తెలుగునాట ఇంత గొప్ప యుద్ధం జరినట్లు మరెక్కడా దాఖలు లేదు. కవుల కలాలకు అందనంత గొప్ప పోరు జరిగింది. వర్ణించ నలవిగాని భీకర సమరమది.అటూ ఇటూ వీరులు కత్తులతో, బల్లాలతో పలుకరించుకున్నారు. రణవాద్యాలు మ్రోగాయి. శంఖాలు పలికాయి. కేకలతో, పెడబొబ్బలతో, కత్తుల మ్రోతతో, ఏనుగుల ఘీంకారాలతో, గుర్రాల గిట్టల చప్పుళ్ళతో కారెంపూడి రణక్షేత్రం మ్రోగిపోయింది.
Tag: పలనాటి యుద్ధం
అధ్యాయం 12 – పల్నాటి వీరభారతం
మండాది గుట్టుమట్టులు తెల్సుకోవడానికి అతనికి రెండు మూడు రోజులు పట్టింది. “యాదవ లంకన్న” ఆలమందలకు అధికారి. వేగులవాళ్ళు చెప్పిన మాటలతో పల్నేటి ఇరుకున పడాల్సివచ్చింది. లంకన్న, వట్టి చేతులతో మనుష్యుల్ని చంపగలడు. వీరపడాలు, వీరన్న లాంటి వాళ్ళు మందల్ని కాస్తున్నారని,…