వీధిలో నడుస్తున్నాను…కానీ సమాధి స్థితిలో ఉన్నానువిసుగొచ్చేసిందీ లోకమ్ పై! అసలేముందని ఇక్కడ?ధూళికలుషితమైన గాలిపొగఅంతులేని రొదబజారుల్లో లుకలుకలాడుతున్న జనంకాళ్ళ కింద రోడ్డు వేడెక్కిన పెనంచిరాకుపరాకుకరుకు మొహాల మొహర్లుపరుగెత్తడమే పరమావధిపరుగు…పరుగు…పరుగువిలువలనుండి, వలువలనుండితత్వం నుండి, సున్నితత్వంనుండి మనుషులుగా బతకడానికి కావల్సిన అన్నింటినుండీపరుగో…పరుగుమనదికాని, మనసునుండి రానిస్ప్రేలు, డీయొడరెంట్లుహాయ్…
Tag: poetic prose
తొలగిన తెరలు!
అపనమ్మకం జీవితానికి బంధువు. కనురెప్పలాడినంత అసంకల్పితంగా జీవితం గడిచిపోతుంది. రెప్పపాటుల మధ్య విరామంలో, కన్నులు తెలిపినంత మేరా నిన్ను అర్థం చేసుకున్నాను. నువ్వు నాకు అర్థమయ్యావని తెలిసినా నీ కళ్ళలో వెటకారం విహ్వలంగా అగుపడుతుంది. ఎందుకు? ఊసరవెల్లిలాంటి ఆకాశానికి తగిన జోడీ…
నర్తించే నక్షత్రానికి జన్మనివ్వాలంటే…
నర్తించే నక్షత్రానికి జన్మనివ్వాలంటే గుప్పెడు క్షణాల్ని దోసిట్లో పోసి ఇక నీ ఇష్టం అని ఆమె చినుకుల్లో చినుకుగా మాయమైంది..ఈ క్షణాలు కరిగిపోయేలోగా అతడిని కలుసుకోవాలి… చుట్టూ కురుస్తున్న వర్షం…. కొండకోనల్లో వర్షం.. గుండె లోయల్లో వర్షం.. లోకంలోని కల్మషాన్నంతటినీ కడిగేస్తూ…
దగ్ధ ఏకాంతం!
“దగ్ధ ఏకాంతం!” కవితాత్మక వచనం ఉదయం: ఇదో ఉన్మత్త భావమోహావేశ పాశబద్ధ క్షణం. క్షణికాలో, శాశ్వతాలో అర్థంకాని గూడార్థాల విపర్యాసాల్లోకి జారుతూ…జారుతూ…జారుతూ… జ్ఞాపకాల పెనుతాకిడికి వికలమై, వియోగం చెంది మనసు, ఆలోచన – వేటికవి విడివిడిగా తాండవిస్తున్నాయి. వాటి భయోద్విగ్న నర్తనావర్తనాలనుంచి…