మన వేద వాజ్ఞ్మయంలో ఇంద్రుడు సాధకులకు ఒక ముఖ్య పరీక్షాధికారి. ఎవరు ఈతను పెట్టే పరీక్షలలో ఉత్తీర్ణులో వారికి కల్పాంతంలో ఇంద్ర పదవిని ఇస్తారు.
ప్రధాన మంత్రి పదవి కూడా ఇటువంటిదే. కాని దురదృష్టవశాత్తు ఈ పదవి విలువను సోనియా గాంధీ, మన్మోహనుడు ఊహించని రీతిలో దిగజార్చారు.
ఇటువంటి పరిస్థితుల్లో మోడీ ప్రధాని పదవి పొంది, ఆపై “నరేంద్రుడి” గా మారాలంటే కొన్ని పనులు చేయక తప్పదు అవి :
- భారతీయుల ఆత్మ గౌరవాన్ని సనాతన ధర్మాన్ని కాపాడేలా పాలన జరగాలి
- కనీస అవసరాలు అందరికీ సరసమైన ధరలకు దొరకాలి (ఉచితం గా కాదు)
- విద్యుత్ సంక్షోభం నుంచి దేశం లోని ప్రతి ప్రాంతం బయటపడాలి
- సాగునీరు, రక్షిత మంచి నీరు సులభంగా దొరకాలి అందరికీ అన్ని చోట్లా
- ప్రజల వద్దకు పాలన అమలుకావాలి ఇందుకు ఇతోధికంగా సాంకేతికత ను వినియోగించాలి
- ప్రభుత్వ ఉద్యోగుల జవాబుదారీ తనం అందరికీ తెలిసేలా పెరగాలి
- బాహాటంగా ఉమ్మడం, మూత్ర, మల విసర్జన చేయడం పూర్తిగా సమసిపోవాలి.
- ప్రభుత్వ ఆసుపత్రుల, కార్యాలయాల, బడుల భవనాలు కొత్త రూపును దాల్చాలి పరిశుభ్రత కు చిరునామాలు కావాలి
- సేంద్రియ సాగు దేశమంతా సాగాలి, దేశమంతా పచ్చదనం విస్తరించాలి
- ఆయుర్వేదం, యోగ, సంస్కృత భాష విస్తృతంగా వినియోగిమ్పబడాలి.
- దేశంలోని అన్ని దేవాలయాలకూ చక్కని పాలక వర్గాల నియామకాలు జరగాలి – రాజకీయాలకు అతీతంగా కేవలం ఆధ్యాత్మిక జ్ఞానం అనుష్టానం ప్రాతిపదికగా
ఈ 11 పనులు పూర్తయిన నాడు మోడీ నరేంద్రుడిగా మారతాడు. వీటిని పూర్తి చేయడానికి ఎన్నో అడ్డంకులు, పరీక్షలు మోడీకి ఎదురు ఔతాయి కానీ అలుపెరగని ప్రయత్నం తో వీటిని అధిగమించవచ్చు. అలా అధిగమించడానికి:
ప్రతినెల ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వాలి. ప్రభుత్వ ప్రకటనలకు అందు రాజకీయ నాయకుల చిత్రపటాల ముద్రణకు వినియోగించే ధనాన్ని ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ ప్రచురణకు వాడాలి. ఎంతో సృజనతో కూడిన పాలన ద్వారానే చాల అసాధ్యమనుకొనే పనులు సాధ్యం ఔతాయి.
సివిల్ సర్వీసెస్ ను ప్రక్షాళన చేసి 50 ఏళ్ల వరకూ ఎవరైనా ఈ సేవలలో చేరేలా అవకాశం ఇచ్చి నూతన ఎంపిక విధానం ద్వారా ప్రతిభ, నడువడి ఆధారం గా నియామకాలు జరగాలి. ప్రభుత్వ ఉద్యోగం అంటే సేవకోసం తక్క అక్రమ సంపాదన కోసం కాదు అనే భావన కలిగేలా సమూల మార్పులు తీసుకొని రావాలి. రాష్ట్ర, కేంద్ర సేవల మధ్య తారతమ్యం పోవాలి.
అలాగే విద్యనూ ఉమ్మడి జాబితాలో పెట్టి “ఉమ్మడి గొర్రి పుచ్చి చచ్చేన్ ” రీతిని రాష్ట్రానికో బోర్డు, సిలబస్, ఎన్నో రకాల పరీక్షా విధానాలతో విద్యార్థుల భావి భారత పౌరుల జీవితాలతో ఆటలాడు కుంటున్నాము గత ఆరు దశాబ్దాలుగా. విద్య కేంద్ర జాబితాలో పెట్టి దేశం లో ఒకే తరహా విద్యా విధానం ఏర్పాటు చేయాలి (భాష, రాష్ట్ర చరిత అదనం గా ). విద్య అమ్ముడుపోయింది కనుకే భారతావనిలో ఇన్ని వీపరీత్యాలు.
ఇదీ క్లుప్తం గా మోడీ కర్తవ్యం. ఆయన ఈ పనులు చేస్తే సహకరించడం మన బాధ్యత.
జై హింద్
— ఒకభారతీయుడు