వైకుంఠపాళీ – ముందుమాట : మొదటి భాగం

తొలిపలుకులు: ప్రకృతిలో నిత్యం ప్రసరించే అంతఃచేతనం మానవ హృదయాల్లో ప్రవేశించినపుడు అక్షరాలనే నక్షత్రాలు హృదయాకాశంలో తళుక్కుమంటాయి. మాటలనే మేఘాలు క్రమ్ముకుంటాయి. భావనాత్మక పరంపరలనే వర్షపు జల్లుల్లా జలజలా జాల్వారుతాయి. అప్పుడు, రససృష్టికి బీజం పడుతుంది. “మాటే ముత్యము – మాటే మృత్యువు”…