వందేళ్ళ జనగణమన – ఒక పరిశీలన

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

ఆంగ్లమూలం: డా. పి.వి. వర్తక్

మన జాతీయగీతం మొట్టమొదటిసారిగా 1911 డిసెంబర్ 27న కలకత్తాలో జరిగిన జాతీయ కాంగ్రేసు సమావేశాల్లో పాడడం జరిగింది. అప్పటి బ్రిటీషు చక్రవర్తి ఐదవ కింగ్ జార్జ్ భారత పర్యటనకు వస్తున్న సమయంలోనే రవీంద్రనాథ టాగోర్ “జనగణమన” గీతాన్ని రాయడం జరిగింది. ఆ చక్రవర్తి కోసమే రవీంద్రుడు ఈ గీతాన్ని రాసాడన్న సత్యాన్ని ఒప్పుకోవడానికి చాలామంది సిద్ధంగా లేరు. “టాగోర్ ఈ పనిని ఎలా చేయగలడు?” అనే చాలామంది వాదిస్తారు. పక్షపాతానికి లోబడి, స్థిరమైన పూర్వాభిప్రాయాలను ఏర్పరచుకుని అలా మాట్లాడుతున్నారు వాళ్ళు. నిశ్చలమైన, ప్రశాంతమైన మనసు ఉన్నవారు అంత త్వరగా ముందస్తు అభిప్రాయాలను ఏర్పరచుకోరు. “జనగణమన” గీతం కింగ్ జార్జు గురించి రాసిందనడానికి గల ఆధారాలను చూద్దాము –

ప్రస్తుతం మనము జాతీయగీతము యొక్క సంపూర్ణ సాహిత్యము పాడడంలేదు. పాఠకుల సౌలభ్యుము కొరకు ఈ వ్యాసము దిగువన ఆ గీతము యొక్క సంపూర్ణ సాహిత్యము ఇస్తున్నాము.

1. 1911 డిసెంబర్ నెలలో క్ంగ్ జార్జ్ పర్యటన సందర్భంలోనే ఈ గీతాన్ని లిఖించడం జరిగింది.

2. ఈ గీతములో “అధినాయ”కుడిని కీర్తించడం జరిగింది. 1911 లో బానిసత్వంలో మగ్గుతున్న భారతదేశపు జనులకు అధినాయకుడు ఎవరూ లేరు. అధినాయకుడు అంటే అత్యున్నతమైన నాయకుడు. ఆరోజుల్లో బ్రిటీషు చక్రవర్తినే అధినాయకుడని పిలిచేవారు.

3. “భారత భాగ్య విధాత” అంటే భారతదేశానికి దిశానిర్దేశం చేసేవాడని అర్థం. ఆ కాలానికి బ్రిటీషు దాస్యంలో మగ్గుతున్న భారతదేశం యొక్క నుదుటిరాతను శాసించగలవాడు ఒక్క బ్రిటీషు చక్రవర్తి మాత్రమే. కావున ఐదవ కింగ్ జార్జ్ మాత్రమే ఈ పొగడ్తకు అర్హుడు. మరింకే భారత నేతకూ అంతటి మన్నన లేదు.

4. “రవీంద్రుడు అప్పటి జాతీయ కాంగ్రేస్ అధ్యక్షుణ్ణి ఉద్దేశ్యించి ’అధినాయక’ అని ’భారత భాగ్య విధాత’ యని చెప్పివుండవచ్చు” అని కొద్దిమంది వాదన చేస్తున్నారు. కానీ రెండవ మరియు మూడవ చరణాలు ఈ వాదనకు వ్యతిరేకంగా ఉన్నాయి. రెండవ చరణంలో ఇలా ఉన్నది “పూరబ్ పశ్చిమ్ ఆసే – తవ సింహాసన్ పాసే”. ఈ గీతాన్ని రాసిన నాడు భారతదేశంలో సింహాసనాధీశుడైన నాయకుడు ఎవ్వరూ లేరు. అంతేకాదు ఏ భారత నాయకుడూ తూర్పు, పశ్చిమ దేశాలను పాలించలేదు. అనాటి కాలంలో తూర్పు, పశ్చిమ ప్రాంతాలను పాలిస్తున్నది బ్రిటీషు చక్రవర్తి మాత్రమే.

5. “తవ చరణే నత మాథా…రాజేశ్వర భారత భాగ్య విధాత” అని రాయడం ద్వారా టాగోర్ తన శిరసును బ్రిటీషు చక్రవర్తి పాదాలకు వంచాడు. హిందూ సంప్రదాయం ప్రకారం “రాజేశ్వర’ అంటే రాజులకు రాజైన వాడని అర్థం. ఆకాలంలో భారతదేశంలోని ఏ రాజూ స్వతంత్ర్యుడు కాడు. కేవలం జార్జ్ చక్రవర్తి మాత్రమే స్వతంత్ర్యుడైన రాజాధిరాజు. అప్పటి హిందూదేశపు రాజులందరూ అతని దయకు పాత్రులై, దాసానుదాసులై ఉన్నారు.

6. “గాహే తవ జయ గాథా”. ఆ కాలంలో ఏ హిందుస్తాన్ రాజు విజయశీలుడై ఉన్నాడు? ఎవరూ లేరు. ఈవిధంగా పదాలనన్నింటినీ క్రోడీకరించి చూస్తే టాగోర్ బ్రిటీషు చక్రవర్తినే పొగుడుతున్నాడని భావించవచ్చు.  అప్పటికాలంలో బ్రిటీషు చక్రవర్తి బ్రిటీషు ఆక్రమిత ప్రాంతాలన్నింటిలోనూ ఈవిధంగా కీర్తింపబడేవాడు. ఆ బృందగానానికి టాగోర్ తన గొంతును కలిపాడంతే!

పందొమ్మిదవ శతాబ్ద ఆరంభంలో భారతీయులు ఆంగ్లేయుల ప్రభావానికి ఎక్కువగా లోనైనారు. ఆంగ్ల ప్రభావానికి లోనైన రవీంద్రనాథ ఠాకూర్, ఆ బ్రిటీషు ఉచ్ఛారణకు అనుగుణంగా తన పేరును “ఠాకూర్” నుంచి “టాగోర్”గా మార్చుకొన్నాడు. అనాటి అనేకమంది భారతీయుల్లాగానే అతను కూడా బ్రిటీషువాళ్ళకు తలవంచాడు. ఇది శుద్ధ మానసిక దాస్యం కాదా!

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏర్పడ్డ కాంగ్రేస్ ప్రభుత్వం ఎలాంటి అనుమానమూ లేకుండా ఈ గీతాన్ని జాతీయగీతముగా ఎన్నుకొంది. సంపూర్ణ స్వాతంత్ర్యానికి పూర్వమే భారతదేశం విడగొట్టబడి, పాకిస్తాన్ ఏర్పడింది. ఆ విభజనలో భాగంగా పంజాబు, బెంగాలులోని కొన్ని ప్రాంతాలతో బాటు సింధ్ ప్రాంతము మొత్తము పాకిస్తానులో చేరిపోయాయి. ఆవిధంగా సంపూర్ణముగా పాకిస్తాను అధీనంలో ఉన్న “సింధ్” ప్రాంతం మన జాతీయగీతంలో నేటికీ చెప్పబడుతోంది. దీనిపై ఈనాటికీ ఏ పాకిస్తాన్ నాయకుడూ అభ్యంతరం చెప్పలేదు. చేదునిజం తెలిసీ చేసిన తప్పిదమే కదా ఇది?

మేధావులందరూ ఏకకంఠముతో ఒప్పుకొన్న “వందేమాతరం” గీతం భారత జాతీయగీతంగా ఎన్నుకోబడదని ఘన స్వాతంత్ర్యయోధుడైన వీర్ సావర్కర్ 1938లోనే చెప్పాడు. వాస్తవంలో అదే జరిగింది.

పరాయి పాలనపై తిరుగుబాటు అన్నది బెంగాలులో దాదాపు శూన్యమనే చెప్పాలి. పధ్దెనిమిదవ శతాబ్దంలో బ్రిటీషువారు మొట్టమొదటగా వశం చేసుకున్న ప్రాంతం బెంగాలే! ఆ ప్రాంతం నుండే బ్రిటీషువారి ఆధపత్యం మొదలైంది. బ్రిటీషు పద్ధతులకు ప్రభావితులైన బెంగాలీ వాసులు తమ పేర్లను సైతము బ్రిటీషు పధ్ధతిలోకి మార్చుకొన్నారు. ఆవిధంగా చటోపాధ్యయ చటర్జీగానూ, ముఖోపాధ్యాయ ముఖర్జీగానూ, బందోపాధ్యాయ బానర్జీగానూ మారిపోయారు. అయితే ఇక్కడ ఒక విషయము ప్రముఖంగా చెప్పాలి, మగవారు ఆంగ్లేయులను అనుకరించినా బెంగాలీ నారీమణులు సనాతన సాంప్రదాయాల్ని విడనాడలేదు. మగవారు మాత్రము బ్రిటీషువారికి సంపూర్ణంగా లొంగిపోయారు. కనుక టాగోరు కూడా బ్రిటీషు దాష్టీకానికి లొంగిపోవడంలో ఎలాంటి ఆశ్చర్యమూ లేదు.

నేను (డా. పి.వి. వర్తక్) శాంతినికేతన్ లో ఒక సమావేశంలో భాగం వహించడానికి వెళ్ళినపుడు అక్కడేవున్న టాగోర్ ఇంటిని చూడడానికి మిత్రులతో కలిసివెళ్ళాను. టాగోర్ తరచూ వాడే గదిని చూసేందుకు మనం చెప్పుల్ని బైటే వదిలి వెళ్ళాలి. లోనికి వెళితే, గది మధ్యలో ఒక బల్ల, దాని చుట్టూ నాలుగు కుర్చీలు వేసివున్నాయి. ఆ బల్ల పైన మద్యం సీసా, గ్లాసులు పెట్టివున్నాయి. మాకు గదిని చూపిస్తున్న వ్యక్తి “టాగోర్ గారు మద్యం పుచ్చుకొనేవారు” అని చెప్పాడు. ఈ మద్యశాలను చూచేందుకు మేము చెప్పుల్ని బైటే వదిలి ఎందుకు రావాలన్నది నాకు అర్థం కాలేదు.

ఆనాటి ప్రముఖ స్వాతంత్ర్య సమర సేనానులైన లోకమాన్య బాలగంగాధర తిలక్, వీర్ సావర్కర్, విష్ణుశాస్త్రి చిప్లూంకర్ మొదలైనవారు మద్యాన్ని ముట్టేవారు కారు. ఇళ్ళల్లో మద్యశాలలను ఉంచినవారు కారు. బ్రిటీషువారి ప్రభావం పెరిగాక, భారతీయులకు “మద్య సేవన’ ఒక గొప్పదనంగా తోచడం మొదలయింది. రాజసానికి, ఠీవికి అది నిదర్శనంగా భావించడం మొదలుపెట్టారు. రవీంద్రుడు కూడా ఈ దురలవాటుకు మనస్పూరిగా లోనుకావడం బాధాకరం. కావున, బ్రిటీషువారిని అనుకరించడ కోసం తన పేరునే ఆంగ్లీకరణ చేసుకొన్న కవి, బ్రిటీషు చక్రవర్తిని కీర్తిస్తూ గీతాన్ని రచించడం ఆశ్చర్యమేమీ కాదు.

సనాతన ధర్మ సూత్రాలకు కట్టుబడిన నేను, నిజాలను చెప్పడానికి మాత్రమే ఈ వ్యాసాన్ని రాసినాను. నిరంతర యోగాభ్యాసము చేత నిశ్చలమైన చిత్తము సాధించిన పిదప మాత్రమే నేను రచన చేసినాను.  నిజాలను నాచేత చెప్పించిన ఆ భగవంతుని చరణ కమలాల వద్ద నా శిరస్సును వాల్చి ప్రణమిల్లుతున్నాను.

Janaganamana Complete Text:

    जनगणमन अधिनायक जय हे, भारत भाग्य विधाता
    पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल बंग
    विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधितरंग
    तव शुभ नामे जागे, तव शुभ आशिष मागे
    गाहे तव जय गाथा
    जनगणमंगलदायक जय हे, भारत भाग्यविधाता
    जय हे, जय हे, जय हे, जय जय जय जय हे ।।१।।
    अहरह तव आव्हान प्रचारित सुनि, तव उदार वाणी
    हिंदु बौद्ध सिख जैन पारसिक मुसलमान खिस्तानी
    पूरब पश्चिम आसे, तव सिंहासन पासे
    प्रेमहार हय गाथा
    जनगणऐक्यविधायक जय हे, भारत भाग्यविधाता
    जय हे, जय हे, जय हे, जय जय जय जय हे ।।२।।
    पतनअभ्युदयबंधुर पंथा युगयुग धावित यात्री
    तुम चिर सारथी, तव रथचक्रे मुखरित पथ दिन रात्री
    दारुण विप्लव माजे, तव शंखध्वनि बाजे
    संकट दुःखयात्रा
    जनगण पथ परिचायक जय हे, भारत भाग्यविधाता
    जय हे, जय हे, जय हे, जय जय जय जय हे ।।३।।
    घोरतिमिरघननिबिड निशीथे पीडित मूर्छित देशे
    जागृत छिल तव अविचल मंगल नत नयने अनिमेषे
    दु:स्वप्ने आतंके, रक्षा करिले अंके
    स्नेहमयी तुमी माता
    जनगण दु:ख त्रायक जय हे, भारत भाग्यविधाता
    जय हे, जय हे, जय हे, जय जय जय जय हे ।।४।।
    रात्र प्रभातिल उदिल रविच्छवि पुर्व उदयगिरि भाले
    गाहे विहंगम पुण्य समीरण नवजीवन रस ढाले
    तव करुणारुण रागे, निद्रित भारत जागे
    तव चरणे नत माथा
    जय हे, जय हे, जय हे,
    जय जय जय जय हे, भारत भाग्यविधाता ।।५।।

Your views are valuable to us!