అపార్ట్‍మెంట్స్ వాచ్‍మెన్ సంఘం

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

మాది చాగల్లు, ప. గొ. జిల్లా. మేము నిరుడు ఈ అపార్ట్మెంట్ లో వాచ్మెన్ గా, బట్టలు ఇస్త్రీ చేత్తానికి ఇంకా చిల్లర పనులు చేయడానికి నా కుటుంబం తో (భార్య, ఇద్దరు పిల్లలతో) వచ్చాను. నేను పనిచేసే అపార్ట్మెంట్ మంచి లోకాలిటీ ఉంది. అన్నీ కూతేటు దూరం లోనే ఉన్నాయి. కాని మా రూం మాత్రమె మాకు సౌకర్యం గా లేదు. ఒకే చిన్న రూం అక్కడే వంట, పడక, అదే రూం లో టాయిలెట్ బాత్రూం ఉంటాయి. మొన్న సంక్రాంతి పండక్కి మేము మా ఊరు ఎల్లాలి. మాకు అది పెద్ద పండగ. కాని ఇక్కడ అన్ని ఫ్లాట్స్ లో ఉన్న వాళ్ళూ వాళ్ళ సొంతూర్లకు ఎళ్ళిపోయారు మమ్మల్ని మాత్రం బద్రత కోసం ఇక్కడే ఉండాలి అని అన్నారు. అందుకే ఇక్కడే పండగ చెసుకున్నాం. ఎందుకొచ్చామా అని చాల సార్లు అనుకుంటాం. కాని ఊరు కి ఎళ్ళిపోతే అక్కడ పని ఎక్కువ జీతం తక్కువ. మా బుడ్డోడిని, పిల్లని మంచి స్కూల్ లో పట్నం లో చదివించాలని కోరిక అందుకే సౌకర్యం లేక పోయినా అదే చిన్న రూం లో ఉండి ఇలా బతికేత్తన్నాం.

మాది గరివిడి ఇజయనగరమ్. నేను నా పెళ్ళం ఇక్కడ ఉంటాం. ఊళ్ళో పనులు ఉన్నాయ్ అంటే కాపోతే నాకు నడుం నొప్పి ఊర్లో పనులు సేయలేను. ఇక్కడ వాచ్మెన్ గా వచ్చాక ఇస్త్రీ సేత్తం నేర్చుకున్న. నాకు ఇంకా పిల్లలు లేరు బాగానే నడిసి పోతంది. ఇంటికి అమ్మ నాన్నకి రెండు ఏలు పంపుతా పతీ నెలా ఇక్కడ సార్లు మంచొల్లు. బాగా సూసుకుంటారు. బాగా డబ్బున్నోల్లు కూడా బిరియాని చికిన్ ముక్కలు కూరలూ ఇత్తారు. మేము తినగా మిగతా పనోల్లకి కూడా పెడతాము. మా ఇంటిది మూడు ఇళ్ళలో పనిసేత్తాది దానికి 6 వేలు నాకు 7 వేలు వత్తాయి . మొత్తం 20 ఫ్లాట్లు ఉన్నాయి అని ఒకింత సంతోషం తో చెప్పాడు శీను.

మాది ఆదిలాబాద్ పొట్టచేత పట్టుకొని వచ్చమ్. ఈ వాచ్మన్ ఉద్యోగం మాకు తినేందుకు అన్నం పెత్తిన్ది. దీనిని ఇక నను వదలను. మంచిగా చెస్తా. అందరితో మంచోడు అనిపించుకుంటా. నాకు నా పెళ్ళానికి మా బిడ్డకు ఈ పని దేవుడిచ్చిన ఆదరువు. ఇక్కడ పూల మొక్కలు మా పిల్లలు, ఇక్కడ చెట్లంటే మాకు ఇష్టం. తులసి మొక్క పూజ చేస్తాం. కరివేపాకు వారాన్కి ఒక సారి కోసి అందరకూ ఇస్థామ్ ఫ్లాట్ల లో .

***

ఇలా ఒక్కొక్కళ్ళూ వాళ్ళ పని పరిస్తితులు ఎప్పుడు పనిలోనికి వచ్చింది చెప్పుకున్నారు. ఒక్కొక్కరివీ ఒక్కొక్క విచిత్రమైన గాధలు. చాల వరకూ ఇదొక నూతన జీవన విధానం గానే తోచేలా ఉన్నవే. గ్రామీణ ప్రాంతాలలో కమతాలు చేసుకొని అంటే (చాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి, ఇలా పలు వృత్తుల్లో ఉన్న వాళ్లకు భూ స్వాములు సాలుకి ఇంత అని కొంత రొక్కం మిగిలింది ధాన్యం, కూరగాయలు పండగలకు పిండివంటలు, కొత్త బట్టలు పెట్టడం పరిపాటి. ఇప్పుడు ఆ వృత్తులు చేసుకొని జీవనం సాగించే వాళ్ళు చాల తక్కువ సంఖ్య లో ఉన్నారు. ఉన్న వాళ్ళు బడ్డీ కొట్టు పెట్టుకొని దర్జీ లు ఎలా బతుకుతున్నారో అలా వీరు అదే జీవన విధానాన్ని అనుసరించారు. గత కొన్నేళ్లుగా కేరళ లో కొబ్బరి చెట్లు ఎక్కి కొబ్బరి కాయలు కోసే వాళ్ళు కరువయ్యరు. అందుకు ఒక జిల్లా కలెక్టర్ రంగం లో దిగి ఒక వ్రుత్తి విద్యా కోర్సు గా ఈ పనిని ప్రచారం చేసి మరల ఈ పనిలోకి వ్యక్తులు వచ్చేలా ప్రయత్నం చెసాడు.

మొత్తం మీద చాకలి వృత్తిలో ఉన్న చాల మంది హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, విశాఖ నగరాలలో అలాగే జిల్లా కేంద్రం గా ఉన్న నగరాలలో వాచ్మన్ గా కుటుంబ సమేతం గా వచ్చి ఇస్త్రీ కూడా చేసి నాలుగు డబ్బులు సంపాదించుకోవడం సహజమైపొయిన్ది. అదే విధం గా పొలం పనులకు పోయేవాళ్ళు బిల్డర్ల వద్దకు చేరి బిల్డింగ్ పనుల్లో చేరిపోయారు. అలాగే కార్పెంటర్లు కూడా. మొత్తం మీద పల్లెల్లో వీరి సేవలుపల్లెల్లో ప్రియమై పట్టణాల్లో విరివిగా దొరుకుచున్నాయి. ఈ అభివృద్ది అభిలషనీయమా అనేది కాలమే చెబుతున్ది.

***

ఇక విధంగా మనకంటూ ఒక సంగం ఉండాలి అనే ఆలోచన చాల మంచిది. మనలో చాల మందికి సెలవుల్లేని పనిలా ఉంది ఈ వాచ్మన్ ఉద్యొగమ్. ఉన్నచోటే ఇల్లు, పని, ఒకవిదం గా చూత్తే చెప్పడానికి బాగుంటది సేయడానికి కట్టం గా ఉంటాది. కళ్ళ ముందే కరీదైన కార్లలో మంచి మంచి ద్రస్సులెసుకొని చిన్న పిల్లలు తిరుగుతుంటే మా పిల్లలు వాళ్ళ వంక మా బతుకు ఇంతే అని అనుకొంటూ ఉన్తారు. మొన్నీ మద్దెన మా కుర్రోన్ని కార్ తుడవరా సారూ నెలకు 500 ఇత్తారు అంటే ఆడు తుడవలేదు !! నేనే ఆ పని కూడా సెత్తాను.

ఆ ఎమ్మెల్యే గారు సెప్పినట్లు కుకట్పల్లి లో ఉన్న అపర్ట్మెంట్స్ లో పని సెత్తున్న వచ్మన్లు అందరూ ఈ సంగం లో చేరాలి సబ్యత్వం కింద 10 రూపాయలు ఇవాలి. ఆ బాబు గారు సెప్పినట్లు ఇక్కడ వేలలలో అపార్ట్మెంట్లు ఉన్నాయి. సుమారుగా 3000 కు పైగా అపార్ట్మెంట్లు కూకట్పల్లి లో ఉన్నాయట అంటే 3000 వేల మంది వాచ్మన్లు ఉన్నారు అంటే 3000 పైగా కుటుంబాలు బతుకుతున్నాయి. అలా సూత్తే ఈ మహానగరం లో ఎన్నో వేల కుటుంబాలు ఉన్నాయి మనలాగ. వాలందర్నీ కలిసి ఈ సంగాన్ని పెద్దగా సేత్తాడట ఈ ఎమెల్యే బాబు. ఇక ఈ బాబు మాట్టాడతాడు ఇనండి .

“సోదర సోదరీమణులారా !

ఈ నగరం లో ప్రతి వ్యక్తీ సగౌరవంగా తలెత్తుకొని తిరిగాలి అందరికీ ఆరోగ్యం, సామాజిక భద్రత, చక్కటి పని పరిస్తితులు ఉండేలా మా పార్టీ కొన్ని కార్యక్రమాలు చేపట్టింది. వీటిలో భాగంగా అపార్ట్మెంట్ల లో పనిచేస్తున్న వారి గురించి ఒక మంచి అవగాహనతో కొన్ని ప్రణాళికలను సిద్ధం చేసింది అందులో ముఖ్యమైనది ఈ ప్రాధమిక నిబన్ధనలు. మీకు తెలుసు ఈనగరం లో హెయిర్ కటింగ్ సలూన్ మంగళవారం పనిచెయదు. వారికి రేట్లు కూడా చార్ట్ పై వ్రాసి ఉన్తాయి. వాటికంటా ఎక్కువగా కస్టమర్స్ నుంచి వసూలు చెయరాదు. అదే విధంగా మీకు కూడా కొన్ని నిబంధనలు ఉండాలి అని అలోచించి వీటిని తయారు చెసాము. నను ఒక్కొక్కటీ చదువుతాను మీరు మీ సమ్మతి చేతులు ఎత్తి చెప్పండి. ఆపై మీరు మీ సమ్మతి సంతకం ద్వారా తెలియచెయాలి.

1. 10 ఫ్లాట్లు ఉన అపార్ట్మెంట్ కి ఒక్క వాచ్‍మన్. ఆతని భార్య కేవలం మూడు ఇళ్లలోనే పని చేయాలి. పనికి 500/- చొప్పున, (అంటే అంట్లు తోమితే ఒక పని, ఇల్లు ఊడ్చి మోప్పింగ్ చేస్తే ఒక పని, బట్టలు ఉతికితే ఒక పని మొత్తం మూడుపనులకు 1500 నెలకు, కనీసం ఒక మంచి టీ/ కప్పు పాలు ఇవ్వాలి. ఇంతకంటే ఎక్కువ ఇస్తే అభ్యంతరం లేదు వాళ్ళ ఇష్టం . ఈ పదెహెను వందల్లో 150/- తప్పక ఆమె ఒక బ్యాంకు ఖాతా ఓపెన్ చేసి దాచుకోవాలి రికరింగ్ డిపాజిట్ లా. ఈ 10 ఫ్లాట్ల అపార్ట్మెంట్ వాచ్మన్ జీతం కనీసం 7000/- వాచ్మన్ విధులు కూడా వివరం గా వ్రాసాము అవి చదవండి అవి వాటితో పాటు ఇస్త్రీ చేయడం ఇతని విధి. ఇస్త్రీ రేట్లు కూడా ఉన్నాయి వివరం గా చూడండి .

2. వాచ్‍మన్ జీతం లో 500/- పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లో జమ చేయాలి ఓనర్స్ నేరుగా మిగిలింది 6500/- మాత్రమె ఇవ్వాలి .

3. సాలుసరి బోనస్ కింద నెల జీతం ఇవాలి వాచ్మన్ కు (ఆయన భార్యకు ఆ ఓనర్స్ ).

4. రేషన్ కార్డు, ఆధర్ కార్డు, గ్యాస్ కనెక్షన్, హెల్త్ కార్డు, వోటర్ కార్డు తప్పక ఉండాలి. లేక పొతే సంగం సాయం చెస్తున్ది.

5. ఇంటర్కం ఉండాలి

6. లిఫ్ట్, కరంటు, ప్రాధమిక భద్రత మొ. లగు వాటి పై అవగాహన కై శిక్షణ పొందాలి ఉద్యోగంలో చేరిన 6 నెలల లోగా

7. శిక్షణ వాచ్మన్ సంగం ఇస్తుంది అలాగే యోగ ట్రైనింగ్ కూడా

8. 10 ఫ్లాట్లు దాటినా అపార్ట్మెంట్ కు ప్రో రేట పద్ధతిలో జీతం మొ.నవి పెరుగుతాయి

9. అపార్ట్మెంట్ లో ఉన్న ఫ్లాట్స్ సంఖ్య ఆధారం గా భద్రత, వెసులుబాటు, సాధ్యాసాధ్యాల ఆధారంగా వాచ్మన్ సంఖ్య ఉంటుంది అలాగే వాచ్మన్ రూం కూడా

10. వాచ్‍మన్ రూం 10/15 ఉండాలి బాత్రూం విత్ టాయిలెట్ తో . వంటగట్టు వంట సామాగ్రికి అరలు, ఫ్యాన్, అలాగే బాత్రూం లో ఎగ్జాస్టు ఫ్యాన్ ఉండాలి.

11. సంగం లో సభ్యుడి గా ఉండాలి అందువల్ల సెలవు పెట్టడానికి అనువు అలాగే సెలవు కాలం లో మరొక వ్యక్తి ని నియమించడానికి వీలు (దగ్గర అపార్ట్మెంట్ లో ఉన్న వచ్మన్ల బాధ్యత ఇది).

12. పోలీసు, ఫైర్ నెంబర్లు తన సెల్ లో ఉండాలి

13. వాచ్మన్ సెల్ బిల్ మైన్టేనేన్స్ లో చేర్చాలి అది ఒక నిర్దిష్ట మొత్తం మించితే అది వాచ్‍మన్ కట్టుకోవాలి (ప్రస్తుతానికి 300 నెలకు)

14. ఈ పై నిబంధనలకు లోబడి వాచ్మన్ ఉండాలి. స్వచ్చన్దగా ఇచ్చే సేవలు ఈ నిబంధనలలో కి రావు.

15. సంగం ద్వారా వాచ్మన్ మార్పు చేర్పు జరగాలి

16. సంగానికి ప్రజాస్వామ్య పధ్ధతి లో ఎన్నికలు ప్రతి 2 ఏళ్లకు ఉంటాయి

17. మద్యపానం చేస్తే ఉద్యోగం లోనుంచి సంగం తీసెస్తున్ది.

18. ప్రతి అపార్ట్మెంట్ సంగానికి 50/- వెల్ఫేర్ ఫండ్ ప్రతినెలా ఇస్తుంది. ఈ ఫండ్ సభ్యుల అత్యవసరాలకు అనగా చావు బ్రతుకు సమస్యలకు సంగం వినియొగిస్తున్ది. ప్రతినెలా లెక్కలు పారదర్శకంగా చోపుతున్ది. సంగానికి ఒక ఈమెయిలు ఉన్తున్ది. దాని ద్వారా సమాచారం నడుపుతుంది. సిబ్బంది జీతాలు కూడా ఈ ఫండ్ నుంచే ఇవ్వబడతాయి.

ఇవి నిబంధనలు….”

ఈ మాట చెప్పగానే వాచ్‍మన్లు అందరూ చాల సంతోషంగా చప్పట్లు కొట్టారు. ఈ నూతన పని విధానం లో ఒక సంఘటిత శక్తి చేరినందుకు అందరూ హర్షం వ్యక్తం చెసారు. ఎమెల్యే బాబుకు దండాలు పెట్టారు.

అప్పుడు ఆ ఎమెల్యే బాబు కలుగచెసుకొని. నాకు దండాలు పెట్టొద్దు నేను మీ సేవకుడను. మీరు కలిసి మెలిసి సంఘాన్ని పటిష్టం చేసుకోండి. ఇకపై ఇలాగి సంఘాలు అన్నీ కలిసి మొత్తం ఈ నగరానికే ఒక పెద్ద సంగం ఉంటుంది . మీ సేవలు ఎంత అవసరమో మీ సంక్షేమం కూడా అంటే అవసరమ్.

ఈ మాటలు చెప్పి సభ ముగించాడు .

***

సభికుల్లో ఆనందం ఒక్కసారే కట్టలు తెంచుకొన్ది. నిబంధనలు అన్నే అమలు అయిపోయినట్లే భావన చేసారో లేక వాటిని ఊహించుకొని సంతసించారో మొత్తం మీద ఏదో సాధిండి మన్న తృప్తితో రకరకాలుగా భవిష్యత్తు ను ఊహించు కొంటూ ఉల్లాసంగా మెయిన్ గేటు వైపు నడిచారు. అప్పటికే కొందరు సంతకాలు చేయడం మొదలైంది.

అక్కడికి వచ్చిన వాళ్ళ లో వృద్ధుడు ఒకాయన. చాల బాగుంది బాబు ఈ సంగమ్. ఇది ఇంకా బాగా పనిచేసి మీరు చెప్పినవన్నీ నెరవేర్చాలి అప్పుడు వాచ్‍మన్లు కూడా మీరన్నట్లు తలత్తుకొని తిరగ గలడు .

 

శుభం

Your views are valuable to us!