ఎవడు చెప్పడ్రా ప్రజాధనం వృధా ఔతుందని?ప్రజలకు మరిన్ని మేలైన సేవలందించడానికి వీలౌతుందని ఎంతో కష్టపడి సంపాదించిన ఎంపీ సీటు కి వన్నె పెరుగుతుందని ఎం.ఎల్. ఏ. సీటు వదిలి ఎం.పీ సీటు కెళ్ళిన చిరంజీవి చిరకాలం ఒకటి వదలి మరొకటి పట్టుకొని…
Category: Member Categories
గతం
గతం లోకి నే చేసిన రంధ్రాన్వేషణ నా భవిష్య దారుల వెంట నా లోతు గోతులు తవ్వింది. ******* భానుడే వచ్చి కోప్పడినా తెల్లారలేదని బదులిచ్చే ఎన్నో జీవితాలు మత్తులో పడి కొట్టుకుంటున్నాయి ఆ పబ్బుల్లో పడి. *********…
నిజం
నిజం ఏమిటో నీ నీడకు తెలుసు గనుకే అదెప్పుడూ మట్టినంటి పెట్టుకునే ఉంటుంది. ******* అంతటి ఘోష వెనకున్నా తన మూగభావాలను వినిపించాలన్న తన కోరిక ఇప్పటికి తీరిందంటూ నా చెవిలో ఎంత హాయిగా పాడుతోందో చూడా శంఖం. *******…
సంకల్పం
తనంతటి ఆ విత్తు సంకల్పానికి చినుకంత సహకారమిస్తుంది ఆ ఆకాశం. ****** ఎత్తు పల్లాలను ఒకే సారి చూస్తూ కూడా నిలబడిందా ఆ మహావృక్షం ఎన్నో జీవితపాఠాలను నీకు చెప్పడానికి. ******* నిలకడ నేర్పాలని నేననుకుంటే నాకే ఒయ్యారం నేర్పిందా…
మతం, పెళ్ళి, సినిమా
“నమస్కారం గురూ!” “తస్కర శిష్యా! ఈ మస్కారమేలరా?” “ఇలా తిట్టడం భావ్యమా గురూ?” “వెర్రోహం! తిన్నదరగక్క వుత్తినే తిరిగే ఈలోకంలో తిట్లే దీవెనులురా!” “ఆహా! దివ్యోపదేశం, దివ్యోపదేశం!” “సరే, ఏదో సందేహాన్ని దేహంలో నింపుకొచ్చినట్టున్నావ్!” “అవును గురూ! మీరు అజ్ఞానులకే అజ్ఞానులు…
త్యాగం
త్యాగం అంటే ఏమిటో తెలుసుకుని ఆచరించడానికి మూణ్ణాళ్ళు సరిపోయాయా పువ్వ్వుకు మరి ఈ మనిషెలా మూడు యుగాలైనా నేర్వలేనివాడయ్యాడు? ******** ఈ మధ్యన ఆకాశం పదే పదే రంగులెందుకు మారుస్తోందోయ్ ఆ ఏముంది చేయి తిరిగిన నేతగాళ్ళనెందరినో తనవద్దకు చేర్చుకుందిగా…
చరమగీతం
పుడమి గుండె కరిగేలా తన చరమగీతాన్ని ఎంతందంగా పాడుతుంది ఆ వాన చినుకు. ******* అపుడు రాయి రాయి రాపిడిలో పుట్టిన నిప్పు ఇపుడు మనిషి మనిషి ఎదురైతేనే……… ******* అద్దం లాగే మనసూ పగిలితే ఒక్క రూపాన్నే లెక్కకు మించినన్ని సార్లు చూడాల్సి వస్తుంది. ********
హైకూలు
నా సాహసం ప్రియురాలి బుగ్గ ఎరుపు. ****** పేదవాడి ఆనందం ఆకాశంలో మెరుపు. ****** రోజూ చెరిగిపోతున్న రంగవల్లి అడవి తల్లి. ***** అమ్మ గర్భం అద్దెకు ష్! పరిణామం. ***** మార్కెట్లో కొత్త…
భోగట్టా
ఉన్నదంతా పాపపుసోమ్మే అని అందరికీ తెలిసినంతమాత్రాన చెల్లదు న్యాయస్థానం తీర్పు ఇవ్వాలి ఈ లోగా అసోమ్మంతా చక్కగా అనుభవిస్తూ న్యాయం, ధర్మం, చట్టం, నీతి గురించి బోధిస్తూ నాలుగు చెరగులా విలాసంగా సంచరిస్తుంటే ఈనాడు శ్రీధర్ బొమ్మలో పేదోడు వాపోయాడు వాడి…
