గుర్తుకొచ్చి…

విడిపోవడమంటేమర్చిపోవడం కాదనుకొంటాను! గడచిపోయే జీవితంమడిచిపెట్టే ప్రతి పుటలోనిలచేవేవో? విడిచిపోయేవేవో? కానీ…మనసును తెరవాలేగానీపరిచితమైన పాత పుస్తకం వాసనలా జ్ఞాపకాలు చుట్టుకొంటాయి. కరుడుగట్టిన అనుభవంకన్నీటి చుక్కలో లీనమైనప్పుడుఎప్పుడో…ఎక్కడోఒక ఎడారి బాటలోవర్షం కురుస్తుంది.

రహదారి పై…

రోడ్డు చెప్పే కథలు వినడానికిబారులు తీరాయి చెట్లుదూరమెక్కువైందనితలకో ట్రాన్స్ మీటర్బిగించుకుంది కొండ ******* చక్రాలుముద్దులు పెడుతుంటేమెలికలు తిరిగిపోతోంది రోడ్డు ******* మనసు తర్కిస్తోంది…నలుచదరంగా ఉన్నాననిభూమి మోసం చేస్తోందాని?అది ప్రేమ కాకూడదా ?అంది రోడ్డు *******

ఊరట

నీకు, నాకు మాత్రమే అర్థమయ్యేభాషలో మాట్లాడుకోవడంనీకు, నాకు మాత్రమేఅర్థమయ్యే సంబరంనిన్నటి అస్తమయం తర్వాతఏ చెట్టులో ఏ కొత్త పువ్వుపూసిందోనని వెదుక్కునే సూరీడల్లేనీ కొత్త కొత్త మాటల్లోనిగారడీలను వెదుక్కొంటానుమెత్తని నీ చేతుల్లోనా భవిష్యత్తు ఒదిగివుందనిఅనుకుంటేనే ఆశ్చర్యం వేస్తుంది !కనిపించే ప్రతి ముఖంలోనూ నీవే!వ్యక్తి…

దగ్ధ ఏకాంతం!

“దగ్ధ ఏకాంతం!” కవితాత్మక వచనం ఉదయం: ఇదో ఉన్మత్త భావమోహావేశ పాశబద్ధ క్షణం. క్షణికాలో, శాశ్వతాలో అర్థంకాని గూడార్థాల విపర్యాసాల్లోకి జారుతూ…జారుతూ…జారుతూ… జ్ఞాపకాల పెనుతాకిడికి వికలమై, వియోగం చెంది మనసు, ఆలోచన – వేటికవి విడివిడిగా తాండవిస్తున్నాయి. వాటి భయోద్విగ్న నర్తనావర్తనాలనుంచి…