భారతీయ సనాతన ధర్మం విశ్వరూపం – భాగం 1

Spread the love
Like-o-Meter
[Total: 5 Average: 4.4]

 

భారతీయ సనాతన ధర్మం యొక్క విశ్వరూపం ను ’కొండ అద్దమందు కొంచెమై’ ఉన్నట్టు చూపిస్తాను!

*****

భారతీయ సనాతన ధర్మం యొక్క విశ్వరూపం చూడాలంటే ముందు కొన్ని విషయాలని తెలుసుకోవాలి.

ఈనాడు జుదాయిజం నుంచి పుట్టిన రెండు శాఖల కన్న ఒకింత వెనకబడి తడబడుతున్న హిందూమతం ఇవి ఉనికిలోకి రాకముందు ప్రపంచమంతటా వ్యాపించి తను అడుగు పెట్టిన ప్రతిచోట అక్కడ నెలకొని ఉన్న అజ్ఞాన తమస్సును తన విజ్ఞాన ఉషస్సు యొక్క మృదుస్పర్శతో పోగొట్టి ఆయా మానవ సమూహాలు గొప్ప సంస్కృతులను నిర్మించుకోగలిగేటట్లు చేసింది.

ఒక హిందువుగా నేను ఈ మాట చెబితే హిందువులు స్వమతాభిమానం చూపించి నమ్మెయ్యడమూ, హైందవేతరులు అనుమానించడమూ సహజమే!

కానీ, హిందూ మతస్థులు కానివాళ్ళు తమ మతాన్ని గురించి ఆ మాట చెప్పుకోవటానికి బదులు తమకి సంబంధం లేని హిందూమతానికి ఆ ఖ్యాతిని కట్టబెడుతుంటే మన వెనకటి తరాల వాళ్ళు సాధించిన విజయాల్ని పొగుడుకోవటానికి మనం ఎందుకు సంశయించాలి?

వాళ్ళెవరో India, that is Bharat – so Great! అని ఒప్పుకుని దీని గురించి తెలుసుకోవటం అల్లాటప్పా కాదని Indology అనే ఒక వైజ్ఞానిక శాఖనే తెఱిచి పరిశోధనలు చేసి ఎన్నో వాస్తవాలని వెలికి తీస్తుంటే హిందువులు కనీసపు ఆసక్తిని కూడా చూపించకపోతే ఎట్లా!

వాళ్ళందరూ సత్యం పట్ల నిబద్ధతతో తమ తమ మత విశ్వాసాలను పాటిస్తూనే భారత దేశపు ఔన్నత్యాన్నీ సనాతన ధర్మం యొక్క విశిష్టతనీ గుర్తించిన సత్యాన్వేషులు – హిందూమతానికి బాకా కొట్టి భజనలు చెయ్యలేదు, గొప్పల్నీ తప్పుల్నీ ఉన్నవి ఉన్నట్టు చెప్పారు!

“Christianity doesn’t exist, Jesus Christ never existed. Jesus Christ was an invention by the orthodox bishops at the Council of Nicaea. That’s what he was. He was the idea , but they were, they wanted to create the ideal the deity to make people to slaves and that deity was turn the other cheek love thy neighbor and this is why we’re in a mess. Today, you know not thy enemies and all this crap. This is a great way to subjugate people. You know Don’t make them sell their sheep bringing in the sheaves and these innocent sheep here are more intelligent than Christians.

The Vedas on the other hand like all in a European and all most in even like all indigenous spiritual traditions all over the world, tell you fight back to defend yourself. And, Christianity itself is Jewish. It’s radical Jewish offset, a sect, like a kind of branch. Davidians or ISIS that broke away from Judaism and the Jews also were cruel while killing others, they were killing anyone that they deemed to be, you know, sinners.”

ఇది అన్ని మతాలనీ తులనాత్మకమైన అధ్యయనం చేసిన ప్రపంచ స్థాయి మేధావులు సూత్రీకరించిన వాస్తవం.

ఇవ్వాళ మాదే అత్యున్నతమైన మతం, మా ప్రవక్తయే జగద్రక్షకుడు, మా దేవుడే సర్వేశ్వరుడు అని చెప్పుకొంటున్న క్రైస్తవీయ, మహమ్మదీయ మతాలు రెండూ జుదాయిజం యొక్క వికృత శిశువులే అనేది ఆయా మతాల వారు కూడా ఒప్పుకు తీరాల్సిన యదార్ధం.- అని యెప్పుడో తేటతెల్లమై పోయింది.

వికృత శిశువులు అని యెందుకు అంటున్నానంటే, అంతస్సారాన్ని బట్టీ ఆచరణా విధానాలని బట్టీ జుదాయిజం సనాతన ధర్మానికి చాలా దగ్గిరగా ఉండే ఆదర్శవంతమైన జీవనవిధానం కాగా ఈ క్రైస్తవీయ మహమ్మదీయ మతాలకి రూపకల్పన చేసినవారు ఈ జుదాయిజం నుంచి కొన్ని మంచి విషయాలని తీసుకుని ఇతరుల్ని తమకి బానిసల వలె పడివుండేటట్లు చేసుకోవడానికి పనికి వచ్చే స్వంత పాండిత్యపు కొత్త సూత్రీకరణల్ని కలిపి తమ మతాల్ని సృష్టించుకున్నారు.

SUBSCRIBE TO ANVESHI CHANNEL – ACCESS FACTUAL HISTORY

సనాతన ధార్మిక సాహిత్యంలో కనిపించే బ్రహ్మ-సరస్వతి, జుదాయిజంలో కనిపించే అబ్రహం-సారా అనే రెండు జంటల మధ్యన చాలా దగ్గరి పోలికలు ఉంటాయి. ఈ రెండు జంటలలోని స్రీ పురుషులకి ఒకేసారి సోదర సోదరి సంబంధమూ దాంపత్య సంబంధమూ ఉంటుంది. ముఖ్యమైన తేడా ఏమిటంటే – బ్రహ్మ,సరస్వతి పేరుతో సనాతన ధార్మిక సాహిత్యంలో కనిపించే జంట మన వంటి పార్ధివ దేహధారులు కాక జ్ఞానరూపాలు మాత్రమే. జుదాయిజం యొక్క మూల ప్రవక్త అయిన అబ్రహాం మరియు అతని భార్య స్థానంలో ఉన్న సారాలు మాత్రం మనవంటి పార్ధివ దేహధారులే!

Psalm 78:2

I WILL OPEN MY MOUTH IN A PARABLE; I WILL UTTER DARK SAYINGS OF OLD

హిందూమతం యొక్క సాహిత్యం అంతా ఎవరికీ అర్ధం కాని సంస్కృత భాషలో ఉంటుంది. మా బైబిలు చూడండి ఎంత సరళమైన భాషలో ఉంటుందో!” అని చెప్పుకుంటున్న క్రైస్తవ మతప్రచారకుల కపటాన్ని బయటపెట్టే వాక్యం ఇది.

ఏసు తన అనుచరులకే అర్ధం కాని బోధనలు చేశాడు. కొన్నిసార్లు ఆయన చెప్పిన నిగూఢమైన మార్మికమైన పిట్టకధలూ, నీతివాక్యాలూ కలగలిసిపోయిన గందరగోళపు వచనానికి ఠారెత్తిపోయి అడిగితే “మీరు నా స్వజనులు! నేను చెప్పు సమస్తమూ మీకు మాత్రమే తెలియవలెను! ఓ నా ఇశ్రాయేలీయులారా, పొరపాటున మన మందలో చేరిన అన్యజనులకు తెలియకుండుటకు నేనట్లు మాట్లాడువాడను!నా తండ్రి నన్ను ఇశ్రాయేలీయుల కొరకే పంపియున్నాడు” అని తెగేసి చెప్పాడు.

తమ తమ మాతృభాషల్లోకి అనువదించి, శుద్ధ వచనంలో చెప్పినప్పటికీ ఒక పట్టాన అర్ధం కాకపోవడం బైబిలు మరియు ఖురాను యొక్క ప్రత్యేకత. కానీ హిందువుల వేదాలు సంస్కృతం తెలిసిన ప్రతి ఒక్కరికీ అర్ధమవుతుంది – భావం కూడా సూటిగా ఉంటుంది.

“India is, the cradle of human race, the birth place of human speech, the mother of history, the grandmother of legend, and the great grandmother of tradition. Our most valuable and most instructive materials in the history of man are treasured up in India only” – Mark Twain.

ఎవరీ మార్కు ట్వెయిను గారు! హిందూ మతతత్వవాదియా?  కాదు గాక కాదు. వినగానే పొట్టచెక్కలయ్యేలా ఒక్క జోకు వెయ్యటం ఎంత కష్టమో జబర్దస్తు టీవీ క్యామెడీల్ని చూస్తే తెలియడం లేదా!అట్లాంటిది, అరిస్తే హాస్యం స్మరిస్తే హాస్యం అన్నట్టు బతికి ఇప్పటికీ నవ్విస్తూనే ఉన్న మహా మేధావి ఈ మార్క్ ట్వైన్.

మేధావిత్వం చాలామందిలో ఉంటుంది కానీ డబ్బుకి సంబంధించిన వ్యవహారాల్లో ఈయన నిజాయితీ యెంత గొప్పదో తెలుసా!

తన రచనల వల్ల వచ్చిన డబ్బుని పెట్టగూడని చోట్ల పెట్టుబడి పెట్టి తనతో పాటు ఇతర్లనీ నష్టపెట్టాడు.అయితే మళ్ళీ ఆర్ధికంగా కూడదీసుకోగానే తనవల్ల నష్టపోయినవాళ్ళని పేరుపేరునా గుర్తుంచుకుని చెల్లింపులు చేశాడు – నోటరీలూ గట్రా వుండి చచ్చినట్టు చెల్లించాలేమో అనే పరిస్థితి లేదు, అయినా చెల్లింపులు చేసేశాడు. అంత మంచితనం ఉండబట్టే అంత మంచి హాస్యం సృష్టించగలిగాడేమో! మన హిందూమతాన్ని పొగిడి ఉండకపొయినా మెచ్చుకోవచ్చు కదూ!

కొలంబస్ ఇండియాకి సముద్రమార్గం కనుక్కుందామని బయల్దేరి తను విడిది చేసినది అమెరికా అని తెలియక అక్కడివాళ్ళని రెడ్ ఇండియన్లు అని యెందుకు పేరు పెట్టాడు? అప్పటికే ఇండియన్ కల్చర్ అని తను తెలుసుకున్నది అక్కడ కనపడటం వల్లనే!

ప్రపంచంలోని అన్ని దేశాలలోనూ తమ ప్రాచీనతను తెలుసుకోవటం కోసం జరుగుతున్న త్రవ్వకాలలో అక్కడ ఒకనాడు హిందూమతం అత్యంత ప్రజాదరణ కలిగి ఉండేదని తెలియజెప్పే ఆనవాళ్ళు బయటపడుతున్నాయి. కానీ, అక్కడ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు వాటిని బయటికి రానివ్వటం లేదు.

“These Jews are derived from the Indian philosophers; They are named by the Indians Calanmi..”- Flavius Josephus (Book 1:22)

ఇంత స్పష్టమైన విషయాన్ని దాచిపెడుతున్నది యెందుకోసం? తమ మతం కొత్త మతం ఏమీ కాదనీ హిందూమతం నుంచి చీలిన జుదాయిజం నుంచి చీలిన పిల్లమతం అని తెలిస్తే ఏ హిందువు తమ మతంలోకి వస్తాడు?

ఈ భూమి మీద కొంతకాలం పాటు అత్యున్నత వైభవాన్ని అనుభవించి, కాలం తెచ్చే మార్పులకు తమను తాము మార్చుకోలేక అంతరించిపోయిన నాగరికతలతో ప్రస్తుతం అత్యున్నత వైభవాన్ని అనుభవిస్తూ కాలం తెచ్చే మార్పులకు తమను తాము మార్చుకోలేక అంతరించిపోతున్న నాగరికతలను కలిపిన సమస్త నాగరికతలకీ మూలం వైదిక సాహిత్యమూ అది నిర్మించబడిన సంస్కృతమూ అనేది సాక్ష్యాధారాలతో సహా ఎప్పుడో రుజువైపోయిన గతితార్కిక చారిత్రక భౌతిక యదార్ధం!

వేదం అంటే ఏమిటి?

వేదం అనే పదానికి మూల ధాతు రూపం “విద్” – దీనికి సమానార్ధకమైన ఆంగ్ల పదం “to know.” అంటే మానవుడు తెలుసుకోవలసిన,తెలుసుకోదగిన,తెలుసుకోగలిగిన జ్ఞానం.

వైదిక సాహిత్యంలో కనిపిస్తున్న అనేక సంస్కృత పదాలకి ఇతర భాషల్లోకి అనువదించటానికి సరైన పదాలు లేవు. “ధర్మం” అనే పదానికి అర్ధం కోసం ప్రముఖమైన ఇంగ్లీషు డిక్షనరీలలో దేన్ని చూసినా ఈ విషయం తెలుస్తుంది.

చాలా కాలం క్రితం “మీ అమ్మాయి పెళ్ళికి తెలుగులో మంత్రాలు చదివిస్తావా?” అని నన్ను అడిగి యేదో ఘనకార్యం చేస్తున్నట్టు విర్రవీగిన ఒక వ్యక్తి తెలియనిది యేమిటంటే “మంత్రం” అనే పదానికే సరైన పర్యాయపదం తెలుగులో లేదు.

నాకు చాలెంజి చెయ్యడంలో చూపించిన తెలివిలో వెయ్యో వంతును ఆ మాట గురించి తెలుసుకోవాలనే దిశలో చూపించి ఉంటే ఆ నిజం తెలిసేది. తెలుగులో కనీస పరిజ్ఞానం కూడా లేని ఒక వ్యక్తి, తెలుగు భాషాభిమాని వేషం కట్టి – “నాకు పెళ్ళిమంత్రాలు తెలుగులో కావాలి! లేకపోతే నేనూరుకోను. కప్పెక్కి కూస్తా. రోడ్డెక్కి అరుస్తా. ఉరేసుకు చస్తా!” అని గోల చేసాడు.

అసలు వేదంలో ఉన్న వాటిని మాత్రమే “మంత్రం” అని పిలుస్తారు, అదే ఛందస్సు వాడి చెప్పిన ఇతర గ్రంధాలలోని వాటిని శ్లోకాలు అంటారు. అలాంటిది మంత్రాలు తెలుగులో కావాలంట కొద్దిమంది వెర్రి నాగన్నలకు! తెలుగులోకి గానీ మరో భాషలోకి గానీ అనువదించటం కాదు, సంస్కృతంలోనే ఒక్క అక్షరాన్ని కూడా మార్చకూడనివి వేదమంత్రాలు.

బైబిలు వలె ఇశ్రాయేలీయుల సౌభాగ్యం కొరకు మాత్రమే చెప్పబడినది కాదు వేదం.

ఖురాను వలె అరేబియన్ల వైభవం కొరకు మాత్రమే చెప్పబడినది కాదు వేదం .

సమస్త మానవాళికీ శాంతిభద్రతల్ని ఇవ్వడం కోసం చెప్పబడిన జ్ఞానబోధల సంకలనం వేదం.

ప్రపంచ స్థాయి మేధావులూ పరిశీలకులూ ఒప్పుకున్న దాని ప్రకారమే మానవజాతి సృష్టించిన సాహిత్యంలో వేదమే అతి పురాతనమైనది, అత్యంత శాస్త్రీయమైనది.

వేదం – అపౌరుషేయత్వం

వేదం అపౌరుషేయం – అంటే మానవులు ప్రయత్నపూర్వకమైన అధ్యయనం, పరిశీలనం, చింతనం, ప్రయోగం, పరీక్ష, నిర్ధారణం వంటి ప్రక్రియల ద్వారా వీటిని తెలుసుకోలేదు. ఋషులు తాము ఉద్ధరించబడి ఇతరులను ఉద్దరించగలిగే సత్యమైన జ్ఞానం కోసం సుదీర్ఘకాలం తపస్సు చేసిన అనంతరం వేరెవరో తమకి చెబ్తున్నట్టు ద్యోతకమైన విషయాలని యదాతధం బహిర్గతం చేసినవే వేదమంత్రాలు.

అపౌరుషేయం అని చెప్పడం – అవి తమకి దేవుడు చెప్పాడనటం కొంతవరకు వారి వినయస్వభావాన్ని తెలియజేస్తున్నాయి. మానవప్రయత్నం ఉంటుంది. వారు తపస్సు మొదలుపెట్టినదే ఒక లక్ష్యంతో కదా. అదీగాక అంత గంభీరమైన సత్యాన్ని కనుక్కోవడానికి ముందే వారు శ్రేష్ఠులైన గురువుల వద్ద అందుకు పనికొచ్చే అన్ని విద్యలూ అభ్యసించిన పండితశ్రేష్ఠులు. వారు గొర్రెల కాపర్లో, నిశానీలో కాదు.

వేదం మూడు కాలాలను గురించి మూడు ప్రపంచాలను గురించి ఇతర మతాల వారు తెలుసుకున్న దానికి వెయ్యిరెట్లు తెలుసుకోగలిగిన వైదికఋషులు దర్శించిన జ్ఞానం కాబట్టి అన్యులు వాటిని సవరించడానికి గానీ తిరస్కరించడానికి గానీ సంక్షేపించడానికి గానీ ప్రక్షేపించడానికి గానీ అధిక్షేపించడానికి గానీ అర్హులు కారు.

వేదాలు – కాలమానం – శాస్త్రవేత్తల లెక్కలు

వేదం ఎలా పుట్టింది అని ఇతమిత్ధం చెప్పలేనట్లే ఎప్పుడు పుట్టింది అనేది కూడా తేల్చి చెప్పడం కష్టం. కష్టమే కాదు నిలదీసి అడిగితే అసంభవం అని కూడా చెప్పవచ్చు!

హేతువాదులైన శ్డాస్త్రజ్ఞులు కొందరు ఋగ్వేదంలో కొన్ని చోట్ల వర్ణించబడిన గ్రహతారకల స్థితిగతులను పరిశీలించి సుమారు 7000 BCE నుంచి 6000 BCE మధ్యన ఆయా సూక్తాలు చెప్పబడినట్లు నిర్ధారించారు.కానీ ఇలా నిర్ధారించెయ్యడంలో ఒక చిక్కు ఉంది. ఆ గ్రహతారకల అమరిక కొన్ని వేల సంవత్సరాల కొకసారి పునరావృతమవుతూ ఉంటుంది కాబట్టి ఆయా సూక్తాలు ఆ పునరావృతమయ్యే సంవత్సరాలలో ఎప్పుడైనా చెప్పబడి ఉండవచ్చు కదా!

University of Edinburgh లో అధ్యాపకుడిగా పనిచేస్తున్న, సంస్కృత భాషలో అపారమైన పాండిత్యం గల Prof. Keith వేదాల వయస్సును నిర్ధారించడానికి ఎంతో పరిశ్రమ చేసి “The determination of the age of the Samhitas will mostly remain a mere guess work!” అని తేల్చి చెప్పారు.

మిగిలినవాళ్ళు చేసిన నిర్ధారణలనీ తన పరిశ్రమనీ కలిపి చూసుకుని విసుగెత్తి ఆయన ఆ మాట అన్నాడో లేక ఈయన ఇంత మాట అనేశాక కూడా వేదసాహిత్యాన్ని ఏదో ఒక కాలానికి కుదించుదామనే చిరాశతో చేశారో తెలియదు గానీ మిగిలినవాళ్ళు చేసిన నిర్ధారణలు ఇలా ఉన్నాయి:

  • Max Müller వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 1200 BCE నుంచి 1500 BCE మధ్యన అని నిర్ధారించాడు.
  • Keith & McDonald వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 1200 BCE నుంచి 2000 BCE మధ్యన అని నిర్ధారించారు.
  • Whitney మరియు ఇతర్లు వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 2000 BCE వెనక అని నిర్ధారించారు.
  • Winternitz వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 2000 BCE నుంచి 2500 BCE మధ్యన అని నిర్ధారించాడు.
  • Jacobi వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 3000 BCE నుంచి 4000 BCE మధ్యన అని నిర్ధారించాడు.
  • Satyavrata Samashrami వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 5000 BCE వెనక అని నిర్ధారించాడు.
  • Balagangadhara Tilak వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 6000 BCE నుంచి 10000 BCE మధ్యన అని నిర్ధారించాడు.
  • Sampoornananda వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 18000 BCE నుంచి 30000BCE మధ్యన అని నిర్ధారించాడు.
  • Pt.Krishna Sastri Godbol వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 18000 BCE వెనక అని నిర్ధారించాడు.
  • Avinash Chandra Das Mukhopadhyaya వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 25000 BCE నుంచి 50000 BCE మధ్యన అని నిర్ధారించాడు.
  • Lele Shastri వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 40000 BCE నుంచి 54000 BCE మధ్యన అని నిర్ధారించాడు.
  • Rajpur Patangar Sastri వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 21000 BCE అని నిర్ధారించాడు.
  • Pavaki వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 2,40,000 BCE వెనక అని నిర్ధారించాడు.
  • Pt.Dinanath Sastri వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 3,00,000 BCE వెనక అని నిర్ధారించాడు.
  • Dr.Jvala Prasad వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 5,00,000 BCE వెనక అని నిర్ధారించాడు.
  • Nobel Laureate Materlink వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 70,00,000 BCE వెనక అని నిర్ధారించాడు.
  • Mahrshi Dayananda వేదం సృజించబడిన/రచించబడిన కాలం సుమారు 200,00,00,000 BCE వెనక అని నిర్ధారించాడు.

 

భారతదేశం బయట ఉండి వేదం గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నవారికీ, భారతదేశంలో ఉండి వేదం గురించి తెలియని వారికీ తొలిసారి వేదాలను పరిచయం చేసిన మ్యాక్స్ ముల్లరు స్వయంగా వేదం యొక్క వయస్సు నిర్ధారించడం అసాధ్యం అని చెప్పి ఉన్నాడు కాబట్టి వేదం యొక్క ప్రాచీనతను నిర్ధారించడం అసంభవం.

మధ్యలో పుట్టిన నడమంత్రపు గ్రంధాలు మధ్యలోనే నశించి పోతాయి గానీ ఆదియే కాదు అంతం కూడా లేకుండా నిలిచేది వేదమే!

సనాతన ధార్మిక సాహిత్యం ప్రకారం బ్రహ్మ కూడా వేదాలు గోచరించకముందు సరస్వతి పట్ల మోహానికి గురై ఆ శరీరాన్ని విసర్జించి నూతన దేహాన్ని ధరించినప్పటికీ సృష్టి చెయ్యలేని తన నిస్సహాయతను చూసుకుని ఎంతో వేదన అనుభవించి సుదీర్ఘకాలం పాటు తపస్సు చేశాకనే వేదవిజ్ఞానం లభ్యమైంది – అది తనకు గోచరించిన తర్వాతనే సృష్టి చెయ్యగలిగాడు.

దాన్ని బట్టి వేదం అనేదానికి హిందువుల పౌరాణిక సాహిత్యంలోనూ బౌద్ధిక వికాసంలోనూ జీవన విధానంలోనూ ఎంత ప్రాధాన్యత ఉన్నదో తెలుస్తుంది. హిందువుగా జీవించడానికి బాప్తిజం, దావత్ లాంటి కార్యక్రమాలు ఏమీ లేవు. వేదం చెప్పినది గొప్పదని ఒప్పుకుని పాటించితే చాలును.

వేదాన్ని గౌరవించనివాడు హిందువు కాలేడు.

వేదనింద చేసిన వాడు హిందువులకి శత్రువే అవుతాడు!

ఇంకా ఉంది…




Your views are valuable to us!