నూత్నాశంస

నవ వత్సర రూపమ్మున ప్లవ వచ్చెను వేగిరముగ పరుగుడి రారే యువ భావన రేకెత్తగ నవ జీవన రాగ రీతి నామతి జేయన్!        వీచెను జల్ల గాలియదె వీణియ విన్పడె దివ్య వల్లరుల్      తోచెను నూత్న మార్గముల  దూగిస లాడెను భవ్య జ్యోత్స్నలున్      గాచును నిన్ను, నీ జనుల, గామ్యము స్వాస్థ్యము సవ్య శోభలన్      దోచుగ, యీ యుగాది ప్లవ,  దోసిలి నింపును హర్ష సంపదల్!   వచ్చెనుగా వాసంతము  తెచ్చెనుగా ద్రాక్ష తీయ తేనియ లిటకున్ విచ్చెనుగా తొలి రేకలు  నచ్చెనుగా  కోయిలమ్మ…

సూర్యాయ విశ్వ చక్షుషే – భాగం 2

  సూర్యునికి సంబంధించిన యెన్నెన్నో ఆసక్తిదాయకమైన విశేషాలు మన పురాణాలలో అనేకం ఉన్నాయి. అసలు ప్రతిరోజూ సూర్యుని ముందు నిలబడి ఆదిత్య హృదయం చదవటం, సూర్య నమస్కారాలు చేయటం వల్ల, అనేక వ్యాధులు కూడా దూరమౌతాయని పురాణాలు చెబుతూనే వున్నాయి. కఫమూ,…

సూర్యాయ విశ్వ చక్షుషే – భాగం 1

  సూర్యుని విశ్వ చక్షువు (ప్రపంచానికి కళ్ళవంటి వాడు) అని తైత్తరియోపనిషత్ అంటోంది. నిజమేకదా! సూర్యుని ప్రకాశం లేనిదే, జగత్తు తమోమయం. సూర్యోదయం లేనినాడు, ప్రపంచం అంధకార బంధురం. అందుకే సూర్యుడే, జగతికి నేత్రములవంటివాడు అనటం యెంతో యుక్తి యుక్తం. అంతే…

మహాదేవి – నాల్గవ భాగం

చిక్షురుణ్ణి అల్లంత దూరం నుంచే చూసిన మహాదేవి కళ్ళు అరుణాలయ్యాయి. బాష్కల దుర్ముఖులను చీల్చి చెండాడినా, మహిసుడు రాకుండా మరో దానవుణ్ణి తనపైకి పంపటం చూసి వాడి వెర్రితనానికి నవ్వు వచ్చిందామెకు. ఆ దానవుణ్ణి ఒక మశకం వలెనే చూస్తూ, శంఖం…

మహాదేవి – మూడవ భాగం

  ఇలా సూతులవారు కథ మధ్యలో ఆపి, ఇంతకుముందు ప్రశ్నించిన స్త్రీ గురించి చూడటమేమిటి? అనుకుంటూ, తామూ వెనుదిరిగి చూశారు. విచిత్రం! ఆవిడ అక్కడ కనిపించలేదు. ఆమె ఎవరైఉంటుంది? ఆవిడ కనిపించకపోవటానికి కారణం సూతులవారికి అర్థమైపోయింది. మహిషాసురుడికి స్త్రీ చేతిలోనే చావు…

మహాదేవి – రెండవ భాగం

  “సామీ! మంటల్లోనుంచీ మనిషి బైటికి రావడం బాగానే ఉంది గానీ మరి తనొక రాజు కొడుకుననీ, తనకో రాజ్జముండాదనీ వాడికెట్టదెలిసింది? ఆణ్ణి ఎవురు పెంచి పెద్దజేసినారు?” అని దూసుకొచ్చింది పామరుని ప్రశ్న. మునుల్లో ఎవరో అతన్ని అడ్డుకున్నారు. “ఇదిగో నాయనలారా!…

మహాదేవి – మొదటి భాగం

  పవిత్ర నైమిశారణ్య ప్రాంతం. సూత మహర్షి చుట్టూ మునులందరూ కూర్చుని జగన్మాత మహిమాన్విత గాధలు విoటూ వాళ్ళందరూ తన్మయచిత్తులవుతున్నారు. ఒకదానికంటే మరొకటి ఎంతో వైవిధ్య భరితంగా ఉంటున్న ఆ గాధలు వింటుంటే మధ్య మధ్య తలెత్తే సందేహాలను కూడా అడగమని…

చుప్పనాతి – భాగం 16

  శార్వరి అందించిన ‘చుప్పనాతి ‘ నవలనంతా చదివిన కనకమ్మ గారు కళ్ళు మూసుకుని, కొంత సేపు మౌనంగా ఉండి పోయారు. “శిరీషా! నాకు వాల్మీకి తప్ప మరో ప్రపంచం లేదు. కానీ మావారికిటువంటి అడ్డంకులు లేవు. వారు బహుభాషా పండితులు,…

చుప్పనాతి – భాగం 15

  పూల మొక్కలకు నీళ్ళందిస్తున్న సీతను దూరం నుంచే చూసిందోసారి. ఆవుల చెంత ఆత్రంగా పాలు త్రాగుతున్న లేగ దూడలను కన్నీటి తెరల మధ్య వీక్షిస్తున్న సీతను చూసిందింకోసారి. మగ, ఆడ జింకల సల్లాపాలను విస్ఫారిత నేత్రాలతో ఆమె గమనించటం చూసింది…

చుప్పనాతి – భాగం 14

రావణుడు మళ్ళీ మారీచుని దగ్గరికి వెళ్ళి బంగారు లేడిగా పర్ణశాల సమీపాన సంచరించమన్నప్పుడు మారీచుడన్నాడట – “రాముడు నీవన్నట్టు కఠినుడూ, అకారణంగా శత్రు సంహారం చేసేవాడు కాదు. రామో విగ్రహవాన్ ధర్మః ధర్మమే రాముని రూపంలో అవతరించినదనవచ్చు. ఆ రాముడి శస్త్రాస్త్ర…