భారతీయ సనాతన ధర్మం విశ్వరూపం – భాగం 2

Spread the love
Like-o-Meter
[Total: 4 Average: 4]

 

వేదం అంటే ఒకే ఒక పుస్తకం కాదు.

 

వైదిక సాహిత్యం – విభాగాలు

వైదిక సాహిత్యంలో 18 విద్యాస్థానములు ఉన్నాయి. విద్యాస్థానం అంటే ఇంగ్లీషులో Branch of Study అని చెప్పుకోవచ్చు. వీటిలో శ్రుతి అనే విభాగంలో ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వ వేదం అనేవి ఉన్నాయి. ఇది ఒక భాగం మాత్రమే.

అయితే మిగిలిన అన్ని శాఖల్లోని విషయాలు అన్నీ ఈ నాల్గింటిలోని సూత్రాల మీద ఆధారపడి ఉంటాయి. శ్రుతి అనే విభాగంలో ఈ నాలుగూ తప్ప ఇంకేవీ లేకపోవడం వల్ల వేదం, శృతి అనేవాటిని పర్యాయపదాలుగా కూడా వాడతారు.

వేదములు నాలుగు:

  1. ఋగ్వేదం
  2. శుక్ల,కృష్ణ యజుర్వేదాలు
  3. సామవేదం
  4. అధర్వ వేదం

 

ఇక మిగిలిన విభాగాల్లో చూస్తే వేదాంగములు ఆరు:

 

  1. శిక్ష (Phonetics)
  2. శిక్షా కల్ప (Study of Rituals)
  3. వ్యాకరణ (Grammar)
  4. నిరుక్త (Etymology)
  5. ఛందం(Prosody)
  6. జ్యోతిషం (Astronomy)

 

ఉపాంగములు నాలుగు –

  1. మీమాంస
  2. న్యాయశాస్త్రం
  3. పురాణములు
  4. ధర్మశాస్త్రము

 

ఉపవేదములు అనేకం కానీ ముఖ్యమైనవి –

  1. ఆయుర్వేదం (Medical Science)
  2. అర్ధశాస్త్రం (Economic Science)
  3. ధనుర్వేదం (Military Science)
  4. గాంధర్వవేదం (Musical Science)

 

వేదాలను శ్రుతి (Revealed) అని అంటే మిగిలినవాటిని స్మృతి (Memorizes) అని అంటారు.

శ్రుతి అనే విభాగంలో నాలుగు ఉపవిభాగాలు ఉంటాయి –

  1. ఋగ్వేదం (Collection of Prayers)
  2. యజుర్వేదం (Sacrificial Manual)
  3. సామవేదం (Rigvedic hymns in musical form)
  4. అధర్వవేదం (Magical Charms)

SUBSCRIBE TO ANVESHI CHANNEL – ACCESS FACTUAL HISTORY

 

ప్రతి వేదం మళ్ళీ నాలుగు ఉపవిభాగాలుగా ఏర్పరచబడి ఉంది:

మంత్రసంహిత: 

ప్రధానమైన భాగం. ఋగ్వేదంలోని మంత్రాలను మాత్రం ఋక్కులు అంటారు. మిగిలినవాటిని మంత్రాలు అంటారు – వీటిని అందరూ అధ్యయనం చెయ్యవచ్చు.

బ్రాహ్మణములు:

ఆయా సంహితలలోని విషయానికి వ్యాఖ్యానములతోనూ కర్మకాండలకు సంబంధించిన వివరాలతోనూ కూడుకున్న వచనభాగం – వీటిని సంహితను అధ్యయనం చేసిన తర్వాత మరింత తెలుసుకోవాలనే ఆసక్తి గలవారికి మాత్రమే బోధిస్తారు.

అరణ్యకములు:

ప్రతి వేదమంత్రానికీ సామాన్య అర్ధం,సాంకేతిక విశేషం,ఆధ్యాత్మిక సంబంధం అనే పాఠాంతరాలు ఉంటాయి గనుక వాటిమధ్యన సమన్వయం ఎలా చెప్పుకోవాలో సూచించే వచనం – నాగరికులకూ లౌకికులకూ ఇవి అనవసరం గనక ఆచార్యత్వాన్ని కోరుకుని అరణ్యవాసానికి ఇష్టపడినవారికి మాత్రమే బోధిస్తారు.

ఉపనిషత్తులు:

ప్రధానమైన సంహిత మీద పూర్తి అధికారం కోరుకునే నమ్మకస్తులైన శిష్యులకు మాత్రమే వారి గురువులు బోధిస్తారు.”అనంతా వై వేదాః” అని చెప్పిన ప్రకారం వేదం మొదలూ తుదీ లేనిది. మానవులు తెలుసుకోవలసిన మొత్తం జ్ఞానం ఒక హిమాలయ పర్వతశ్రేణి అనుకుంటే, భగవంతుడి కృప వల్ల సనాతన ధార్మిక ఋషులు తెలుసుకోగలిగినది మొదట మనం చేరుకున్న పర్వతం నుంచి తీసిన మన పిడికిట పట్టగలిగిన ఇసుక కుప్ప అనుకుంటే – ఇతర దేశాల వారిని కళ్ళు చెదిరేటట్టు చేస్తున్న ఇంతటి విస్తారమైన జ్ఞానం కూడా మరీ అంత కొంచెమేనా!

*****

వేదం పరిస్థితే ఇలా ఉంటే తోరా, బైబిల్, ఖురాన్ సంగతేంటి?

“ఆదియందు వాక్యము పుట్టెను!” అని వాళ్ళు రాసుకున్నప్పటినుంచీ చెప్పుకొస్తున్నా ఇప్పటికీ “ఏమిటి ఆ వాక్యం?” అని నిలదీస్తే నీళ్ళు నమలడం తప్ప ఇదీ ఆ వాక్యం అని చెప్పలేకపోతున్నారు. 19వ శతాబ్దపు మధ్య భాగంలో ఫ్రాన్స్ దేశంలో ఈ విషయంపై చర్చించడాన్ని నిషేధించారు. దీనిని బట్టి ఆ వాక్యం ఎంత అర్ధపాండిత్యపుదో అర్థం చేసుకోవచ్చు. 

వైదిక సాహిత్యం మీద తులనాత్మకమైన అధ్యయనం చేసిన సర్వులూ ఒప్పుకుంటున్నది మొదట ఆవిర్భవించినది ఋగ్వేదమేనని. అంతటి ప్రాచీన కాలంలో కూడా అప్పటి ప్రజలు ఎంత వైభవోపేతమైన జీవితం గడిపారో తెలుసుకుంటే, అవి పరిశోధకులు చెప్పిన వాస్తవాలే అయినప్పటికీ నమ్మలేని విషయాల్ని నేను కల్పించి చెబుతున్నట్టు అనిపిస్తుంది.

అంతటి గొప్ప సంస్కృతికి దూరం అయినందుకు మనమీద మనకే అసహ్యం కూడా పుట్టవచ్చు!

అయితే, ఋగ్వేదం పదవ మండలంలోని పురుషసూక్తంలోనే “తస్మాద్యజ్ఞాత్ సర్వహుతః| ఋచః సామాని జజ్ఞిరే|| ఛందాంసి జజ్ఞిరే | యజుస్తస్మాదజాయత” అని యజుర్వేదం, సామవేదం యొక్క ప్రస్తావన ఉండటం చూస్తే ఋగ్వేదం మొదట పుట్టి మిగతావి తర్వాత పుట్టాయనడం అర్ధం లేనిదనిపిస్తుంది.

ఈ విషయంలో మరింత పరిశోధన జరగాలి. తిరుగులేని ఆధారాలు లేకుండా మనకు హేతుబద్ధం అనిపించిన ప్రతిదాన్నీ యదార్ధం కింద గుర్తించెయ్యడం శాస్త్రీయమైన పద్ధతి కాదు. అసలు ఇప్పుడు వైదిక సంస్కృతి ఎంతమేర విస్తరించిందీ అని చూస్తే మధ్యభారతంలో ఎక్కువ ప్రభావశీలమై ఉంది,ఈశాన్య భారతంలో బలహీన స్థాయిలో ఉంది,దక్షిణ భారతంలో కూడా ఉన్నత స్థాయిలోనే ఉంది, పశ్చిమాన ఆఫ్ఘనిస్థాన్ వరకు చెప్పుకోదగిన స్థాయిలోనే ప్రభావశీలమై ఉంది.

అయితే, ఆఫ్ఘనిస్థానుకు ఇవతలనే ఉన్నప్పటికీ వైదిక సంస్కృతికి చెందిన హరప్పా,మొహంజెదారో వంటి నగరాల్ని కూడా కలిగి ఉన్న ప్రాంతం మననుంచి విడిపోవటం వల్ల దాన్ని వదిలేసి ఒక దేశం రూపంలో ఇప్పుడు మనకి కనపడుతున్న భూఖండమే సనాతన ధర్మానికి మూలస్థానం అని మనం గర్వించవచ్చు!

సింధు నాగరికతా నిర్మాతలుగా ఇప్పుడు తెలిసిన జనసమూహం వైదిక సంస్కృతికి చెందినవారేనా అనేది ఇప్పటికీ నిర్ధారణ కాలేదు.మౌలికమైన విషయాలు కలుస్తున్నాయి గానీ కొన్ని అంశాలలో విభిన్నతలు కనిపిస్తున్నాయి.హరప్ప వంటివి సర్వసంపద్విలసితమైన నగరాలు అయితే వైదిక సంస్కృతికి చెందిన ప్రజలు గ్రామ్యజీవనులు. ముందు ముందు జరిగే కొత్త పరిశోధనల అనంతరం ఈ చిక్కుముడి విడిపోవచ్చు.

మొత్తం మీద వైదిక సమాజం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే నాలుగు వర్ణాలు కలిసి ఏర్పడినది. వైదిక సంస్కృతి యొక్క అతి ముఖ్యమైన లక్షణం యజ్ఞభావనతో జీవించడం. యజ్ఞం అంటే అగ్నిలో ఓషధుల్ని వ్రేల్చి వాయువుని శుభ్రం చేసి మానవులని ఆరోగ్యవంతుల్ని చేసినట్టు వ్యక్తులు తమ సంపదలో కొంత భాగాన్ని సమాజానికి సమర్పించి సమాజం నుంచి గౌరవాభిమానాల్ని పొందడం.

వైదిక సంస్కృతిలోని ప్రజలు తమ జీవితాల్ని ప్రభావితం చేసే ప్రకృతి శక్తులనే దైవభావనతో అర్చించారు. అప్పటి వారు పూజించిన ప్రధాన దైవాలు వాయు(air), మరుత్(storm), ఇంద్ర(rain), వరుణ(water), సూర్య(sun), అగ్ని(fire), పృధ్వి(earth), అరణ్య(forest) – దాదాపు దృశ్యమాన ప్రపంచంలో మానవుడికి భయాన్నీ ఆశ్చర్యాన్నీ ఆనందాన్నీ క్షేమాన్నీ కలిగించే ప్రతి చిన్న అస్తిత్వం పట్ల వారు గౌరవాన్ని ప్రకటించటం ఇందులోని విశేషం.

కొందరు అల్పబుద్ధులకి ఇది పిచ్చితనం అనిపించవచ్చు గానీ లోనారసి చూడగలిగిన Sylvain Levi వంటి ఫ్రెంచి ఓరియంటలిస్టులు మాత్రం “The multiplicity of the manifestations of the Indian genius as well as their fundamental unity gives India the right to figure on the first rank in the history of civilized nations.Her civilization, spontaneous and original, unrolls itself in a continuous time across at least thirty centuries, without interruption, wuthout deviation.” అని ప్రశంసలు కురిపిస్తున్నారు.

సశేషం…

Your views are valuable to us!