ఈ రోజు భారతీయ ఉద్యోగులు జాతిపిత జ్ఞాపకాల ఒడిలో సేదతీరే రోజు
ఉరకల-పరుగుల జీవితానికి ఒక రోజు సెలవిచ్చి గాంధీ కి కృతజ్ఞత తెలిపే రోజు
ఈరోజు రాజుకున్న రజో గుణాన్ని రోజూ లా కాకుండా సత్యం, సాత్వికతతో తొలగించే రోజు
ఒక్క రోజు లో ఇంత ప్రభావాన్ని చూపిన గాంధి మరల తల్లవారితే తలపుల తెరల మాటున,
తామస రజో గుణాల స్పర్ధ లో బయటకు నడచిన సాత్వికతో కలసి సాగిపోవును ఒక్క ఉదుటన.
ఔనులే యద్యదాచరతి శ్రేష్ఠః అని చెప్పడానికి ముందే ఆచరించి చూపిన రామ కృష్ణులు
చేయలేని పని, మోహన్ దాస్ కరంచంద్ గాంధి సాధిస్తాడని అనుకోవడం సబబు కాదు!
కాదులే ఏకాదశి, నైమిత్తిక తిధులు ఉన్నాయిగా వాటి తో మరల సాత్వికత మనలోనికి రాదూ?
వీలులేని మానవ జాతిలో విలువల ప్రతిపాదన మాత్రమే సాధ్యం, కాదు దైనందిన అమలు!
టివీ లో గాంధీ సినిమా
సాయంత్రం షాపింగ్ మాలు
హోటల్ లో డిన్నర్ చాలు
గడచును లే విధిగా నేడూ!