లభిస్తాయి.
  3. లాభాధిపతియైన చంద్రుడు లగ్నంలో గురు-శుక్రులతో కలిసి ఉదయించడం ఎన్నో లాభాలను పొందగల, రాష్ట్రాన్ని ప్రశాంతంగా ఉంచగల స్థితిని సూచిస్తోంది.
  4. శత్రు స్థానమైన కుంభంలో ఆరింట కుజుడు శత్రువినాశనాన్ని సూచించడం – పాపగ్రహాలైన శని-రాహువులు తృతీయంలో మూడవ ఇంట ఉండడం – తృతీయ షష్టాధిపతుల పరివర్తన వలన సోదరులైన వారే విరోధులుగా మారిపోయి వెన్నుపోట్ల పరంపర రాష్ట్ర రాజకీయాల్లో ఏర్పడుతుంది.
  5. లగ్న దశమాధిపతి బుధుడు ధనస్థానమైన తులాలో ఉండటం వల్ల పెట్టుబడులు మన రాష్ట్రానికి వస్తూనే వున్నాయి.
  6. శుభగ్రహాలైన బుధుడు-శుక్రుడు పరివర్తన అన్నివిధాల యోగదాయకం.
  7. ఇందులో శుక్రుడు ద్వితీయ, భాగ్యాధిపతి కాబట్టి బుధునితో పరివర్తనం అనేది గొప్ప రాజయోగం వంటిది. అందువల్లనే కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పడినా ఆంధ్రప్రదేశ్ ప్రాముఖ్యతను కలిగేవుంటోంది.

శుభగ్రహాల వల్ల ఎంతో శుభకరంగా ఉన్నప్పటికీ ప్రభుత్వ పతనాలు, పరస్పర వెన్నుపోట్లు, పదవీభంగాలు, రాజ్యభ్రష్టత్వం వంటి నష్ట జాతక లక్షణాలు కూడా కనిపిస్తూనేవున్నాయి. ఇవి “ప్రతికూల గ్రహస్థితుల” వల్ల సంభవిస్తాయి. అవేమిటో చూద్దాం!

  1. లగ్నంలో నీచ శుక్రుడు, నీచస్థితి (కన్యారాశి) రాష్ట్ర పరిపాలనలో నీచబుద్ధులు కలవారి ప్రమేయాన్ని సూచిస్తోంది.
  2. శుక్రుడు నీచ స్థానంలో భాగ్యాధిపతిగానే కాక ధనాధిపతి కూడా కావడం వల్ల డబ్బుకు లోటు లేకుండా ప్రభుత్వాలు, పరిపాలనా నడుస్తున్నాయి.
  3. కుజుడు తృతీయస్థానాధిపతి కాగా ఆ సోదరస్థానంలో పరమపాప గ్రహాలైన శని-రాహువుల కలయికతో సోదరులుగా మెలగాల్సిన నాయకులే పరస్పరం వెన్నుపోట్లు పొడుచుకొని ప్రజాప్రభుత్వాల్ని హత్య చేయడం జరుగుతోంది.

ఇక్కడ చెప్పుకోవల్సిన గొప్ప విషయం ఏమిటంటే పై చెప్పిన ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆంధ్రులందరూ గత యాభై తొమ్మిదేళ్ళుగా కలిసి ఒకే రాష్ట్రంగా ఉంటూ చినిగిన విస్తరి కాకుండా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడమే.

1968లో రాహువు-శని అంతర్దశలో తెలంగాణా ఉద్యమం భయంకరమైన స్థాయిలో జరిగింది. విభజన అంటూ జరిగివుంటే అది ఆనాడే జరిగివుండాల్సింది. ఆనాడు, గురుడు, కుజ, రవి, బుధ, కేతువులు లగ్నంలోను, సప్తమంలో శనిగ్రహం ఉండగా మర్రి చెన్నారెడ్డి ఆధ్వర్యంలో పెద్దపెట్టున ఉద్యమం జరిగింది. ఐనా విభజన జరగలేదు. అదేవిధంగా, తెలంగాణా ఉద్యమం ఉధ్ధృతంగా జరుగుతున్న సమయంలోనే అంటే 1972లో జైఆంధ్రా ఉద్యమం తలయెత్తి అది కూడా జోరుగానే కొనసాగింది.

ప్రస్తుతం 30/07/2013 న సి.డబ్ల్యు.సి ప్రకటనతో సీమాంధ్రలో అలనాటి “జై ఆంధ్రా” ఉద్యమస్థాయిలోనే సమైక్య ఉద్యమం జరిగింది. దీనికి గ్రహస్థితుల్ని పరిశీలించి చూస్తే ఆంధ్రప్రదేశ్ ఎన్నటికీ విడిపోదనే సంకేతాలు కనబడుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏల్నాటి శని ప్రభావం వలన 29/12/2009 తెలంగాణా ప్రక్రియ ప్రకటన చేసినా నేటి వరకూ సమైక్య రాష్ట్రంగానే ఉంది. ఆనాటి గ్రహస్థితుల మేరకు అష్టమి తిథి, పుబ్బ నక్షత్రం ఉండగా విభజన ప్రకటనను చేయడం వల్ల విభజన వ్యతిరేక పరిస్థితులు ఏర్పడ్డాయి.

2010వ సంవత్సరంలో శని-గురువులు సమ సప్తక స్థితిలో వలన రాష్ట్రంలో విభజన ఉద్యమం జరిగింది. అదే విధంగా 30/07/2013న సి.డబ్ల్యు.సి. విభజన ప్రకటనతో తెలంగాణాలో పండుగ వాతావరణం, ఆంధ్రాలో బాధాకర స్థితులు నెలకొన్నాయి. దాదాపు తొంభై రోజుల పాటు సమైక్య సెగ ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి అటు కేంద్రానికి కలవరం కలిగించింది. కేంద్రం ఐతే తెలంగాణా ఏర్పాటు ఒక అడుగు ముందుకు మరో అడుగు వెనక్కు అన్నట్టుగా వ్యవహరిస్తోంది.

హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి గ్రహస్థితులు రాష్ట్రాన్ని విడిపోకుండా కాపాడుతున్నాయనడంలో సందేహం లేదు. విభజన ప్రకటన వెలువడిన 30/07/2013 నాటి గ్రహస్థితిని పరిశీలిస్తే గురుడు, కుజుడు, బుధుడు రాజ్య కేంద్రస్థానంలో ఉండగా కుటుంబ స్థానంలో శని-రాహువులు, అష్టమంలో కేతువు-చంద్రుడు ఉండడం వల్ల మరియు 06/06/2014 నాడు గురుడు మిథున రాశి నుండి కర్కాటకంలోకి ప్రవేశించడంతోనే రాష్ట్రం ఒక్కటిగా కుదురుకొనే సూచనలు కనబడ్డం మొదలవుతుంది. ఆపై రాష్ట్రానికి ప్రస్తుతం ఉన్న ఏల్నాటి శని ప్రభావం 11/11/2014 నాడు పూర్తిగా తొలగడంతో పరిస్థితులు చక్కబడతాయి. రాష్ట్రం అభివృద్ధి పథంలోకి పయనిస్తుంది.

విభజన తర్వాతి ముఖ్యమైన అంశం “హైదరబాద్.” ఎందుకు అందరి కన్నూ హైదరబాద్ పైనే వుంది? ఎందుకు విభజన సమస్య మొత్తం ఈ ప్రాంతం చుట్టూ తిరుగుతోంది?

హైదరబాద్ పై గ్రహస్థితుల విశ్లేషణ

కన్యారాశి లగ్నానికి రాజ్య కేంద్రస్థానంలో గురుడు-కుజుడు ఉండటం వల్ల రాజధానిపై సమస్య ఎక్కువగా పెరిగింది. 06/06/2014 తర్వాత శాంతి నెలకొంటుంది. రెండు ప్రాంతాల్లోనూ వేడి తగ్గుముఖం పట్టే సూచనలు కనబడతాయి. 30/07/2013 నాటి విభజన ప్రకటనలో ’నైధన’ తారా ప్రభావం, ’అష్టమి’ తిథి నక్షత్రం, ’భరణి’ క్షేత్రం భూమి మీద తీవ్ర పరిస్థితుల్ని ఏర్పరచాయి. ’నైధన’ తార మృత్యు సంబంధించినది కావున కొంత ప్రమాద ఘంటికలు మ్రోగే స్థితిని తెలుపుతోంది. కనుక జాగ్రత్తగా ఉండాలి. పరిపాలన స్థంభించడం, అస్తవ్యస్థంగా ఉండడం, గందరగోళం, అసలేం జరుగుతోంది అన్న పరిస్థితులు అన్నట్లుగా ఉంటుంది.

అష్టమి – నైధన తార – పుబ్బ నక్షత్రం వల్ల ఏర్పడిన విభజన వ్యతిరేకత మరియు ఏల్నాటి శని – కాలసర్పదోషం ఉన్న సమయంలో విభజన ప్రకటన వెలువడడం – ఇటువంటి జ్యోతిష్య సంబంధమైన పరిస్థితుల వల్ల విభజన జరగక రాష్ట్రం సమైక్యంగా ఉంటూ ’ఆంధ్రప్రదేశ్’గానే పిలువబడుతుందన్నది స్పష్టంగా కనబడుతోంది.

సర్వే జనాః సుఖినో భవంతు.

Your views are valuable to us!