అతి సర్వత్ర వర్జయేత్

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

An Appeal to Sai Devotees

అతి సర్వత్ర వర్జయేత్ అని ఎవరు అన్నారు. ఎప్పుడు అన్నారు. ఎందుకు అన్నారు. అది ఎప్పటికైనా వర్తిస్తుందా! అసలు అతి అంటే ఏమి? దానికి కొలత ఏమైనా ఉందా? ఎలాంటి  కొలమానంలో అయినా 0 నుండి 100 వరకు వుంటుంది. అందులో 50 అనేది బ్యాలన్సుడ్ అని చెప్పుతారు. దాన్నే నార్మల్ అని కూడా చెప్పుకుంటే 51 నుండి 60 అతి, 61 నుండి 70 వరకు ఉత్తమ అతి 71 నుండి 80 వరకు మధ్యమ అతి 81 నుండి 90 వరకు అధమ అతి 91 పైన ఉంటే ఏమి చెప్పాలో అర్థం చేసుకోండి. అలాగే 50 కంటే తక్కువ వున్నా కూడా సమస్యే. దాన్ని 50 లాక్కురావాలి. అంటే నార్మల్ వరకు లాక్కుని  రావాలి.


సత్య సాయి బాబా చెప్పే వారు….. మనం వేసుకునే చొక్కా ,చెప్పు కరక్టు సైజులో వుండాలి. అంటే నార్మల్ సైజులో వుండాలి. ఎక్కువైనా, తక్కువైనా సమస్యే అని. అలాగే బాబా గారు చెప్పేవారు…….. సముద్రంలో నీళ్ళు ఉప్పగా వుండి త్రాగటానికి ఎలాగైతే పనికిరాదో, ధనం కూడా నిల్వ వుంటే పదిమందికి ఉపయోగపడదు. ధనం పదిమందికి ఉపయోగపడాలంటే, నదిలో నీళ్ళ లాగా ప్రవహిస్తూ వుండాలి అని అనే వారు.


అయితే సముద్రంలో నీళ్ళు కూడా వైద్యానికి పనిచేస్తుంది. ఎలా.. సముద్ర స్నానం వలన అనేక జబ్బులు నయం అవుతుంది అని అంటారు. అలాగే అతిగా అంటే అవసరానికి మించి ధనం వున్నవారు లేని వారికీ పంచి బ్యాలన్సు చేయడం కూడా వైద్యమే. డాక్టర్లు చెపుతూ వుంటారు BP, SUGAR , లాంటి అనేక మైనవి  నార్మల్ గా లేకపోతే B .P .వుందని, SUGAR వుందని అంటారు అంటే నార్మల్  కి మించి వుంటే జబ్బుక్రిందకు వస్తుంది. ఇలాగ అన్ని విషయాల్లో, అన్ని కాలాల్లో, అన్ని యుగాల్లో నార్మల్ కు మించితే అంటే అతి అయినా, మధ్యమ  అతి అయినా, అధమ అతి అయినా జబ్బే.ప్రేమ, జాలి, దయ, అనురాగం లాంటి గుణాలు  వుండాలి. కాని అతిగా వుండకూడదు. దాని వలన కూడా సమస్యే.

మానవాభివృద్ధిలో 60 వసంతాల గణతంత్ర భారత్ సాధించిన ప్రగతి అనన్య సామాన్యం…… అంటూ చాలా వ్రాసారు. 26 -1 -2010 న ఈనాడు  దినపత్రికలో. అది వారి తప్పుకాదు. అది ఒక వార్త. ప్రచురించారు. ఇంకా వివరాల్లోకి వెళ్ళితే ……. లక్ష మంది ప్రజలకు ఆనాడు 16 మంది వైద్యులు వుండేవారు. ఈనాడు ఆ సంఖ్యా  60 మందికి చేరింది అని వ్రాసారు.

1950 లో 1 ,00 ,000 మందికి 16 డాక్టర్లు వున్నప్పుడు. . . .  ఉదా. కు 1 ,00 ,000 /16 =6 ,250 మంది పేషంట్లు వున్నట్లు లెఖ్ఖ. అంటే 1 డాక్టరు  రోజుకు 8 గం. ప్రాక్టీసు చేస్తే అందులో గంటకు 4 చొప్పున పరీక్ష చేస్తే 32 మందికి పరీక్ష చేయవచ్చును. ఆ ప్రకారముగా నెలకు 32 x 30 = 960 మందికి అంటే సుమారు నెలకు 1 ,000 మందికి పరీక్ష చేయవచ్చును. ఈ 1 ,000  మంది ప్రతి నెలా పేషంట్ల రూపంలో రాగలరా? రాలేరు. పోనీ, ప్రతి 6 నెలలకు ఒకసారి రాగలరా? వచ్చారు అనుకుందాం. అంటే ఒక్కొక్క డాక్టరుకు 6 ,000 మంది పర్మనెంటు పేషంట్లు వున్నట్లు లెఖ్ఖ.2010  కి 60  మంది డాక్టర్లు ఉండేలా ప్రగతి సాధించింది అని అంటున్నారు.

అంటే మన దేశ జనాభాకు (1,30,00,00,000/1,00,000 x 60 = 7,80,000 డాక్టర్లు  వున్నట్లు లెఖ్ఖ) అంటే ఉదా.కు 1,00,000/60 = 1,600  మంది పేషంట్లు  ఒక్కొక్క డాక్టరుకు  వున్నట్లు లెఖ్ఖ. అంటే 1 డాక్టరు  (రోజుకు 8 గం. ప్రాక్టీసు చేస్తే ) 1,000 మంది పేషంట్లు కావాలి. ఈ లెక్కన పేషంట్లు కనీసం రెండు నెలలకు ఒకసారి వచ్చి తీరాలి?  ఎందుకంటె డాక్టర్లు అతి వున్నారా? మధ్యమ అతిగా వున్నారా ? ఏ లెవెల్ లో అతిగా వున్నారో ఆలోచించండి ! ఎందుకంటె, అవసరానికి మించిన డాక్టర్లు వుంటే ప్రగతినా? పతనానికి నాందియా? ఆలోచించండి మేధావుల్లారా!(ముఖ్యంగా యువతలోని మేధావులు).

ఈ ప్రకారంగా అన్నిరకాల (వైద్య) పాత కుల వృత్తులలోనూ, కొత్త రకం కుల వృత్తులలోనూ, అవసరానికి మించి వున్నారు. అందుకే లాభాల కోసం వ్యాపారస్తులు  తయారుచేసిన వస్తువుల విషయంలోనూ, బట్టల విషయం లోనూ, ఒకటి కొంటె ఒకటి ఉచితం అంటున్నారు. వారికి నష్టాలు రాకుండా ప్రభుత్వం ప్యాకేజీలు యిస్తుంది. డాక్టర్లకు నష్టాలు రాకుండా ఆరోగ్యశ్రీ పథకం అనే పేరుతో నడుపుతున్నారు. ఇది ఎంత కాలం? డాక్టర్లను శాశ్వతంగా ఆరోగ్య శ్రీ పథకంలో పోషించాలంటే ప్రజలకు జబ్బులు ప్రతి సంవత్సరం రావాలి.  అలాగే ఎన్నో పథకాల కోసం ప్రజలు యిబ్బందులకు గురి కాక తప్పదు.  ఈ అతిగా వున్నాడు వలెనే ఆర్థిక సంక్షోభం.

ముఖ్యమంత్రులకు కావలసిన అర్హతలు వున్నవారు (అతిగా) ఎక్కువగా వున్నారు కనుకే  చిన్న రాష్త్రాలు కావాలని కోరుకుంటున్నాము. అంతే కాదు ఎం.పి. లు అయ్యే  అర్హతలు వున్నవారు (అతిగా) ఎక్కువ గా వున్నారు కనుకే ఆంధ్రలో లోక్ సభ స్థానాల సంఖ్య పెంచాలని కోరుకుంటున్నాము. భవిష్యత్తులో ప్రధానమంత్రులకు కావలసిన అర్హతలు అతిగా వుంటే గ్యారంటీగా భారత దేశం రెండు ముక్కలుగా కూడా అవుతుంది.  ఇదంతా ఎందువలన? అతిగా అంటే అవసరానికి మించి వుంటే తప్పదు అనేక సమస్యలు.

ఇలా ఎందుకు జరుగుతున్నదంటే మనం భారతీయ సంస్కృతిని, విద్యా విధానాన్ని మరచి, మెకాలే విద్యా విధానాన్ని,విదేశీ సంస్కృతిని నమ్ముకున్నందుకే..ఆలోచించండి మేధావుల్లరా!
అలాగే మన ఆదాయం , ఖర్చులు, కూడా… నార్మల్ గా వుండాలి. ఒకప్పుడు, ఉమ్మడి కుటుంబాల్లో ఒక్కరి మీద ఆధారపడి ఉంటుంది ఆదాయం ,ఖర్చులు. కుటుంబంలో ఎంతమంది వున్నా అందులో ఎంతమంది సంపాదనాపరులో, ఎంతమంది సంపాదించ లేని వారో (వయసు రీత్యా, ఆరోగ్య రీత్యా), అందరికీ సమానం గా కుటుంబ పెద్ద ఒకరు బాలన్సు చేసే వారు. భవిష్యత్తులో కుటుంబం ఎంత పెద్దది అవుతుందో తెలీదు అన్నట్లుగా, క్రింది తరాల వారికోసం కూడా సంపాయించి దాచేవారు. అది ధర్మం. అప్పుడు అతిగా సంపాయిస్తున్నారు అనేదానికి తావు లేదు. కానీ, మెకాలే విద్యా విదానం లో పడి భారతీయ ఉమ్మడి సంప్రదాయాలను మరచిపోయారు. నేను ఏమి చెప్పుచున్నానో చాలామందికి అర్థం కాదు.

ఉమ్మడి కుటుంబాలను చిన్న కుటుంబాలుగా, ఆ చిన్న కుటుంబాలను విడాకుల పేరుతో వ్యక్తి కుటుంబాలుగా తయారు చేసారు కొందరు. దాన్ని ఎక్కువమంది ఆచరిస్తున్నందు  వలన యిప్పుడు అదే ధర్మం అని అనుకుంటే వ్యక్తి కుటుంబాలకు వెనకటితరం తో సంబంధం లేదు కదా! అలాంటప్పుడు ఒక వ్యక్తి తన వరకు ఎంత కావాలో అంత సంపాయించడం ధర్మం. అంతకంటే (అతిగా) ఎక్కువ సంపాయించడం అధర్మం. దాని వలనే సమస్యలు. 

కాబట్టి సంపాదన (అతిగా) ఎక్కువగా వున్నవారు అంటే ఉదా: ఒక వ్యక్తి 1000 నెలలు బ్రతుకుతాడంటే, నెలకు ఎంత ఖర్చు కావాలో అంత x 1000  నెలలు సంపాయిస్తే చాలు. అలాంటి వారంతా  యోగా వైపు మరలండి. వీలైనంత ఎక్కువ సమయం యోగాలో గడపండి. ఎవరూ దర్శించలేని వాటినంతా దర్శించండి. దర్శించిన దాన్ని పది మందికి చెప్పండి. దినచర్యలో మార్పు తీసుకు రండి.  కేవలం ఆకలైనప్పుడు ఆహారం మిగిలిన సమయం యోగ, ధ్యానం లో వుండండి. ఇలాంటివారె మహర్షులు, యోగులు, గంధర్వులు, వగైరా.. వగైరాలు.

అవసరానికి మించి వుంటే చేస్తున్న ఉద్యోగానికి విరమణ చెప్పండి. యోగ, ధ్యానం వైపు మారండి సాయి సైనికులారా! మీ స్థానంలో మరొకరికి ఉద్యోగం వస్తుంది. ఎందుకంటె వ్యక్తి కుటుంబ సమాజంలో మీ భార్య అనే జీవి  కూడా సంపాయిస్తుంది కదా . అలాగే మీ పిల్లలు అనే జీవులకు మీరే అవకాశం యివ్వాలి.

అలాగే 1000 నెలలు బ్రతకడానికి ఒక ఇల్లు (గూడు) చాలు. మీకు మరొక ఇల్లు (అతిగా) వుంటే అమ్మేయండి. ఎందుకంటె ప్రభుత్వం అన్ని వ్యక్తి కుటుంబ జీవులకు విడివిడిగా ఇళ్ళు కట్టిస్తున్నారు అలాంటప్పుడు మీ యింటికి అద్దెకు ఎవరూ రారు . అలాంటప్పుడు ఆదాయం లేని ఆస్థి కదా! మీ అబ్బాయికి అంటారా! వ్యక్తి కుటుంబ సమాజంలో మీ అబ్బాయికి   ప్రభుత్వం కట్టిస్తుంది. లేదా మీ యింట్లోనే వుంటాడు. ఎందుకంటె, మీలా యోగ ధ్యానంలో వుండే వారంతా ఒక చోట చేరుతారు కదా! అదే ఆశ్రమం. ప్రస్తుతం పార్ట్ టైం గా వున్నా భజన మండళ్ళు, సాయి దేవాలయాలు ఫుల్ టైం ఆశ్రమాలుగా మార్చుకోండి.

ఎంత అవసరమో అంత వుండటం వలన మీరు ధర్మాన్ని పాటించినట్లు అవుతుంది. అదే సమయంలో త్వరగా మీరు విరమణ చేసినందువలన మరొకరికి ఉద్యోగ అవకాశం. మీరు ఫుల్ టైం ఆశ్రమవాసిగా యోగ, ధ్యానం లో ఉన్నందు వలన స్వంత వాహనాలకు స్వస్తి పలుకుతారు అంటే కాలుష్యాన్ని నిరోధించినట్లే….యిలా ఎన్నో రకాలుగా కాలుష్యాన్ని, పర్యావరణాన్ని(ప్రకృతి)  బాలన్సు చేయవచ్చును. అంటే ధర్మ సంస్థాపనలో మీరు పాల్గొన్నట్లే, ధర్మ సంస్థాపన జరుగుతున్నట్లే. అంటే యిక్కడ అతిగా వున్న దాన్ని నార్మల్ గా  చేస్తున్నాము.


యిదంతా సాయి భక్తులే, సాయి సేవకులే  ఎందుకు చేయాలి?  అంటే ధర్మ సంస్థాపనలో మీరంతా భాగస్తులు కావాలి. మీరంతా రామాయణంలోని వానర సైన్యం, కృష్ణావతారం లోని గోపాలురు  కాబట్టి. ధర్మ సంస్థాపనలో పాల్గొన్నవారే సాయి సైనికులు. సాయి భక్తులు, సాయి సేవకులు. పాండవ పక్షంలో ఉన్నవారంతా శ్రీకృష్ణుని భక్తులు, సేవకులు, శ్రీకృష్ణుని సైన్యం అంటే గోపాలురు. మిగిలినవారంతా దుర్యోధనుని పక్షంలో వున్నారు. ఆ ప్రకారం గ సాయి సైనికులు వేరు. సాయి భక్తులు వేరు.

ఒకవేళ మీకు 1000 నెలలుకు కావలసిన ఆదాయం లేకున్నా సాయి సైనికులుగా మారి యోగ ధ్యానం ఆశ్రమజీవితంలో వుంటే (LOW BP, LOW SUGAR మాదిరి) అయిన సరే దాన్ని నార్మల్గా చేయడానికి సాయి వున్నాడు. ఎందుకంటె మీరు ధర్మ సంస్థాపనలో పాల్గొంటున్న సాయి సైనికులు కదా !

కుక్క – గాడిద కథను చాల మంది వినే వుంటారు. అది ధర్మం. కుక్క పని (వృత్తి) కుక్క చేయాలి. గాడిద పని (వృత్తి) గాడిద చేయాలి. అదే ధర్మం గాడిద ధర్మం  తప్పింది. యజమాని దగ్గర నడ్డి విరుచుకుంది. విన్నారు కదా! అలాగే మానవుని ధర్మం మాత్రమే మానవుడు చేయాలి. మానవుని ధర్మాలు ఏమిటి? ఎన్ని రకాలు? అవి ఎన్నో? అందులో వృత్తి ధర్మం చెప్పుకుందాం. డాక్టరు తన వృత్తి తప్ప మరొక వృత్తి వైపు కన్నెత్తి చూడకూడదు. ఉపాద్యాయుడు తన వృత్తి తప్ప మరొక వృత్తి వైపు కన్నెత్తి చూడకూడదు, కుక్క గాడిద కథలో మాదిరి. అక్కడ యజమాని గాడిద నడ్డి విరిచాడు. మానవుల్ని ఎవరు విరుస్తారు అని అందరూ అనుకుంటారు? అందుకే ధర్మాన్ని తప్పుతున్నారు. మన యజమాని భగవంతుడు.

మానవుడు అనే యజమాని పాత్ర వేసి గాడిద నడ్డి విరిచాడు. కానీ, భగవంతుడు అనే యజమాని దయామయుడు కరుణామయుడు. అయన దయను కరుణను అందుకున్నవారంతా తెలిసో తెలియకో తమ వృత్తితో పాటు మరొక వృత్తిని చేపట్టి వుంటే దాన్ని వదిలినట్లైతే వారంతా సాయి  సైనికులే. సాయి భక్తులు సాయి సేవకులు అందరూ ఒకే వృత్తిని అంటి పెట్టుకుని మిగిలిన వృత్తులను ప్రక్కన పెట్టి సాయి సైనికులుగా మారితే అదే ధర్మ సంస్థాపన.

మరిన్ని వివరాలకు: http://www.alochinchandimedhavullara.blogspot.com/

Your views are valuable to us!