Like-o-Meter
[Total: 0 Average: 0]
డా. అబ్దుల్ కలాంని లేదా ప్రణబ్ ముఖర్జీని లేదా ఇతర రాజకీయ నాయకుణ్ణి నూతన రాష్ట్రపతి గా ఎన్నుకోనేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో మనం ఒక్కసారి మన రాష్ట్రపతి పదవికి ఇచ్చిన విలువ, అవసరం మననం చేసుకోవలసిన అవసరం ఉంది. ఇందుకు నేను ఎంచుకున్న ప్రమాణం మన రాష్ట్రపతి గారి అధికార వెబ్ సైట్. మన రాష్ట్రపతి గురించి ప్రపంచానికి ముఖ్యంగా మన భారతీయుల గురించి తెలిపేది ఈ వెబ్ సైట్. ఒక్కసారి మీరు దీనిని చూస్తే మీకే తెలుస్తుంది మన రాష్ట్రపతి భారతీయులకు ఎలా ఉపయోగపడతాడో అని. ఈ వెబ్ సైట్ లింక్ క్లిక్ చేస్తే http://presidentofindia.nic.in/
ఈ క్రింది లిస్టు మనకు కనబడుతుంది:
రాష్ట్రపతి ఉపన్యాసాలు వివిధ సమస్యలతో సతమతమయ్యే భారతీయులకు ఎలా ఉపయోగపడతాయి? ఆయన/ఆమె భగవద్గీత గురించి చెప్పరు కదా? రాష్ట్రపతి ప్రజా ధనాన్ని వెచ్చించి ఏఏ దేశాలలో తన కుటుంబంతో విహార యాత్రలు ఎన్ని రోజులు చేసారో చెప్పడంలో ఉద్దేశమేమిటి? ప్రజలు తెలుసుకొని గుండెలు బాదుకొని చావాడానికా!
రాష్ట్రపతి అనుభవిస్తున్న ఆస్తులు ప్రజలకు ఎలా ఉపయోగపడతాయో తెలియదు! రాష్ట్రపతి భవన అందాలు పేదవాడి ఆర్తిని ఏ మాత్రం అర్ధం చేసుకోలేని విషయాలు.
మొఘల్ వనం, ఇళ్ళు లేని కోట్లమంది గుండె గుల్ల చేసే వైనం! ఔషధ మొక్కలు, పేదవాడికి అందని వైద్య సేవల్ని గుర్తు చేస్తాయి!! పేదల జీవితంలో రోషిణి గురించి మాట్లాడని ఈ రోషిణి ప్రాజెక్టు గురించి ఎందుకు ఇక్కడ ప్రస్తావన? ఇది ఒక శాంపిల్ గా చూస్తే మనకు విదితమయ్యే మన రాష్ట్రపతి పదవి విలువ.
ఒకవేళ మనం ఇదే వెబ్ సైట్ లో ఈ క్రింది విషయాలు తెలుసుకొంటే ఎలా ఉంటుంది ఊహించండి!!
ఈ రోజు మన రాష్ట్రపతి విధులు :
ఇప్పటి వరకూ మన రాష్ట్రపతి కార్యాలయం చొరవతో పరిష్కరించిన:
అ) రాష్ట్ర – కేంద్ర సమన్వయ సమస్యలు
ఆ) వివిధ విభాగ సంబంధిత సమస్యలు
ఇ) అత్యవసర వ్యక్తిగత సమస్యలు
ఈ) పర్యావరణ సమస్యలు
ఉ) ప్రాధమిక విద్యా వ్యవస్థ కు సంబంధించిన సమస్యలు
ఊ) దేశంలో ఉన్న జల వనరులకు సంబంధించిన సమస్యలు
ఋ) ప్రజా పంపిణీ వ్యవస్థ కు సంబంధించిన సమస్యలు
ఋ ) ప్రజా వైద్యశాలల స్థాపన, అభివృద్ది
ఎ) పేదలకు గృహ వసతి
ఏ) తాగు నీరు
ఐ) పారి శుద్ధ్యం
ఒ) స్త్రీ సంక్షేమం
ఓ) న్యాయ వ్యవస్థ
ఔ) సీనియర్ సిటిజెన్స్ సమస్యలు, పించను విషయాలు
అం) గ్రామీణ రోడ్లు
అః ) గ్రామీణ ఉపాధి
ఇప్పటివరకూ రాష్ట్రపతిగారు తమ పదవిని ఉపయోగించి అర్హులైన పేదలకు, నిరుద్యోగులకు, రోగులకు, ఖైదీలకు, విద్యార్థులకు, వృద్ధులకు, అనాధలకు, ఇతర ఆర్తులకు వ్యక్తిగతంగా వివిధ కార్యాలయాల ద్వారా సంస్థల ద్వారా అందచేసిన సహాయం వివరాలు ఈ క్రింది పట్టికలో చూడండి:
ఇది ఒక కాల్పనిక వ్యాసం కాదు. కడుపు మండిపోయిన ఎంతో మంది చెప్పిన విషయాలను కూర్చి వ్రాసింది. ఒక వ్యక్తి పైగా తమిళుడు ఒక సారి డా. కలాం కోయంబత్తూర్ లో ఒక కళాశాలకు వెళ్లి ఉపన్యాసం ఇచ్చిన తరువాత అన్న మాటలు చదివితే మీకే తెలుస్తుంది. నా తమిళ మిత్రుడు పంపిన ఈమెయిలు ఆధారంగా వ్రాస్తున్నాನು.
“వీళ్ళు పెద్దోళ్ళే గాని వీళ్ళ ద్వారా ఎంత మంది సహాయం పొందారో ఎవరికీ తెలియదు. ఇంత పెద్ద పదవి లో ఉండి వీళ్ళు ఎన్నో చెయ్యవచ్చు కాని చేయరు. ఇలా మంచి మంచి ఉపన్యాసాలు ఎంతో అవసరంలో ఉన్న వాళ్లకు ఏ మాత్రమూ సహాయపడవు. కలాం మంచోడే, కాని మాలాటి పేదోడికి ఏటి ఒరిగేది? అతను తన పలుకుబడి ఉపయోగించినా కొడుక్కి ఉచితంగా చదువు చెప్పిస్తాడా? అతను తలచుకొంటే చాల మందికి ఉచితంగా చదువు చెప్పించగలడు. అతను ఏ కాలేజి కి ఫోను చేసి నేను కలాంని మాట్లాడుతున్నాను. ఈ అమ్మాయికి మీరు సీటు ఇవ్వండి అని అంటే ఇవ్వరా? అంటే అలా అందరకూ అన్ని వేళలా చెయ్యాలని కాదు. నిజంగా అర్హులైన నిరుపేద విద్యార్థులకు ఇలా విద్యాదానం చేయించగలడు. అతని ఆఫీసులో చాలా మంది అధికారులు ఉంటారు కదా వాళ్ళు విచారించి సిఫార్సు చేయ వచ్చే !!”
ఒక మంచి వ్యక్తి రాష్ట్రపతి పదవి అధిరోహిస్తే ఎంతైనా చేయవచ్చు – మనసు ఉంటె మార్గాలెన్నో !
ఇప్పుడు మనకు మళ్ళీ కలాం కావాలా లేక ప్రణబ్ కావాలా అని కాదు ప్రశ్న. రాష్ట్రపతి పదవికే వన్నె తెచ్చే ఒక మంచి వ్యక్తి కావాలి. మన దేశంలో ప్రతిభకూ మంచితనానికి కొదవలేదు. అలాగే రాజకీయాలకు కూడా కనుక మనం మరొక ప్రతిభా పాటిల్ వచ్చినా ఆశ్చర్య పోకూడదు పైగా అందుకు సిద్ధంగా ఉంటేనే మంచిది కూడా.