గత భాగం: జగత్తుకే మాతాపితలైన లక్ష్మీనారాయణులు వైకుంఠంలో మొదలుపెట్టిన వైకుంఠపాళీ క్రీడ రెండు జంటల జీవితాలలో పెను మార్పులు తీసుకురాబోతోంది. సుమతి-కేశవశర్మలు నారాయణుని ఆటకాయలు కాగా, రంజని-అనంత్ లక్ష్మీదేవి నడిపే పావులయ్యారు. అనంత్ పనిచేస్తున్న కంపెనీ మూతబడ్డంతో ఆ దంపతుల మధ్య గొడవలొస్తాయి.…
Author: Raghothama Rao C
వైకుంఠపాళీ – రెండవ భాగం
గత భాగం: జగత్తుకే మాతాపితలైన లక్ష్మీనారాయణులు వైకుంఠంలో మొదలుపెట్టిన వైకుంఠపాళీ క్రీడ రెండు జంటల జీవితాలలో పెను మార్పులు తీసుకురాబోతోంది. “ఏమిటి? ఉద్యోగం పోయిందా?” షాక్ కొట్టినట్టుగా ఉలిక్కిపడింది రంజని. “అవును. రాత్రికి రాత్రే కంపెనీని మూసేసారు.” నిస్తేజంగా కూలబడ్డాడు అనంత్.…
వైకుంఠపాళీ – ముందుమాట : మొదటి భాగం
తొలిపలుకులు: ప్రకృతిలో నిత్యం ప్రసరించే అంతఃచేతనం మానవ హృదయాల్లో ప్రవేశించినపుడు అక్షరాలనే నక్షత్రాలు హృదయాకాశంలో తళుక్కుమంటాయి. మాటలనే మేఘాలు క్రమ్ముకుంటాయి. భావనాత్మక పరంపరలనే వర్షపు జల్లుల్లా జలజలా జాల్వారుతాయి. అప్పుడు, రససృష్టికి బీజం పడుతుంది. “మాటే ముత్యము – మాటే మృత్యువు”…
డైరీ
పూయడం మర్చిపోయిన పూలచెట్టురంగు వెలిసిన సీతాకోకచిలుకరెక్కలుడిగిన పక్షిచెదిరిన మువ్వలుచిట్లిన గాజు పూసలు గల్లంతైన చిరునామా నిట్టూర్పు రొద చివరి పుటలో మాత్రంనిగూఢ రహస్యమొకటినిశ్శబ్దంగా నవ్వుతుంది!
తొలగిన తెరలు!
అపనమ్మకం జీవితానికి బంధువు. కనురెప్పలాడినంత అసంకల్పితంగా జీవితం గడిచిపోతుంది. రెప్పపాటుల మధ్య విరామంలో, కన్నులు తెలిపినంత మేరా నిన్ను అర్థం చేసుకున్నాను. నువ్వు నాకు అర్థమయ్యావని తెలిసినా నీ కళ్ళలో వెటకారం విహ్వలంగా అగుపడుతుంది. ఎందుకు? ఊసరవెల్లిలాంటి ఆకాశానికి తగిన జోడీ…
