రాజకీయ నాయకుల సహాయంతో వ్యాపారస్తులు వ్యాపారాన్ని పెంచుకోవటం అనాది కాలం నుంచీ ఉన్నదే. ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు వ్యాపారస్తుల సహాయంతో అధికారాన్ని పదిలం చేసుకోవటం కూడా అనాది కాలం నుంచీ ఉన్నదే! కానీ ప్రజల వోట్లతో అధికారం దక్కాల్సిన ప్రజాస్వామ్యంలో తమకు డబ్బులిచ్చి ఒప్పందం కుదుర్చుకున్నవాళ్ళని అధికారంలోకి పంపించటానికి ఒక వ్యాపారసంస్థని పెట్టి ప్రజల్ని మోసం చేస్తున్న ప్రశాంత్ కిషోర్ తనని తను మేధావి కింద భావించి ఎంత ఆర్భాటం చేస్తున్నాడో చూడండి!
JD(U) expels Prashant Kishor, Pavan Varma for ‘anti-party’ activities అనేది రెండు రోజుల క్రింద దాదాపు అన్ని వార్తాపత్రికలలోని మొదటి పేజీలలో విశేష వార్త కింద వచ్చింది. ఈ Prashant Kishor అనే వ్యక్తికి ఉన్న బిరుదునామం ఏంటో తెలుసా – Election strategist. అంటే ఒక పార్టీ అప్పుడు పోటీ చేస్తున్న ఎన్నికల్లో ఏయే వ్యూహాలు పాటిస్తే గెలిచి అధికారంలోకి వస్తుందో చెప్పడం. ఇది ఉచిత సేవ కాదు. కోట్లలో డబ్బు చేతులు మారుతుంది, ఫలితం మాత్రం ఖచ్చితం!
ఇతని పేరు మొదటిసారి మీడియాలో వినపడింది నరేంద్ర మోదీ తొలిసారి ప్రధాని పీఠానికి పోటీ పడుతున్న 2014లో. అయితే 2012 నాటి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లోనే ఇతని పనితనం బీజేపీ వాళ్ళకి తెలిసి మోదీని ప్రధానిని చేసే బిజినెస్ కాంట్రాక్టు అతనికి ఇచ్చారు! ఇతను పదేళ్ళు ఆమెరికాలో ఉండి అధ్యక్ష తరహా ఎన్నికల్లో ఉపయోగిస్తున్న వ్యాపార ప్రణాళికలని నేర్చుకుని వచ్చిన ఘనాపాఠి. Election strategist అన్న లేబుల్ చూసి అదేదో గొప్ప వృత్తి అనుకోకండి – ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఎన్నికలో గెలవడని అనుకుంటున్న స్థాయిలో అప్రతిష్ఠ పాలైన వ్యక్తిని కూడా అబద్ధాల్ని నిజాల కింద చూపించి అతని ప్రతిష్ఠని పెంచి ప్రజలని/వోటర్లని/విశ్లేషకుల్ని నమ్మించి ముఖ్యమంత్రి స్థానానికి గానీ, ప్రధానమంత్రి స్థానానికి గానీ అతన్ని అర్హుణ్ణి చెయ్యటం, అంతే!
Narendra Modi: The Man, The Times అనే పుస్తకం రాసిన Nilanjan Mukhopadhyay 2014 నాడు మొదలైన మోదీ ప్రస్థానం ప్రశాంత్ కిషోర్ పెట్టిన భిక్షయేనని తేల్చి చెప్పాడు. Chai pe Charcha, 3D rallies, Run for Unity, Manthan వంటివి అతని బుర్రలో పుట్టిన అయిడియాలే! అయితే, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నాటినుంచి పార్టీలో చేరకుండానే పార్టీని గెలిపించిన ఇతను మోదీని ప్రధానిని చేసిన సంవత్సరం తర్వాత Nitish Kumar గెలుపుకి సహాయం చేసి Nitish Kumar ప్రభుత్వంలో పనిచేస్తూనే మిగిలిన పార్టీలకి తన వ్యాపార సేవల్ని అందిస్తూ వస్తున్నాడు. ఇతను 243 సీట్లకి Nitish Kumar నాయకత్వంలోని grand allianceకి 178 సాధించిపెడితే బహుశా తమ ఇద్దరి సొంత తెలివితేటల మీద నమ్మకంతో ఇతన్ని వదిలేసి ఉంటారని అనిపించే మోదీ-షా ద్వయం కూడా 53తో సర్దుకుపోవాల్సి వచ్చింది!
2016లో కాంగ్రెసుకి అమ్ముడుపోయి 2017 పంజాబ్ ఎన్నికల్లో ఆ పార్టీని గెలిపించాడు. Randeep Surjewala, Shankersinh Vaghela వంటి అనేకమంది కాంగ్రెసు నేతలు బహిరంగ వేదికల మీద ఆ విజయం ప్రశాంత్ కిషోర్ చలవేనని ఉద్ఘాటించారు Singh గారు “As I have said many times before, PK & his team and their work was absolutely critical to our victory in Punjab!” అని ట్వీట్ చేశారు. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో మాత్రం వ్యతిరేక ఫలితం వచ్చింది – బీజేపీకి 300+ వస్తే కాంగ్రెసు ఏడుస్తూ మిగిలిపోయింది! పంజాబ్ ఎన్నికల్లో గెలిపించినప్పుడు ఆకాశాని కెత్తేసిన వాళ్ళు ఉత్తర్ ప్రదేశ్ ఓటమిని అతని నెత్తిన వేసి చావు తిట్లు తిట్టారు. Sankarshan Thakur తడబాటు లేకుండా Telegraph పత్రికలో “It was never the party, mind you, that wooed, or even wanted, Kishor; it was always the party’s first family. And that might be central to why the going for Kishor has been so uncertain, unproductive, unnerving.” అని కుండ పగలేశాడు.
ఇలా తను ఇతర్ల నుంచి డబ్బు తీసుకుని ఇతర్లకి అధికారాన్ని కానుక ఇవ్వటం కోసం 2013లో ఇతను పెట్టిన కంపెనీ పేరు ఏమిటో తెలుసా – Citizens for Accountable Governance (CAG) అట! మోదీని ప్రధానిని చేశాక ఎందుకు బీజేపీతో దూరమయ్యాడో తెలియదు గానీ కంపెనీ పేరును Political Action Committee (I-PAC) అని మార్చి మరిన్ని హంగుల్ని సంతరించుకోవడాన్ని గమనించితే వేశ్యలు ఒకే విటుడి దగ్గిర ఉండిపోవటం కన్న పదిమందిని ఆకర్షించడం లాంటి తెలివి చూపించినట్టు అనిపిస్తున్నది నాకు.
ప్రస్తుతం ఇతన్ని బహిష్కరించటానికి చెప్తున్న కారణం Citizenship Amendment Act విషయంలో వచ్చిన అభిప్రాయభెదాలు అని చెప్తున్నప్పటికీ వేశ్యలు ఒకే విటుడి దగ్గిర ఎక్కువ కాలం వుండలేని వ్యాపారసూత్రమే అతన్ని విభేదాలను సృష్టించుకోవటానికి ప్రోత్సహించి ఉంటుందని నా నమ్మకం. “Thank you @NitishKumar. My best wishes to you to retain the chair of Chief Minister of Bihar. God bless you.” అనడం వెనక ఎంత స్వోత్కర్ష ఉందో చూస్తున్నారు కదా!
Vice-president హోదా నుంచి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఆరోపణలతో గెంటించుకోవడాన్ని కూడా సెలెబ్రేషన్ ఇష్యూ కింద మార్చేస్తున్నాడు చూడండి! వేశ్యకి తన జాణతనం మీద ఉన్నంత నమ్మకం ఇతనికి అబద్ధాలను నిజం కింద భ్రమింపజేసే తన తెలివితేటల మీద ఉంది. ప్రస్తుతం మమత బెనర్జీతో కాంట్రాక్టు కుదిరిపోయిందని అంటున్నారు. లేదంటే, గత కొద్ది కాలం నుంచి తమ చాణక్యం పనిచెయ్యక తెల్లమొహం వేస్తున్న మోదీ-షా ద్వయం కూడా మళ్ళీ శృంగారానికి పిలిచే అవకాశం ఉంది. ఆంధ్రలో జగన్మోహన్ రెడ్డి అనే బలమైన క్లయింటు ఉండనే ఉన్నాడు.
మోదీని ప్రధానిని చెయ్యడం తర్వాత అంత సంచలనాత్మకమైనది 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చెయ్యటమే. ఆనాడు మోదీకి ఉన్న ప్రతికూలతలు ఏమిటో ఈనాడు రెండు విడతలు గెలిచిన మత్తులో ఉన్న భాజపా అభిమానులకు గుర్తు ఉండకపోవచ్చు. కానీ, గోద్రా అల్లర్ల సమయంలో అతను వ్యవహరించిన తీరు ఇప్పటికీ వివాదాస్పదమైనదే. అమెరికా వీసాను కూడా సస్పెండ్ చేసింది. అయినా సరే రాష్ట్ర స్థాయిలో గెలిపించి విపక్షాల ఏడుపే తప్ప రాష్ట్ర ప్రజలు కూడా మరోసారి ముఖ్యమంత్రిని చేశారు అనే రీతిలో దాన్ని కూడా అనుకూలత కింద మార్చిన ప్రశాంత్ కిశోర్ మోదీ ప్రధాని పదవి దగ్గరకు తీసుకెళ్ళిన విషయం జగన్మోహన్ రెడ్డి కంట పడకుండా ఉందగలదా!
కేవలం అయిదేళ్ళలో అరవై బీనామీ కంపెనీలు పెట్టి తను దోచినదీ తను దోచుకోవడానికి సాయం చేసినవాళ్ళు సందట్లో సడేమియా అంటూ నొక్కేసినదీ కలిపితే లక్ష నుంచి లక్షన్నర కోట్లు ఉంటుంది. అయినా సరే నన్ను పట్టుకునేదెవడు అనే ధీమా అతనిది. తండ్రి చనిపోతే అతని కంటినుంచి కారిన ఒక్క కన్నీటి చుక్కని అతని అభిమాన మీడియా కూడా పట్టుకోలేకపోయింది – అంత్యక్రియలు కూడా పూర్తి కాకముందే తన సమర్ధకుల నుంచి సంతకాలను సేకరించి నన్ను ముఖ్యమంత్రిని చెయ్యమని పార్టీ అధిష్ఠానం మీద ఒత్తిడి చెయ్యటం మొదలుపెట్టాడు! అధిష్ఠానం కుదరదనగానే వేరే పార్టీ పెట్టేశాడు. మలి విడత తెలంగాణ ఉద్యమంలోని కీలకమైన అంశం అయిన చంద్రబాబును రాజకీయ జీవితం నుంచి తప్పించడం కోసం వ్యక్తి దూషణ, ప్రాంత దూషణ జరుగుతున్న సమయంలో అవకాశాన్ని అందిపుచ్చుకుని ఆ కర్తవ్యాన్ని భుజాన వేసుకుని ఆర్టికిల్ మూడును మాతృసంస్థకు సూచించి తెలంగాణకు కేసీయార్ ఆంధ్రకు తనూ ముఖ్యమంత్రులు కావడం తధ్యమనుకుని ఎంతో ఉత్సాహం చూపిస్తే ఆంధ్ర ప్రజానీకం అంతకు మించిన తెలివిని చూపించి చంద్రబాబుకు ఆంధ్రముఖ్యమంత్రి స్థానం కట్టబెట్టారు. నిజానికి అప్పుడు అతనున్న హుషారులో ఆ దెబ్బకి మతి చలించాల్సింది – అతనెట్లా తట్టుకోగలిగాడో నాకిప్పటికీ ఆశ్చర్యమే! మొత్తానికి ధైర్యం కూడదీసుకోగలిగాడు కానీ అనుభవలేమి వల్లనూ తట్టుకోలేని అవమానం నుంచి పుట్టిన ఆక్రోశం వల్లనూ చాలా తప్పులు చేశాడు. ప్రతి ఎత్తుగడా వేస్తున్నప్పుడు అతని పక్షం వాళ్ళు అద్భుతం అనుకున్నారేమో గానీ ప్రతిసారీ తెల్లమొహం వెయ్యాల్సి వచ్చే స్థాయిలో ఎదురు తంతూ ఉండేవి. ప్రశాంత్ కిశోర్ కాంట్రాక్టు తీసుకునేసరికి జగన్ పరిస్థితి అది. ఈనాడు జగను కున్న ప్రతికూలతలతో పోలిస్తే ఆనాడు మోదీకి ఉన్న ప్రతికూలతలు దూదిపింజలే!
2014లో ఆంధ్ర ప్రజలు ఏ నేరచరిత్రని చూసి అసహ్యించుకుని అతని బదులు చంద్రబాబు మెరుగని భావించారో ఆ నేరచరిత్ర అలా వుండగానే పరిపాలనా దక్షతలో అ నేకమంది సీనియర్ నాయకుల మెప్పును పొందిన చంద్రబాబుకు ఏవిధంగాను పోటీ రాలేని ఇతన్ని చంద్రబాబు కన్న మెరుగైన ముఖ్యమంత్రి అని ఆంధ్ర ప్రజలు ఒప్పుకునేలా దృశ్యాన్ని మార్చి 151/175 సీట్లతో గెలిపించడం మానవమాత్రుడికి సాధ్యమా? జగన్మోహన్ రెడ్డి చేతి నుంచి తన చేతికి మారే కొన్ని మిలియన్ల డబ్బు కోసం ఆంధ్ర రాష్ట్రాన్ని స్మశానం కింద మార్చాలని కంకణం కట్టుకున్నవాళ్ళని అధికారంలో కూర్చోబెట్టడం మానవత్వం ఉన్నవాడికి సాధ్యమా?
ఆనాడు కాంగ్రెసులో ఉండి జగన్ని అవహేళన చేసి అతని తల్లిని కూడా అవమానించిన బొత్స సత్యనారాయణ ఈనాడు ఆత్మబంధువై అతని మంత్రివర్గంలో ఉన్నాడు. ఆనాడు తెలుగుదేశం పార్టీలో వుండి చంద్రబాబు పక్కన నిలబడి జగన్ని దూషించిన బుగ్గన రాజేంద్రప్రసాద్ ఈనాడు ఇతని పక్కన నిలబడి చంద్రబాబును దూషిస్తున్నాడు . ఎవడు డబ్బిస్తే వాడిని రసికుడని పొగుడుతూ వేశ్యలు చేసేది వీళ్ళ కన్న ఉత్తమమైనది. ఎందుకిలా నీచత్వాన్నే ఔన్నత్యం కింద భావిస్తున్నారో వాళ్ళకే తెలియాలి!
జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో విశాఖకు వెళ్ళడానికి అసలు కారణం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని చంపేసి కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దలు ఒప్పందం కుదుర్చుకున్న POSCO అనే దక్షిణ కొరియన్ కంపెనీని అక్కడ నెలకొల్పి స్థిరపర్చటం కోసం అని తెలిశాక కూడా ఆవేశం రాని పదమూడు జిల్లాల ప్రజానీకాన్ని తల్చుకుంటే భయం, కోపం, జాలి తన్నుకొస్తున్నాయి నాకు.
ఒకప్పుడు ప్రణయ్ రాయ్ ఎన్నికలు జరిగాక సెఫాలజీ సాయంతో ఫలితాలను అంచనా వేసి చెప్పి సృష్టించిన సంచలనంలో కూడా వ్యాపారమే ఉన్నప్పటికీ ప్రజలకు ఎంతో కొంత మేలు జరిగింది – ఎన్నికల నిర్వహణ పట్ల కొంత విజ్ఞానం పెరిగింది.కానీ ప్రశాంత్ కిశోర్ యొక్క వ్యాపారవృద్ధి ప్రజల యొక్క న్యాయమైన ఆకాంక్షలను చిదిమేస్తూ విశ్వసనీయత లేని ప్రభుత్వాలని ఏర్పాటు చేస్తున్నది.ఇతని నిజస్వరూపాన్ని ప్రజలు గమనించి ఇతన్ని తమ పార్టీని గెలిపించడానికి కాంట్రాక్టు ఇచ్చిన ప్రతి పార్టీని ఓడించి ఇతనికి పెరిగిన సంపదనీ వైభవాన్నీ అహాన్ని తగ్గించకపోతే ఇతను గెలిపించే అభివృద్ధి నిరోధకుల చేతుల్లో పడి అతి త్వరలోనే దేశం కరువు కాటకాల బారిన పడటం తధ్యం!
ఫిబ్రవరి 26, 2019న పన్నెండు Mirage 2000 యుద్ధవిమానాల్ని సరిహద్దులు దాటి పాకిస్తాన్ భూభాగంలోకి చొరబడి బాలాకోట్ టెర్రరిస్టు స్థావరాల్ని కూల్చిన వీరోచిత కృత్యానికి దేశప్రజల నుంచి మోదీ మద్దతు కూడగట్టుకోవటానికి ఉపయోగపడిన ఫిబ్రవరి 14, 2019 నాటి నలభైమంది భారత సైనికుల్ని బలి తీసుకున్న పుల్వామా దాడి భారత, పాకిస్తాన్ దేశాధ్యక్షుల రాజకీయావసరాల కోసం వారిద్దరి పరస్పర సహకారాలతో జరిగిందనేది ఎంతమందికి తెలుసు? మోదీ మరోసారి గెలవడానికి దోహదపడిన ఆనాటి ఎన్నికల ప్రచారం కోసం వాడుకున్న అన్ని అంశాల్లోనూ ఇదే ప్రముఖపాత్ర వహించడం వాస్తవమే కదా! నేనేదో అనుమాన పిశాచి మాదిరి హిందూమతపరిరక్షకుడైన అభినవ శివాజీ వంటి మహనీయుడి గురించి కట్టుకధలు అల్లుతున్నానని అనుమానం ఉన్నవాళ్ళు ఆనాడు ఒకరు కాదు ఇద్దరు కాదు అనేకమంది మాజీ సైనికాధికారులు “దయచేసి భారత సైన్యాన్ని మీ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోకండి!” అని పదే పదే విజ్ఞప్తులు చేశారనేది గుర్తు చేసుకోండి – ఇటువైపునుంచి కుట్ర యేదీ లేకుండా అటువైపునుంచి దాడి జరిగితే వారు అలా విజ్ఞప్తులు చెయ్యాల్సిన అవసరం ఏమిటి? మీడియాలో ప్రచురితం కాకుండా జాగ్రత్త పడ్డారు కాబట్టి అసలు కుట్ర మనకి తెలియదు గానీ ఆ మాజీ సైనికాధికారులు తెలుసుకోగలిగారు కాబట్టే అలా ప్రతిస్పందించారు!
మతాంతరీకరణల వల్ల హిందూమతం ప్రమాదంలో పడిందని భావించే కొందరు అమాయకులైన హిందువులూ మేధావులూ నమ్ముతున్నట్టు మోదీ గెలుపు హిందువుల రాజకీయ పరిజ్ఞానం పెరిగి మోదీని అభిమానించడం వల్ల భాజపా అధికారంలోకి రాలేదు. దాదాపు 2010 నుంచి పదును పెట్టుకుంటున్న తన election strategist తెలివితేటలతో ప్రశాంత్ కిశోర్ మోదీని ప్రధాని పీఠం ఎక్కిస్తే మోదీ-షా ద్వయం ఆ తర్వాత అదే రకం తెలివితేటలతో ప్రజల్ని అలరిస్తూ చెలరేగిపోతున్నారు!
ప్రజల్లో చాలామందికీ మేధావుల్లో భాజపాను అభిమానించేవారికీ అతి ముఖ్యమైన ఆర్ధికపరమైన విషయాల్లో అవగాహన లేదు. అందువల్ల పట్టించుకోవాల్సిన అతి ముఖ్యమైన ఆర్ధిక ప్రగతిని వదిలేసి CAA వంటి అనవసరమైన విషయాల్ని గురించి తీవ్రమైన భావోద్వేగాన్ని ప్రదర్శిస్తున్నారు. అదేమీ ఇతఃపూర్వం ఉనికిలో లేని కొత్త చట్టం కాదే! చాలా కాలం క్రితమే రూపు దిద్దుకుని ఉన్న చట్టానికే కొన్ని అదనపు అంశాల్ని చేర్చి పేరు మార్చారు. దాంతోనే అద్భుతాలు జరిగిపోతాయనుకోవడం ఎంత అవివేకం! ఆ చట్టం వల్ల ఎక్కడెక్కడో మతపరమైన అణచివేతకు గురయ్యే హిందువులు మన దేశం వచ్చేస్తే మన ఆర్ధిక రంగం మీద పడే అదనపు భారం ఎవరు మొయ్యాలి? మనమే కదా! కాంగ్రెసు నుంచి అధికారాన్ని గుంజుకుని మోదీ ప్రధాని అయిన నాటినుంచి ఆర్ధిక పురోగతి సూచి కిందకి దిగజారుతుంటే దాని దెబ్బ తగిలేది ఎవరికి? ఇప్పటికీ నూటికి ఎనభై శాతం ఉన్న హిందువుల్ని విడివిడి లెక్కలు చూస్తే పది శాతం మించని క్రైస్తవులూ ముస్లిములూ ఏదో చేసేస్తారని భయపడటం ఎంత అమాయకత్వం?
ఆంధ్రాలో చంద్రబాబు ప్రత్యేకహోదా ఇవ్వకపోయినా తను పట్టుపట్టి సాధించుకున్న ప్రత్యేక ప్యాకేజీకి దొడ్డిదారిన తూట్లు పొడిచినా తట్టుకు నిల్బడి రాక్షస పట్టుదలతో పనిచేసి ఆంధ్రప్రదేశ్ వృద్ధిని రెండంకెలకి పెంచితే అది కలిశాకనే దేశం యొక్క వృద్ధి సూచి 7 దగ్గిర నిలబడింది.అలాంటి చంద్రబాబు మీద ఈర్ష్యతో కూడిన పగతో రగిలిపోయి ఓడించి పారేసిన వెంటనే 4 దగ్గిరకి దిగజారింది. ఇప్పటికిప్పుడు 3.3 దగ్గిర ఉంది. వృద్ధిరేటుకు బదులు షేర్ మార్కెట్ పెరుగుదలని చూపించి మోసం చెయ్యడమే తప్ప ఇప్పటి బడ్జెటు కూడా వృద్ధిరేటును పెంచేటట్టు లేదు. ఇలాంటి వాళ్ళని గెలిపించడమే వృత్తి అయిన ప్రశాంత్ కిశోర్ ఆంధ్రాలో జగన్మోహన రెడ్డిని గెలిపించినదుకు పశ్చాత్తాపం వెలిబుచ్చుతున్నాడని వేమూరి రాధాకృష్ణ చెత్తపలుకులు పలుకుతున్నాడు – ఇలా తగలడ్డాయి మన మేధావుల, విశ్లేషకుల, పత్రికారంగ ప్రముఖుల తెలివితేటలు.
భారతదేశంలో ఎన్నికల వ్యవస్థ పనిచెయ్యటం మొదలుపెట్టిన తొలి ఎన్నికల నుంచి ఎంతో పరిణితిని చూపించి ప్రతి ఎన్నికలోనూ వైవుధ్యాన్ని ప్రదర్శించిన ఆంధ్ర వోటర్లు కూడా మోసపోయారంటే ఇతర్ల విషయం చెప్పాల్సిన పని లేదు కదా! చాలామంది సీనియర్ విశ్లేషకులు కూడా దేశం మొత్తం చీకొట్టిన ఇందిరాగాంధీకి 42కి 41 సీట్లు ఇవ్వడం గురించి ఆంధ్ర ప్రాంతపు వోటర్లకి అమాయకత్వాన్ని అంటగడతారు కానీ నా దృష్టిలో అది గొప్ప విశేషం! నిజానికి ప్రజలకి ఇవ్వాల్సిన అంతర్గతమైన శాంతిభద్రతల విషయంలో గానీ ప్రపంచ వేదికల మీద దేశం యొక్క ప్రతిష్ఠని నిలబెట్టడంలో గానీ అత్యుత్తమమైన పనితీరును ప్రదర్శించిన ఒకే ఒక భారత ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ అనేది వాస్తవం. అప్పుడు ఆమె మీద కేసు వేసిన రాజ్ నారాయణ్ ఒక బఫూను కంటె ఎక్కువేమీ కాదు. జయప్రకాశ్ నారాయణ్ కూడా మీడియా చూపించినంత ఉదారవాది యేమీ కాదు. ఆమె తరచు విదేశీహస్తం గురించి ప్రస్తావించడాన్ని ప్రతిపక్షాలు వెకిరించినప్పటికీ స్వతంత్రం వచ్చిన నాటినుంచి ఇప్పటివరకు దేశం బయటినుంచి కుట్ర జరుగుతూనే ఉందనేది కూడా వాస్తవం. ఆరోజున ఆంధ్రప్రజలు ఇందిరాగాంధీకి వూపిరి పోయడం భారతజాతి అదృష్టం అనే చెప్పాలి. అటువంటి ఆంధ్ర ప్రాంతపు వోటర్లని కూడా మోసం చెయ్యగలిగాడంటే అతని ప్రజ్ఞ ఎంతటిదో తెలుస్తున్నది కదా!
మరోసారి జగన్మోహన్ రెడ్డి, ప్రశాంత్ కిషోర్ మాయాజాలం పనిచేసి మరుసటి ఎన్నికల్లో చంద్రబాబు ముఖమంత్రి కాకపోతే ఇవ్వాళ బొత్సా తమ్మినేనీ స్మశానం అనీ ఎడారి అనీ మాటల్లో అన్నదాన్ని చేతల్లో కూడా చూపిస్తారు!
“అన్నా! జగన్ అన్నా! అమరావతి ఆశలు చాలా బాగా తెంచేసావు అన్నా… అన్నా కేంటీన్ లో బడుగులు … ఏదో కారణాలవల్ల ఇంట్లో కుదరక ఇక్కడికి వచ్చేవారిని …. ఇంట్లో పిల్లలు పెట్టకపోతే…. ఎలాగో ఒకలాగ అయిదు రూపాయిలు సంపాదించుకుని కడుపునింపుకుంటున్న ముసలివాళ్ళ ఉసురు తగులుతుందన్నా నీకు…. ఇసుక రెండువేలకి దొరుకుతుంటే…. వాళ్ళు తినేసారు అని తిట్టి పోసే మీరు ఆరువేల ఎనిమిది వందలకి అమ్ముతూ …. వాళ్ళు తినేసారు అని ఇంకా బుకాయింస్తూ…. ఎలా అన్నా ? మా వల్ల అయితే కావట్లా… ఎలా అన్న ఆ సీట్ లో కూర్చోగలుగుతున్నావు? రోజు ఏదో కారణాలతో…. కరెంటు తీసేస్తు… గట్టెక్కిస్తున్నావు…. అంతకు ముందు అవసర పడని ఇన్వర్టర్స్ ఇప్పుడు బూజు దులిపి వాడ్డం మొదలెట్టాం…. కరెంటు చార్జీలు అంత వస్తుంది ఇంత వస్తుంది… నే వచ్చి తగ్గిస్తానన్నావ్… ఓ ఇలా తగ్గిద్దామనా?… భలే మొసం చేసావన్నా…. వృద్దాప్య పించను మూడు వేలు చేస్తా… పెంచుకుంటూ పోతా అంటే… మూడువేలనుండి అనుకుని మురిసిపోయారు…. భలే పెంచావన్న…. రెండువేలపైన రెండొందల యాభై పెంచి… పన్నెండొందల యాభై పెంచాను అని వ్రాసుకుంటే… చూడ్డాన్కి మాకే సిగ్గేసిందన్నా… మా సిగ్గుచూసి మీ ఎంఎల్ ఏలు కాలరెగరేస్తుంటే…. మా తలకాయలు ఎక్కడపెట్టుకుని సిగ్గుపడాలో తెలియలేదు అన్నా… త్వరలో విశాఖ ఉక్కు ఆపేస్తావటగా ఆ పుణ్యం కూడా కట్టేసుకో అన్నా… మీ పిల్లలు మీరు చాలా చల్లగా వుండాలన్న… పాపం ఇసుక దొరకక కొంతమంది… అమరావతిలో కొంతమందిని పొట్టన పెట్టుకున్న పుణ్యం ఊరికినే పోదు అన్న… నా కొడుకుని గెలిపించండి… ఆరు నెలల్లో సత్తా చాటుతాడు అంటే… ఏంటో అనుకున్నాం… గెలిపించినందుకు ఒక్క సారి కూడా వచ్చి సంతాప యాత్ర చేయలేదేంటన్నా… ఇంకా పై పై విషయాలు రాస్తే… పాపం మీకు కోపం వచ్చుద్ది అనుకుంటా… ఆ పాపం మాకెందుకులే అన్నా … కాని అన్నా … నువ్ కేక అన్నా … కేక!” అనే బడుగు జీవుల ఆర్తనాదాలు కూడా కదిలించలేనంత మందకొడితనం విద్యావంతులైన మేధావులకు దేనికి ఆవహించిందో అర్ధం కావడం లేదు నాకు?
ప్రస్తుతం POSCO కంపెనీతో బీజెపీ వాళ్ళు కుదుర్చుకున్న కాంట్రాక్టు కోసం A1 AP CM విశాఖ వెళ్ళి నిర్దాక్షిణ్యంగా చంపెయ్యాలనుకుంటున్న ఆనాటి ఆంధ్ర-తెలంగాణ-రాయలసీమ నాయకులు అందరూ కలిసి “విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు!” అని గర్జించి సాధించుకున్నదాన్ని కూడా రక్షించుకోలేకపోతే ముందు తరాలకి మన తరం గురించి గర్వంగా చెప్పుకోవడానికి ఒక్క మంచి మాట కూడా ఉండదు. అమరావతి అని పేరు పెట్టి రాజధానికి శ్రీకారం చుట్టిన నాటినుంచే వైకాపా శ్రేణులు ద్వేషంతో రగిలిపోతున్నారు – పంటపొలాల్ని కాల్చారు, కేంద్రజలసంఘానికీ పర్యావరణ శాఖకీ ఫిర్యాదులు చేశారు. అసలు ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధాని ఉండనే ఉండకూడదన్నంత మొండి పట్టుదలతో పని చేసి అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. శకుని ఆడిన మాయాద్యూతంతో పోల్చదగిన జగన్ దుర్మార్గపు మనస్తత్వానికి ప్రశాంత్ కిశోర్ నీచత్వం తోడైన నదురూ బెదురూ లేని అబద్ధాలతోనూ EVM మాయాజాలంతోనూ 2019 ఎన్నికల్లో గెలిచారు.
ఇసుక కొరత సృష్టించి 40 మందికి పైన భవన నిర్మాణ కార్మికుల్ని పొట్టన పెట్టుకుని కూడా మీడియా ముందు సైతం కించిత్తు బాధని చూపించలేదు. మద్యనిషేధం పెడతామని చెప్పి అధికారంలోకి వచ్చి ఖరీదు పెంచి బ్రాండెడ్ లిక్కర్ని ప్ర.సా.దుల్లో అమ్మిస్తున్నారు. నలభయ్యయిదేళ్ళకే పించన్లు ఇస్తానని చెప్పినవాళ్ళు ఏడు లక్షల పించన్లని రద్దు చేసేశారు. అప్పుడు పంటపొలాల్ని కాల్చినప్పుడు వాడకుండా మిగిల్చిన కాగడాల్ని ఇప్పుడు విశాఖలో మళ్ళీ వెలిగిస్తున్నారు – బూతులు తిట్టటం, చంపి పారెయ్యటం, తగలబెట్టడం, కూల్చిపారెయ్యటం, నాశనం చెయ్యటం, విధ్వంసాలు సృష్టించటం, వేర్పాటు వాదుల్ని తయారుచెయ్యటం తప్ప ఇంకేమీ తెలియని ఈ ప్రభుత్వాధినేతలని ఇంకెన్నాళ్ళు సహిస్తారు?
విశాఖ అంటేనే ఉక్కు ఫ్యాక్టరీ అని అతుక్కుపోయిన జంట అస్తిత్వాలనే ధ్వంసం చెయ్యాలని చూస్తున్న కుట్రదారులకి కొందరు విశాఖ వాసులే స్వాగతాలు పలికి తరిస్తున్నారు – కనీసం ఉక్కు ఫ్యాక్టరీ కార్మికులైనా నిద్ర లేవాలి, సింహాలై గర్జించాలి.అమరావతితో పాటు స్వర్ణాంధ్ర యొక్క నిజమైన భవితవ్యం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని నిలబెట్టుకోవటంతోనే మొదలు కావాలి.
జయహో అమరావతి!జయహో స్వర్ణాంధ్రప్రదేశ్!