లేత ఆశల కౌగిలి స్థిరంగా మదిలో ముద్రించిన మోము క్రమంగా కాలంలో కరిగిపోదు అపురూపంగా తోచిన స్పర్శ చిరాకుగా ఎన్నడూ మారదు కాలం దేశం అతీతంగా ప్రేమ తన అస్తిత్వాన్ని చాటుతుంది అసహజమైన జీవనం లో సైతం అజరామరంగా…
Tag: తెలుగు కవితలు
ఋతుగీతం
చలికాచుకున్న ఆశలు రెక్కలు విప్పి విహరించే సమయం శిశిరం తరువాత వసంతం అందాలు, ఆనందాలు చవిచూసి ఉక్కిరిబిక్కిరౌతున్న సమయంలో విరబూసిన వసంతం పలికే ఆహ్వానం గ్రీష్మం స్వేద బిందువుల రూపంలొ కష్టమంతా కరిగిపొయి కల్మషాలు తొలగిపొయే సమయం వర్షాకాలం తడిసిన మనసులు…
కలల తీరాలు
ఊహ తెలిసిన నాటినుండీ మనసు కలలు కంటూనే ఉంది అడుగడుగునా ఆనంద స్వప్న తీరాలు చేరుకోవాలని చిన్ని చిన్ని ఆశలనుండి జీవిత గమ్యాలు ఆపకుండా ముందుకు పరిగెట్టిస్తూనే ఉన్నాయి కోరిన నెలవులకు చేరిననాడు మరిన్ని తీరాలు దూరాన నిలిచి ఊరిస్తున్నాయి…
కొండంత మేడ
కొండంత మేడ చిటికెన వేలంత పునాదిపై కొండంత మేడను ఎంత అందంగా కట్టిందో చూడు వెలిగే ఆ దీపం. **** మానవత ఏమి నిలబడి ఉంటుందోయ్ ఆ అద్దం ముందు అంత అందమైన సమాధి కనిపిస్తోంది అందులో ఆ ఏముందిలే …
కష్టార్జితపు మత్తు
కష్టార్జితపు మత్తు ఆమె పిల్లల ఆకలి మంటల్లో ఆతని కష్టార్జితపు మత్తు చమురు పోస్తుంది. ****** మౌనపు విత్తులు నీ పెదవులపై ఫలించిన మౌనాన్ని విత్తులుగా చల్లుతూ, నా మనసున ఓ ఉద్యానాన్ని పూయిస్తున్నాయి నీ చూపులు. ******** అనుభూతులు…
వీడ్కోలు
మౌనాలు కమ్ముకొస్తున్నాయి ఇక సెలవంటూ అనుభవాలు జ్ఞాపకాలుగా పరిణమిస్తున్నాయి కాలపు కథ సరే! మామూలే నేస్తం దూరం చేయడానికే దగ్గర చేస్తుందేమో ఇక ఇపుడు మనసుపై మరపు పొరలు కప్పాల్సిందే ఎన్నో గలగలలు కిలకిలలు మరపు రాని జ్ఞాపకాల దొంతరలనిక…
ఒలిపిరి
ఇంట్లోకి ఒలిపిరి, కిటికీ మూసెయ్యమంటుందామె ఎలా మూయను ఉన్నది అదొక్కటే. నీళ్లలో పిల్లలు వెన్నెల చొక్కాలు వేసుకుని ఎగురుతుంటారు నాకు ఎగరాలని ఉంది! రోడ్డు మేలు నా కన్న వానతో పిల్లల పాదాలతో వాళ్ల అరుపులతో తడుస్తుంది. గదిని తుడుచుకోవచ్చు కొన్ని…
మిస్డ్ కాల్
మంచు కత్తితో పొడిచి సాక్ష్యం లేకుండానే పారిపోయే మొరటు సరసం… మంచినిద్రలో చెంప పై ఛళ్లుక్కున చాచికొట్టి మాయమైన మెరుపు పిలుపు… అకవుల అద్దె ఏడ్పు, దొంగ ఆర్ద్రతలా స్వప్నపుష్పంపై వాలి చెరుస్తున్న మిడుతల దండులా నీ గొంతు……
శ్రావణమేఘాలు
అమ్మా నాన్న పిట్టలు ఎగిరిపోతాయిబరువును మోసిన చెట్టేభారంగా నిలబడుతుంది పిట్టలు ఎగురుకుంటూ వస్తాయిభారంగా నిలబడిన చెట్టేసంబరంగా నవ్వుతుంది. * * * బెస్ట్ హాఫ్ ఒత్తి మీదఒద్దికగా కూర్చొనిమౌనంగానన్ను స్పృశిస్తూవెలుగు మత్తుగా పెనవేసుకుంటూజ్ఞాపకాలు పలకరిస్తుంటేమౌనానికి మరోవైపునాలో నేను నీ నీడలో నేను