తెలుగు జాతి ’విభజన’!

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

బమ్మెర పోతన  (1450–1510) బమ్మెర గ్రామం, వరంగల్ జిల్లా లో కేసన్న లక్ష్మమ్మ లకు జన్మించాడు అని చరిత్ర చెబుతోంది.  అప్పుడు ఆయన తెలంగాణా లో పుట్టాడా ఆంధ్ర లోనా రాయలసీమ లోనా అని ఎవరు అడగలేదు ఆయన ఒక సహజ తెలుగు కవి అని మాత్రం తెలుగు వారికి తెలుసు. ఆయన వ్రాసిన పద్యాలు ముఖ్యం గా గజేంద్ర మోక్షం లోనివి తెలుగు జీవులు వారి మనోగతాన్ని భావగంతునికి విన్నవించుకొనే సాధనాలుగా వాడుచున్నారు, ఇప్పటికీ.

ఇది కేవలం భాష యొక్క ప్రతిభ ఆయన ఛందస్సు లోని చమత్కారం. పదాలు అందరూ కూర్చ గలరు. కాని  ఛందోబద్ధం గా కూర్చి వాటిలో శక్తి ఉండేలా చేయగలగడం కొందరికే సాధ్యం ఆ కొందరు ఎటువంటి అరమరికలు, భేద భావాలు ఎరుగని స్వచ్చమైన తెలుగు  సౌరభాలు నిరంతరం వెదజల్లే తేట తెలుగు పుష్పాలు.  వీళ్ళకి మనం వారసులం
 
కాని ఈనాడు మనం, మనకు  మనమే శత్రువులమై ప్రాంతీయ భావాలతో మాండలీకాలు సాధనాలు గా మన ఉనికి, మన మూలాలు, మన భాషకున్న గొప్పదనం పక్కన పెట్టి కేవలం సంకుచిత భావాలతో ప్రపంచానికి మనం ఒక శాపానికి గురి అయిన జాతి గా చరిత్రలో నిలచిపోయాం.  మనతో సమానం గా ఉన్న కన్నడ, తమిళ జాతులు వారి ఉత్కృష్టతను కాపాడుకొంటూ అజేయంగా ఉన్నయి.  అక్కడా ప్రాంతీయ అసమానతలు, మాండలీకాలు ఇతర వైవిధ్యాలు ఉన్నాయి కాని వారంతా ఒక్కటే!!  తెలుగు వాచకం తెలంగాణా మాండలీకం లో ముద్రితమౌతుందా  ఇపుడు. అలాగే తెలుగు అకాడెమి రెండు గా చీలి తెలుగు అనువాదాలు ఆంద్ర, తెలంగాణా మాన్డలీకాలలో వేరు వేరు గా వ్రాసి ముద్రిస్తారా?  “ఆ… య్ బేగొచ్చేమని సెప్పారండి” అన్నా “జల్ది రారాదె”  అన్నా,   “సీకాకులం ఎల్పోయోచ్చ” అన్నా అది సొంత భాష ఏర్పాటు చేసుకోవడం కాదు, ఇదే యాస లో / మాండలీకం లో పాఠ్య  పుస్తకాలు ముద్రించమనీ కాదు మరి ఏమిటీ అంటే అందరికీ తెలుసు విద్య అందరికీ చేరలేదని. 
 
మనలోని వైవిధ్యానికి మూల కారణం మనం అందరికీ ప్రాధమిక విద్యను సైతం గత 6 దశాబ్దాలుగా ఇవ్వలేక పోవడం.  ఆడలేక మద్దేలోడు చందాన మన కనీస కర్త్యవ్యాన్ని విడచి విభజనలవైపు మక్కువ చూపాము. ఓటు బ్యాంకు రాజకీయ నాయకులు విద్యను కొందరికే అందేలా జాగ్రత్తపడి చక్కగా వారి సంక్షేమం చూసుకుంటున్నారు.   విద్య లేని  వింత పశువు అనే సామెత ను నిజం చేసి చాల మంది పేద విద్యా హీనులను వింత పశువులు గా తయారు చేసి వాడుకుంటున్న ఈ రాజకీయనాయకులే మనకు అంతర్గత శత్రువులు. మన తెలుగు రాజకీయ పార్టీల్లో ఏ  పార్టీ 100 శాతం అక్షరాక్షత తన ముఖ్య లక్ష్యం అని ప్రకటించింది?  
 
నమస్తే తెలంగాణా లో వాడిన తెలుగు ఏ ప్రాంతానిది ?
 
eapper namste telangana telangana epaper namaste
 
త్రిలింగం అనడానికి నోరు తిరుగని ఔత్తరాహికులు పెట్టిన పేరు తెలంగాణం. 230 BC   నుంచి 200 AD  వరకూ మన తెలుగువాళ్ళంతా శాతవాహన కాలం లో  ఒకే నాయకత్వం లో 400 ఏళ్ళు ఉన్నారు. దురదృష్టవశాత్తు అచ్చ తెనుగు నేల ఐన ఈ ప్రాంతం ఒకటి కాదు రెండు కాదు 17 శతాబ్దాల పాటు పరాయి పాలకుల చేతుల్లో మరీ ముఖ్యంగా బహమనీలు కుతుబ్ షాహీలు, మొగలుల పాలనలోనే ఉండిపోయింది. కృష్ణదేవరాయలు కూడా కుతుబ్ షాహీల నుండి ఈ ప్రాంతాన్ని వేరు చేయలేకపోయాడు.
 
తెగులు తో మన తెలుగు జాతి లో పుట్టిన ఈ కొద్ది మంది కుహనా అభ్యుదయ వాదులు  “కలుగ నేటికీ తల్లుల కడుపుచేటు” !!
 
ఇది మన తెలుగు జాతి విభజన కధ – కమామిషు !!
 
‘నీ పాద కమల సేవయు
నీ పాదార్చకుల తోడి నెయ్యమును నితం
తాపార భూతదయయును
దాపసమందారం నాకు దయసేయగదే’ 

Your views are valuable to us!