మంత్రి పుంగవుల ప్రయాణాలు

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

అందరికీ నమస్కారం.
 
ఈ మధ్యే జరిగిన ఒక విషయం మీద నా అభిప్రాయాన్ని మీ అందరితో పంచుకోవాలని ఈ టపా రాస్తున్నాను.
 
మన రాష్త్ర మంత్రి ఒకరు ఈ మధ్యే తన కుటుంబ సభ్యులతో కలిసి మానస సరోవర యాత్రకు వెళ్లారు. వారితో పాటు మరో పార్టీ కి చెందిన ఒక MLA కూడా వెళ్లారు. వారు యాత్ర కు వెళ్ళడానికి ఒక ప్రైవేటు టూర్ ఆపరేటర్ ద్వారా package  మాట్లాడుకొని వెళ్లారు. అయితే వారు వెళ్ళిన టైం బాగో లేదో మరి వేరే ఇతర కారణాల వాళ్ళ కాని ,అక్కడ వాతావరణం అనుకూలించక వారు ఒక రోజు వేరే ప్రదేశంలో ఆగిపోయారు. ఈ యాత్రకు సంబంధించి పూర్తి భాద్యత ఇక్కడ అయితే టూర్ ఆపరేటర్ది లేదా మంత్రి గారు వారి తో వెళ్ళిన వాళ్ళది.
 
ఎందుకంటే మనం వూరు వెళ్ళేటప్పుడు ఏదైనా బస్సు ఎక్కామనుకోండి ఆ బస్సు మధ్యలో ఆగిపోతే బస్సు ఆపరేటర్ వేరే బస్సు పంపించే అంతవరకు మన పాట్లు మనం పడాల్సిందే. ఎందుకు అంటే ఆ బస్సు లో వెళదాము అని నిర్ణయించుకుంది మనము. అంతేకాదు ఒక వేళ రెండు రోజులు పాటు ఆ బస్సు కనుక రెడీ అవ్వక పొతే చచ్చినట్టు మనం రెండు రోజులు అష్ట కస్టాలు పడాలిసిందే అంటే కాని ప్రభుత్వం ఏ మాత్రం విషయం లో కల్పించుకోదు. ఇది మనకి ఆల్రెడీ తెలిసిన విషయమే. అంతెందుకు RTC బస్సు లో మనం హైదరాబాద్ నుండి విజయవాడ లేదా విశాఖపట్నం వెళుతున్నప్పుడు ఆ బస్సు లో AC పనిచేయ్యకపోయన లేదా బస్సు బాగా లేకున్నా మనం కంప్లైంట్ చేసిన కూడా RTC వారు ఆ బస్సు మార్చరు. ఇది రోజు మన రాష్త్రం లో జరుగుతున్నా విషయమే. అంతే కాని ఇన్ని కంప్లైంట్స్ వచ్చినా కూడా ఇంత వరకు ప్రాబ్లం ఉన్న బస్సులను మార్చలేదు.
 
ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పవలసి వచ్చింది అంతే ఇదే మంత్రి గారు ఒకానొక సమయంలో మన రాష్ట్ర రవాణాశాఖ మంత్రిగా కూడా పని చేసారు. ఆయన మంత్రి గా ఉన్న సమయంలో ఉన్నప్పుడు కొన్న బస్సులు ప్రాబ్లం వస్తే వారు చెప్పిన సమాదానం ఒకో సారి అనుకోని ఇబ్బందులు వచ్చి బస్సు ట్రబులు   ఇవ్వవచ్చు అంత మాత్రాన ఆ బస్సు ని మార్చేయలేము. కాని అదే మంత్రి గారు ఇప్పుడు అనుకోని వాతావరణ పరిస్థితుల  వలన వారి ప్రయాణం ఒక రోజు వాయిదా పడే సరికే సదరు ట్రావెల్ ఏజెంట్ పైన కోర్ట్ లో కేసు వేస్తారంట ఈ లెక్కన రాష్ట్రము లో బస్సు లలో ప్రయాణించే ప్రతి ప్రయాణికుడు RTC  వారి పైన కేసు వేసి వాదించి నష్ట పరిహారం రాబట్టవచ్చు. ఇంత మంచి ఐడియా ఇచ్చినందుకు మనం మంత్రిగారిని నిజం కీర్తించవలసిందే.  ఇక్కడ నా ఉద్దేశం ట్రావెల్ ఏజెంట్  ని సపోర్ట్ చెయ్యడం కాదు, కేవలం differences చూపించడమే.
 
రోజు రాష్ట్రంలో ప్రైవేటు వాహనాలలో ప్రయాణించడం వలన ఎన్నో accidents జరుగుతున్నాయి. వాటిని అరికట్టడానికి ఏ మాత్రం చర్యలు తీసుకోవడం లేదు ఎందుకు అంటే ఈ వాహనాలలో ఏ మంత్రి గారు కాని, MLA కాని ప్రయాణించరు. వీరందరు కేవలం మన tax డబ్బులతో కొత్త కార్లు కొనుక్కొని వారు వెళ్ళే సమయంలో రోడ్డు మీద ట్రాఫిక్  ని ఆపి వేసి పైలట్ కార్స్ వెంట వేసుకొని దర్జాగా వెళతారు. దీనికి తోడు ఎప్పుడు అన్న వేరే ఊరు వెళ్ళాలంటే ఫ్లైట్ టికెట్స్, లేదా AC ట్రైన్ టికెట్స్ ఫ్రీగా తీసుకొని ప్రయాణిస్తారు. ఇలాంటి వారికి సాధారణ ప్రయాణికుడు పడే కష్టాలు ఎలా తెలుస్తాయి.
 
ఒకవేళ మొన్న జరిగిన ఆ యాత్రలో మంత్రి గారు MLA కాకుండా మీరో, నేనో లేదా మన లాంటి సాదారణ వ్యక్తి ఉన్నట్లు అయితే ప్రభుత్వం ఇంతగా రెస్పాండ్ అయ్యేదా? రోజూ పొట్టకూటి కోసం గల్ఫ్  లాంటి దేశాలకు వెళ్ళిన వాళ్ళు ఎంతోమంది చనిపోయిన వారిని ఇక్కడికి తీసుకు వచ్చే స్తోమత లేక అక్కడే దహనం చేస్తున్నారు. ఇలాంటి వారి గురించి కనీసం ఏ చిన్న ప్రయత్నం చెయ్యడం లేదు కాని ప్రజాప్రతినిధులమని చెప్పుకొని తిరిగే ఇలాంటి వారి కోసం మాత్రం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెనువెంటనే రెస్పాండ్ అవుతాయి.
 
అసలు మంత్రి గారు మంత్రి పదవిలో ఉంది మన డబ్బుల మీద ఆయన తీర్దయాత్రల సరదా తీర్చుకోవడమే తప్పు. ఈ విషయమే కాదు ప్రతి చిన్న దానికి మన so called politicians అమ్మ గారి దర్శనానికి ఎక్కే గడప దిగే గడప లాగ హైదరాబాద్-ఢిల్లీల మధ్య చక్కర్లు కొడుతూ ఎంత ప్రజా ధనాన్ని వేస్ట్ చేస్తున్నారో ఎప్పుడైనా ఆలోచించారా?
 
వారికి శాసన సభ సమావేశాలు అటెండ్ అవ్వాలంటే కుదరదు కాని ఇలా ప్రతిదానికి ఢిల్లీ కి వెళ్ళడం మాత్రం కుదుర్తుంది. 365 రోజులు ఉండే సంవత్సరంలో కేవలం 100 రోజులు కూడా సమావేశాలకు అటెండ్ కాలేరు. కాని వారి జీతభత్యాల పెంపు విషయానికి మాత్రం ఎప్పుడు కావాలి అంటే అప్పుడు సభ సమావేశ పరుస్తారు!  దీనికి తోడు ఈ మధ్య ఒక  మాజీ ముఖ్యమంత్రి గారు చేసిన ఒక విన్నపం వల్ల మన రాష్ట్ర ఖజానాకి మరో 10 కోట్లు ఖర్చు పెరిగింది.
 
ఇంతకీ సదరు మాజీ ముఖ్య మంత్రి గారి నివేదన ఏమిటి అంటే వారు ఎక్కువసార్లు రాష్ట్రం అంతా తిరగాల్సి వస్తుంది కాబట్టి వారికి జీవిత కాలం ట్రైన్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించాలని! మన రాష్ట్ర ప్రభుత్వం  సహృదయతతో వీరికే కాకుండా రాష్ట్రము లోని అందరు మాజీ ముఖ్యమంత్రులకు ఈ అవకాశాన్ని కల్పించి తన దయార్ద్ర హృదయాన్ని చాటుకుంది. కాని ఇదే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అవసరమైన డీజల్ , పెట్రోల్ , LPG వంటి నిత్యావసరాల మీద మాత్రం ఏ మాత్రం జాలి చూపకుంది!
 
రోలు వచ్చి మద్దెలతో మొరపెట్టుకొందన్నది పాత సామెత. రిమోట్ వచ్చి మొబైలుతో మొరబెట్టుకొందన్నది లేటెస్ట్ సామెత. సామెత ఏదైనా మనకు మాత్రం మోత తప్పడం లేదు!
 

Your views are valuable to us!