స్వస్తి ప్రజాభ్యామ్ – ఒక వివరణ

ప్రపంచ సాహిత్యంలో ప్రాచీన రచనగా ఖ్యాతి పొందిన ఋగ్వేదంలో “ధృవం తే రాజా వరుణో…” అన్న ఋక్కులోని “రాజ” శబ్దం పాలకుడు అన్న అర్థంలో వ్యాఖ్యానించడబడుతుంది. ఆవిధంగా పాలకులకు సంబంధించిన అత్యంత ప్రాచీన ప్రస్తావన భారతీయ గ్రంథాలలో ఉపయోగించబడింది. ఈ ఋక్కును…

చివరకు మిగిలింది

కత్తికిపిడి దగ్గర పదునులేదనేగానువ్విటు నుండి అటుకెళ్ళింది! నెత్తురుతడిలేని గుండెపైకిఇప్పటికెన్నిసార్లు విసిరావోమొద్దుబారిపోయింది. కాసేపు ఇలారాఈ గరుకు గుండెపైనేసానబెట్టుకుందువుగాని! గాయపడితేగానీ అదిగుండె కాలేదన్న నిజంతెలిసిపోయింది. నీ కత్తి నూర్పిళ్ళవెచ్చదనంలోబాధలేనితనంను కాక్‍టైల్ చేసుకోవడమేమిగిలింది.  

ఓ “అఫ్సూర్యుడు” గురించి…

అఫ్సర్ గారితో నా వ్యక్తిగత పరిచయం దాదాపు కొత్తదనే చెప్పాలి. కానీ ఓ కవిగా ఆయన నాకు ఒకటిన్నర దశాబ్దిగా తెలుసు. నేను “ఆంధ్రజ్యోతి” తిరుపతి ఎడిషన్ లో ప్రకటనల విభాగంలో అనువాదకుడిగా పనిచేస్తున్నప్పుడు ఆంధ్రజ్యోతి వారి ఇతర పత్రికలైన బాలజ్యోతి,…

తొలగిన తెరలు!

అపనమ్మకం జీవితానికి బంధువు. కనురెప్పలాడినంత అసంకల్పితంగా జీవితం గడిచిపోతుంది. రెప్పపాటుల మధ్య విరామంలో, కన్నులు తెలిపినంత మేరా నిన్ను అర్థం చేసుకున్నాను. నువ్వు నాకు అర్థమయ్యావని తెలిసినా నీ కళ్ళలో వెటకారం విహ్వలంగా అగుపడుతుంది. ఎందుకు? ఊసరవెల్లిలాంటి ఆకాశానికి తగిన జోడీ…

నీకే కృష్ణ!

అదియు నీకే కృష్ణ, ఇదియు నీకే కారంపప్పు నీకే, బెల్లం ముక్క నీకే దాగుడుమూతల, ఊగుడు బల్లల మూగేటి పిల్లల గోలలందు ఆ సాగేటి అల్లరి చిల్లరందు మోగేనె నీ కాలి గజ్జెలిపుడు! అన్న బలరాముడు నిను చిన్నబుచ్చేనని కన్నుల్లో నీరును…

రహదారి పై…

రోడ్డు చెప్పే కథలు వినడానికిబారులు తీరాయి చెట్లుదూరమెక్కువైందనితలకో ట్రాన్స్ మీటర్బిగించుకుంది కొండ ******* చక్రాలుముద్దులు పెడుతుంటేమెలికలు తిరిగిపోతోంది రోడ్డు ******* మనసు తర్కిస్తోంది…నలుచదరంగా ఉన్నాననిభూమి మోసం చేస్తోందాని?అది ప్రేమ కాకూడదా ?అంది రోడ్డు *******

మరపురాని వ్యక్తులు

బహుశా వెలితి జ్ఞాపకాల గుప్తనిధికి తాళంచెవి                     — (ముకుంద రామారావు – మరో మజిలీకి ముందు)  ************** కొద్దిరోజుల క్రితం పై వాక్యాలను చదవగానే నా జీవితంలో ఒకసారి ఎదురుపడి మరలా ఎప్పుడూ తారసపడని కొద్దిమంది మరపురాని వ్యక్తులు వరసగా…