రచన: బులుసు వేంకటరమణయ్య ప్రచురణ: బుక్‍మన్స్ గమనిక: కాపీరైట్ హక్కులు పుస్తక ప్రచురణకర్తలవి. ఆనందగజపతి ప్రభువు విజయనగర సంస్థానాన్ని పాలిస్తున్న రోజులవి. ఆ మహారాజు రాజ్య వ్యవహారా లన్నిటినీ సమర్థుడైన దివాను బాధ్యతకు అప్పగించి తాను విద్వాంసులతో…
Category: కథ చెప్పనా!
అనగనగా…వినగవినగా….ఓ కథ!
“ఔనౌను” – మల్లాది రామకృష్ణశాస్త్రి కథ
మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు ’రామ భక్తి’ని పరిపూర్ణంగా సిద్ధించుకున్న ఓ రామ భక్తుని గురించి వ్రాసిన కథ "ఔనౌను."అయోధ్యలో, ఆ పవిత్ర జన్మభూమిలో శ్రీరామచంద్రునికి మళ్ళీ ఆలయం నిర్మిస్తున్న సందర్భంగా ఆ అద్భుతమైన కథను నా గొంతుతో చదివి, వినిపించాలన్న కోరికతో ఈ ధ్వని ముద్రికను చేసాను.వినండి. విమర్శించండి.
గజపతుల నాటి గాధలు – యుక్తి
రచన: బులుసు వేంకటరమణయ్య ప్రచురణ: బుక్‍మన్స్ గమనిక: కాపీరైట్ హక్కులు పుస్తక ప్రచురణకర్తలవి. ఇది రెండువందల ఏళ్ళ కిందటి మాట. విజయనగరం సంస్థానం దివాను పూసపాటి సీతారామరాజుగారు కోటలోని మోతీమహల్లో కచేరి చేస్తూ వున్నారు. దివానుగారంటే అందరికీ భయమే!…
డిల్లీలో దాలినాయుడు
తాను పుట్టి బుద్దెరిగి నలబయ్యైదేళ్ళు దాటీవరకూ విజయనగరం కోటకన్నా విశాలమైన కట్టడాన్ని గాని, గంటస్తంభం కన్నా దర్జాగా ఉన్న కట్టడాన్ని గాని చూడని దాలినాయుడు, డిల్లీలో మూడు రోజులూ తిరిగి కుతుబ్‌మీనార్, ఎర్రకోట, ఇలాటివన్నీ వింత వింతగా చూసేడు. వీటికి…
మా ఊరి కథ
“అరుగులన్నిటి లోన ఏ అరుగు మేలు – పండితులు కూర్చోండు మా అరుగు మేలు.” “అమ్మా అరుగులు అంటే ఏమిటే?” – ఒక్కగానొక్క కూతురు లక్ష్మి అడిగింది అపర్ణని. అపర్ణ ఈ మధ్య నే గ్రీన్ కార్డ్ పొంది అమెరికా పౌరురాలుగా మారింది.…
ఇద్దరు నాన్నలు
జోరున కురుస్తున్న వర్షం. రైతు ఒకడు విసిరి విసిరి చల్లుతున్న విత్తనాల్లా పడుతున్న జల్లులు. నీళ్ళతొట్టిలో పసిపాప చేతులాడిస్తుంటే తుళ్ళిపడి నీళ్ళ శబ్దంలా అప్పుడప్పుడూ వస్తున్న ఉరుములు. ఆ రాత్రి, ఆ రైల్వే ప్లాట్‍ఫామ్ శవాసనం వేసిన వానిలా…
పిచ్చి పోలి
భళ్లున తెల్లవారడంతోనే పోలి ప్రసవించింది. పండంటి మగపిల్లాడిని కన్నది అన్న వార్త వూరంతా పాకింది. శాంతకు తెలియకుండానే పోలికి పుట్టిన బిడ్డ కోసం లావాదేవీలు మొదలయ్యాయి. సరుకుల కొట్టు కాంతయ్యకు పెళ్లయి యిరవై యేళ్లయినా పిల్లలు కలగలేదు. దగ్గిర బంధువుల…
ఒంటిస్థంభం మేడ అనబడే దీపస్థంభం కథ
నిండు పున్నమి వెలుగు రేఖ ఒకటి పడి కన్యాకుమారి గర్భాలయంలో అమ్మవారి ముక్కుపుడక తళుక్కున మెరిసింది. కైలాసంలో పార్వతీదేవి పెదవులపై చిరునవ్వుల దివ్వెలు తళతళమన్నాయి. కానీ ధ్యానమగ్నుడైన శివయ్యలో కదలిక లేదు. మరోమారు మరో వెన్నెల రేఖ పడడం, కన్యాకుమారి…
ఒక ఆదివారం
చటక్కున మెలకువయింది రాఘవ్ కు. గడియారం చూసి “అదేమిటీ ఇంత తెల్లవారు జామున మెలకువ?” అని గొణుక్కున్నాడు. టైం ఏడున్నర. కానీ ఆరోజు ఆదివారం కాబట్టి రాఘవ్ కు పది గంటలకు మాత్రమే తెల్లవారుతుంది . గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. కానీ…
ఝడుపు కథ – నాలుగో (చివరి) భాగం
మర్నాడు పొద్దున్నే గుడి దగ్గరికి ఆసక్తితో చాలామంది వచ్చారు. ఊళ్ళో పెద్దలు వచ్చారు. రామలక్ష్మి, లక్షమ్మ, గొల్లరాముడు, వరాలు కూడా వచ్చారు. కిందటి రాత్రి చేతబడి విషయము తెలియడముతో పోలీసులు కూడా పట్నం నుండీ వచ్చారు. సుందరశాస్త్రీ , దీక్షితులూ గుడి బయట…