నవ వత్సర రూపమ్మున ప్లవ వచ్చెను వేగిరముగ పరుగుడి రారే యువ భావన రేకెత్తగ నవ జీవన రాగ రీతి నామతి జేయన్! వీచెను జల్ల గాలియదె వీణియ విన్పడె దివ్య వల్లరుల్ తోచెను నూత్న మార్గముల దూగిస లాడెను భవ్య జ్యోత్స్నలున్ గాచును నిన్ను, నీ జనుల, గామ్యము స్వాస్థ్యము సవ్య శోభలన్ దోచుగ, యీ యుగాది ప్లవ, దోసిలి నింపును హర్ష సంపదల్! వచ్చెనుగా వాసంతము తెచ్చెనుగా ద్రాక్ష తీయ తేనియ లిటకున్ విచ్చెనుగా తొలి రేకలు నచ్చెనుగా కోయిలమ్మ…